పిఠాపురంలో చేతులెత్తేసిన వైసీపీ.. పవన్ కల్యాణ్ రూట్ క్లియర్!

Publish Date:Apr 10, 2024

Advertisement

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఎత్తులు వేస్తున్నది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించడమే లక్ష్యంగా ఆ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించింది. వైసీపీ అనుకూల సోషల్ మీడియా సంస్థలు పిఠాపురంలోనే తిష్ఠవేసి వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నాయి. పిఠాపురంలో పవన్ కు ప్రత్యర్థిగా కాకినాడ ఎంపీ వంగాగీతను బరిలోని దించిన జగన్ ఆమె విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వంగా గీతం గతంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తాను స్వయంగా పోటీలో లేకపోయినా.. పవన్ కల్యాణ్ పై విమర్శలు, విసుర్లతో ఆయన చెలరేగిపోతున్నారు. కాపు సంఘాల సమావేశాలలో పాల్గొంటూ ఆయన వైసీపీ విజయం కోసం పని చేస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా వైసీపీ పిఠాపురాన్ని చుట్టేస్తున్నట్లు కనిపిస్తున్నా.. ఆ పార్టీ క్యాడర్ లో మాత్రం గెలుపు సాధిస్తామన్న నమ్మకం కానీ, విశ్వాసం కానీ కనిపించడం లేదు. వంగా గీత ప్రచారం నామ్ కే వాస్తేగా జరుగుతున్నది. ఆమె తన ప్రచారానికి కనీస వ్యయం చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దీంతో క్యాడర్ ఆమె తరఫున ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. ఇక జగన్ ఓటమే ధ్యేయం అంటూ అధినేత ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన మిథున్ రెడ్డి మొదట్లో కొద్దిగా హడావుడి చేసినా ఇప్పుుడు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదు.   సొంత నియోజకవర్గం రాజంపేటలో  గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆయన పిఠాపురాన్ని గాలికి వదిలేసి తన విజయం కోసం రాజంపేటలోనే పని చేసుకుంటున్నారు. 

దీంతో సమన్వయం లేకుండా పిఠాపురంలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వంగాగీతకు పార్టీ టికెట్ కేటాయించడంతో అక్కడి సిట్టింగ్ ఎం్మెల్యే పందెం దొరబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ స్వయంగా ఆయనను తాడేపల్లికి పిలిపించుకుని మరీ బుజ్జగించినా ఫలితం లేకపోయింది. మరో వైపు దొరబాబు అనుచరగణం అంతా జనసేన తరఫున సీరియస్ గా పని చేస్తున్నారు. స్వయంగా దొరబాబే వారిని జనసేనకు మద్దుతుగా నిలవమని ఆదేశించారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. త్వరలో ఆయన కూడా జనసేన గూటికి చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. 

ఇక జనసేన పిఠాపురం ఇన్ చార్జ్ మకినీడి శేషు కుమారి వైసీపీ గూటికి చేరారు. దీంతో వైసీపీ సంబరాలు చేసుకుంది. గత ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేసిన ఆమెకు 28 వేల ఓట్లు వచ్చాయి. అయితే  గత ఎన్నికలలో ఓటమి తరువాత శేషు కుమారి ఎన్నడూ పార్టీ కార్యక్రమాల్లో కానీ, రాజకీయంగా కానీ క్రియాశీలంగా వ్యవహరించింది లేదు. ఇటీవల వైసీపీ గూటికి చేరిన తరువాత ఆమె పూర్తిగా స్తబ్దుగా మారిపోయారు. మొత్తం మీద దిశ, దశ లేని ప్రచార వ్యూహాలతో, సమన్వయ లోపంతో పిఠాపురంలో వైసీపీ ఎన్నికలకు ముందే చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే పిఠాపురంలో పవన్ కు రూట్ క్లియర్ అయిపోయినట్లేనని అంటున్నారు.  

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.