జగన్ స్టైలే వేరు.. వైసీపీ తీరే వేరు!

Publish Date:Jul 7, 2022

Advertisement

పార్టీ పండుగ అంటే ఎవరైనా ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తారు. కానీ పార్టీ నుంచి ఒక పెద్ద తలకాయకు ఉద్వాసన చెప్పడానికి పార్టీ పండుగను వేదికగా చేసుకోరు. ఏ పార్టీ అయినా పార్టీ వార్షికోత్సవ సభలను, ప్లీనరీలను అత్యంత ఘనంగా జరుపుకుంటుంది. ఇందు కోసం విస్తృత ఏర్పాట్లూ చేస్తారు. అందులో అసహజమేమీ లేదు. అటువంటి సభలలో సదస్సులలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే వారికి పార్టీ కండువాలు కప్పి తాము బలోపేతం అవుతున్నామని చాటుకుంటారు. అయితే వైసీపీ అధినేత జగన్ స్టైలే వేరు. ఆయన పార్టీని నడిపే తీరే వేరు. వైఎస్ జయంతి సందర్బంగా జూన్ 8, 9 తేదీలలో వైసీపీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన జగన్.. పార్టీ అధికారంలో ఉన్న ఈ మూడేళ్లలో ప్లీనరీ నిర్వహించడం ఇదే తొలిసారి.

అయితే ఈ ప్లీనరీలో చేరికలు లేవు, పార్టీ విజయాల సంబరాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం పార్టీ వర్గాల ద్వారా స్పష్టమౌతున్నది ఏమిటంటే పార్టీ గౌరవాధ్యక్ష బాధ్యతల నుంచి జగన్ తల్లి విజయమ్మను గౌరవంగా తప్పించడం.  ఆమె రాజీనామాతో ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అవుతాయని పార్టీ వర్గాలే అంటున్నాయి. నాగార్జున వర్సిటీ ఎదురుగా ఉన్న మైదానాన్ని ఇప్పటికే ప్లీనరీ కోసం సిద్ధం చేశారు. ప్లీనరీ నిర్వహణ కోసం 20 కమిటీలు వేశారు. ఒంగోలులో జరిగిన మహానాడు విజయంతో వైసీపీ ప్లీనరీని అంతకు మించి విజయవంతం చేయాలన్న పట్టుదలతో ఉన్న జగన్ ఇప్పటికే పార్టీ నేతలకు ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

శుక్రవారం నుంచీ ప్రారంభం కానున్న ప్లీనరీకి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకూ వచ్చాయో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, హోమంత్రి తానేటి వనిత, మంత్రులు జోగి రమేష్ తదితరులు బుధవారం పర్యవేక్షించారు. ప్లీనరీ ఏర్పాట్లూ సన్నాహాల సంగతి పక్కన పెడితే పార్టీ గౌరవాధ్యక్షురాలిని‘గౌరవం’గా సాగనంపేందుకే ప్లీనరీ ఏర్పాటు చేశారా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆమె చేతనే గౌరవాధ్యక్లురాలి పదవికి రాజీనామా చేయించి పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను ఏన్నుకునే కార్యక్రమానికి ఈ ప్లీనరీ వేదిక కాబోతున్నదని బెబుతున్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ బై లాస్ ను ఎన్నికల సంఘం నిబంధనలు, నియమావళికి అనుగుణంగా మార్పులు చేయబోతున్నట్లు వెల్లడించడమే ఇందుకు సంకేతమని పరిశీలకులు అంటున్నారు. అంటే అర్ధం ఏపీలో వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ, తెలంగాణలో ఆమె కుమార్తె స్థాపించిన వైఎస్సార్ టీపీకి కూడా గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. ఇలా ఒకే వ్యక్తి రెండు రాష్ట్రాలలో రెండు పార్టీలకు గౌరవాధ్యక్షురాలిగా ఉండటం సరికాదని పరోక్షంగా చెప్పడంగానే భావించాలని పరిశీలకులు అంటున్నారు.

 ఇక పోతే పార్టీ గౌరవాధ్యక్షురాలిని తొలగించడం అన్నది పార్టీ బైలాస్ ను సవరిస్తే తప్ప సాధ్యం కాదు కనుక ఆమె చేతనే రాజీనామా చేయించాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై తల్లికి ఇప్పటికే స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఆమె కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసిందంటున్నారు. కేవలం రాజీనామా విషయం ప్రకటించడానికే విజయమ్మప్లీనరీకి హాజరు కానున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

అక్రమాస్తుల కేసులో జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలను భుజస్కందాలపై వేసుకుని మోసిన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలను పార్టీకి దూరం పెట్టడంపై జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. జగన్ తీరుతో విసిగి వేసారిన సోదరి షర్మిల తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్నారు. కుమారుడి తీరుతో మనస్తాపానికి గురై విజయమ్మ కూడా కుమార్తె వెంటే నడుస్తున్నారని వైసీపీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఇక ఇప్పుడు విజయమ్మ చేత పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించి ఆమెకు పార్టీతో ఎటువంటి సంబంధం లేకుండా చేయడమే లక్ష్యాన్ని జగన్ ప్లీనరీ వేదికగా నెరవేర్చుకోనున్నరని అంటున్నారు. 

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.