వైసీపీ నేత ఘరానా మోసం.. చిట్టీల పేర రూ.70లక్షలకు కుచ్చుటోపీ.!
Publish Date:Aug 21, 2026
Advertisement
చిట్టీల పేరుతో నిరుపేదలను, రెక్కాడితే కానీ డొక్కాడని మత్యకారులను నిలువునా మోసం చేసిన ఉదంతమింది. వైసీపీ సీనియర్ నాయుడు, మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడే ఈ మోసానికి పాల్పడ్డాడు. రెండు దశాబ్దాలుగా గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల వ్యాపారం చేస్తున్న మండాది శ్రీనివాసరావు, మహాలక్ష్మి దంపతులు స్థానక మత్స్యకారులు కాయకష్టం చేసి కట్టిన చిట్టీల సొమ్ము ఎగవేశారు. అదేంటని అడిగిన వారిపై దౌర్జన్యాలు, బెదరింపులకు దిగారు. చిట్టీల పేరుతో మోసం చేసిన సొమ్ములతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో కోట్ల ఆస్తులు కూడబెట్టారు. వీరి నిర్వాకంపై గత నెల 31న గుడివాడ వన్ టౌన్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసినా వారు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. చివరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో తెగించేసిన మండా శ్రీనివాసరావు దంపతులు.. ఐపీ పెట్టేశారు. ఈ మేరకు 28 మంది బాధితులకు ఐపీ నోటీసులు ఇచ్చి పైసా కూడా ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు. ఈ క్రమంలోనే రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసేందుకు ప్రయత్నించిన మండాది శ్రీనివాసరావు దంపతులను బాధితులు అడ్డగించి పోలీసులకు అప్పగించారు. పేదల కష్టార్జితమైన రూ.70 లక్షల మొత్తంతో నిర్వాహకులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ అండదండలతోనే ఈ దందాను సాగించారని బాధితులు ఆరోపిస్తున్నారు, తమ సొమ్ముతమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఉండగా.. పోలీసుల మండాది శ్రీనివాసరావు దంపతులపై 51.79 లక్ష రూపాయల ఎగవేతపై చీటింగ్ కేసు నమోదు చేశారు. చిట్టీల పేరుతో మోసం చేస్తే ఐపీ చెల్లదని పోలీసులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేశామనీ, విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామనీ హామీ ఇచ్చారు. YCp leader chitti scam in Gudiwada, 70 lakhs fraud, Kodali Nani associat, Gudivada NTR colony, Andhra Pradesh, TeluguOne
http://www.teluguone.com/news/content/ycp-leader-chitti--scam-in-gudiwada-36-229413.html





