ఏదో సినిమాలో లవ్ చేయాలా వద్దా అని ఓ పాట ఉంది. హీరోయిన్ ను ప్రేమించాలా వద్దా అన్న సందిగ్ధంలో హీరో ఆ పాట పాడతాడు. కానీ ఇప్పుడు వైసీపీ కూడా ఒక సందిగ్ధంలో ఉంది. అది సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించి అడ్డంగా దొరికిపోయిన దగుల్బాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్య తీసుకోవాలా వద్దా అన్నదే ఇప్పుడు వైసీపీ సందిగ్ధత. మహిళలో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా బుక్ అయిన ఎంపీ మాధవ్ ను క్షణం ఆలస్యం చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, చర్య తీసుకోవాలా, తీసుకుంటే ఏ చర్య తీసుకోవాలి అంటూ గురువారం(ఆగస్టు4) సాయంత్రం నుంచి వైసీపీ అధినేత జగన్ మల్ల గుల్లాలు పడుతున్నారు.
పార్టీ సీనియర్లతో మాధవ్ పై చర్య తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎలాంటి చర్య తీసుకోవాలి అని ఎడతెగకుండా చర్చిస్తున్నారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించి దొరికిపోయిన గోరంట్ల మాధవ్ పై చర్య తీసుకునే విషయంలో ఇంతగా తర్జన భర్జన పడుతున్న వైసీపీ అధినేత జగన్.. తనపైనా, తన సర్కార్ పైనా సామాజిక మాధ్యమంలో విమర్శిస్తూ పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయించే విషయంలో ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తొలుత సీఎంవో నుంచి గోరంట్ల మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు లీకులు ఇచ్చారు.
మళ్లీ కొద్ది సేపటికే ఆయన చేత రాజీనామా చేయించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అది కూడా ఖరారు కాలేదు. అసలు చర్య తీసుకోవాలా వద్దా అన్న విషయంపైనే జగన్ పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోగా ప్రభుత్వ సలహాదారు సజ్జల మీడియా ముందుకు వచ్చి.. గోరంట్లపై చర్య తీసుకోవాలా వద్దా అన్ని నిర్ణయానికి ఇంకా రాలేదనీ, ఆయన ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఖండించారనీ, మార్ఫింగ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారనీ చెప్పారు. ఒక వేళ ఆ వీడియో మార్ఫింగ్ కాలేదని తేలితే మాధవ్ పై కఠిన చర్యలు తప్పవని మీియా ముందు సజ్జల చెప్పారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని తొలుత నేతలు లీకులిచ్చారు. అయితే మాధవ్‌తోనే రాజీనామా చేయించాలని కొందరు నేతలు సూచించారనీ, దాంతో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.
కాగా ఎంపీ గోరంట్ల మాధవ్ఓ మహిళ తో గోరంట్ల న్యూడ్ గా వీడియో కాల్ లో మాట్లాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమం ద్వారా వెలుగులోనికి రావడంతో ఆయన పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గతంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లు కూడా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి దొరికిపోయిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలకు మహిళల పట్ల గౌరవం లేదనడానికి గతంలో అంబటి, అవంతి శ్రీనివాస్ లు, ఇప్పుడు గోరంట్ల మాధవ్ లే నిదర్శనమని సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-is-in-dilema-weather-to-take-action-on-gorantla-on-not-39-141254.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.