జగన్ సర్కార్ కు ఇక చుక్కలే..!

Publish Date:Jul 19, 2022

Advertisement

ఇక ఏపీలో జగన్ సర్కార్ కు కేంద్రంలోని మోడీ సర్కార్ చుక్కులు చూపించనుందా? జగన్ కు గతంలోలా పీఎంతో భేటీలకు అప్పాయింట్ మెంట్ అంత సులువుగా దొరకదా? అన్న ప్రశ్నలకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం రాక మానదు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వైసీపీ అవసరం ఎంతో ఉందని భావించిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఆ పబ్బం గడుపుకునేందుకు జగన్ ను ఆ ఒక్కటి దక్క (ప్రత్యేక హోదా) ఏ వరం కోరుకున్నా ఇచ్చేస్తానని హామీ ఇచ్చింది. పాపం జగన్ గారికి ప్రత్యేక హోదా అడుగుదామన్న యోచనే లేదు. అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఏం కోరడానికి ఆయన ఈ మూడేళ్లలో ఎన్నడూ కనీసం ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఎంత సేపూ నవరత్నాలకు డబ్బులెలా? అప్పులెలా? అన్న యోచనతోనే కాలం గడిపే పరిస్థితాయె.

సరే తీరా రాష్ట్ర పతి ఎన్నిక సమయం దగ్గర పడే సరికి మహారాష్ట్ర పరిణామాలూ, అనూహ్యంగా విపక్షాల నుంచి ముర్ము అభ్యర్థిత్వానికి వచ్చిన సానుకూల స్పందనతో బీజేపీకి వైసీపీ అవసరం అంతాగా అవసరంలేని పరిస్థితి వచ్చింది. అందుకే ముర్ము అభ్యర్థిత్వానికి తాము వైసీపీ మద్దతు కోరలేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కుండబద్దలు కొట్టేశారు. ఏ రకంగా చూసినా వైసీపీ తమకు అంటరాని పార్టీయేనని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు రాష్ట్రపతి ఎన్నికకు ముందు సంచలనం సృష్టించాయి. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్రపతి ఎన్నికకు ముందు అనవసర రాద్ధాంతం ఎందుకు అనుకున్న బీజేపీ అగ్రనాయకత్వం వైసీపీ మద్దతు కోరామనీ, సత్యకుమార్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమనీ ఓ ప్రకటన చేసి ఊరుకుంది.

అయితే అక్కడితో కథ ముగియలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీ తన అసలు ఉద్దేశమేమిటో ఎటువంటి భేషజాలూ లేకుండా వెల్లడించేసింది. ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థికి జగన్ మద్దతు ప్రకటించారు. బీజేపీ ఆయనను మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిందా లేదా అన్నది పక్కన పెడితే ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి వైసీపీకి ఆహ్వానం అందలేదు.  దీనిని బట్టే ముందు ముందు వైసీపీ విషయంలో బీజేపీ తీరు ఎలా ఉండబోతున్నదన్నది అవగతమైపోతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ వైసీపీని ఇక లెక్కలోకి తీసుకునే అవకాశమే లేదంటున్నారు.

ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వైసీపీకి జరిగిన మర్యాదే ఈ విషయాన్ని తేటతెల్లం చేసిందని చెబుతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కడ్‌ నామినేషన్‌లో ప్రధాని, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు పాల్గొన్నాయి. కానీ వైసీపీ ఎంపీల జాడ మాత్రం కనిపించలేదు.   ఎందుకంటే వారికి ఆహ్వానం రాలేదు. మద్దతు ప్రకటించినా ఎందుకు ఆహ్వానం అందలేదన్న ప్రశ్నకు సమాధానం దొరకడం పెద్ద కష్టమేమీ కాదు.  

ఏది ఏమైనా ఇంత కాలం కేంద్రాన్ని వైసీపీ  కోరినవన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధం లేని వ్యక్తిగత విషయాలేననీ, అందుకే ఇక ఆ పార్టీని సాధ్యమైనంత దూరం పెట్టాలనీ బీజేపీ అధిష్ఠానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసిందంటున్నారు. వాస్తవానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ బీజేపీకి వైసీపీ అంటరాని పార్టీ అన్న వ్యాఖ్య  చేయడానికి బీజేపీ అధిష్ఠానం నిర్ణయమే కారణమని కూడా పరిశీలకులు అంటున్నారు.

ఇందుకు నిదర్శనంగా మంగళవారం హస్తినలో జరిగిన అఖిలపక్ష భేటీని వారు ఉదాహరణగా చెబుతున్నారు. శ్రీలంక సంక్షోభంపై చర్చించడానికి నిర్వహించిన ఆ భేటీలో రాష్ట్రాల అడ్డగోలు అప్పులపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం తీరును టీఆర్ఎస్ ఖండించగలిగింది కానీ.. వైసీపీ కిమ్మనలేని పరిస్థితిలో పడింది. వాస్తవానికి మంగళవారం నాటి అఖిల పక్ష భేటీలో అప్పులపై కేంద్రం చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లక్ష్యం రెండు తెలుగు రాష్ట్రాలే అనడంలో సందేహం లేదు. పేరుకు పది రాష్ట్రాలలో అప్పులు ప్రమాదకర స్థాయికి చేరాయని కేంద్రం పేర్కొన్నా.. కేంద్రం దృష్టి మాత్రం ఏపీ, తెలంగాణపైనే ఉందన్నది సుస్పష్టం. తెలంగాణ పేరును ప్రస్తావించడంపై తెరాస ఎంపీలు మండి పడ్డారు. కేంద్రం అప్పుల మాటేమిటని నిలదీశారు. అదే సమయంలో వైసీపీ మాత్రం ఆమోదయోగ్యం కాని మౌనం పాటించింది.

కేంద్రం టార్గెట్ చేసిందని స్పష్టమౌతున్నా కనీస స్పందన కూడా కరవైంది. అడ్డగోలు అప్పులకు ఇంత కాలం అంతే అడ్డగోలుగా అనుమతులిస్తూ వైసీపీకి ఫేవర్ చేసిన కేంద్రం ఇప్పుడు ఒక్క సారిగా జగన్ పార్టీని కార్నర్ చేయడంలోనే ఆ పార్టీ పట్ల ముందు ముందు కేంద్రం వైఖరి ఎలా ఉండబోతోందో అవగతమైందని పరిశీలకులు విశ్లేషిన్తున్నారు. ఇక ముందు వైసీపీకి అప్పలు పుట్టడం గతంలోలా కేక్ వాక్ గా ఉండదని అంటున్నారు. బటన్ నొక్కాలంటే జగన్ ఇక వంద సార్లు ఆలోచించాల్సిందేనంటున్నారు. ఇప్పటికే సంక్షేమంలో కోతపై జనంలో తీవ్ర నిరసన వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఇక వైసీపీ సర్కార్ కు ప్రతి రోజూ గండంగానే గడుస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

By
en-us Political News

  
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2018 ఎన్నికల ప్రచార సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా ధాఖలు చేసిన పరువునష్టం కేసు సుల్తాన్ పూర్ లోని ప్రజాప్రతినిథుల ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.