ఈ నలుగురికీ సీన్ అర్ధమైపోయిందా?

Publish Date:May 16, 2024

Advertisement

వైసీపీలో  నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపుపై ఆశలు ఇసుమంతైనా కనిపించడం లేదు. పార్టీ అధినేత జగన్ నుంచి, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల వరకూ అందరూ మౌనముద్రలోకి వెళ్లిపోయారు. అంబటి వంటి ఒకరిద్దరూ, ఇంత కాలం పార్టీకీ, ప్రభుత్వానికీ  సలహాలిచ్చిన సజ్జల మాత్రం ఎన్నికల సంఘంపైనా, పోలీసులపైనా విమర్శలు గుప్పిస్తూ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారు. ఇక  అవసరమున్నా లేకున్నా విపక్షంపై నోరేసుకు పడిపోయే రోజా, కొడాలి వంటి వారు ఆశ్చర్యకరంగా మౌనముద్రలోకి వెళ్లిపోయారు. పోలింగ్ రోజున తనకు సొంత పార్టీ వారే వ్యతిరేకంగా పని చేశారంటూ ఆరోపణలకు గుప్పించిన రోజా ఆ తరువాత మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఇక కొడాలి నాని అయితే పోలింగ్ రోజున తీరిగ్గా ఎప్పుడో సాయంత్రం వచ్చి కుటుంబంతో సహా ఓటేసి వెళ్లిపోయారు. ఎక్కడా ఎన్నికల తీరు గురించి మాట్లాడలేదు. తన విజయంపై ధీమా వ్యక్తం చేయలేదు. ఇక గన్నవరం ఎమ్మెల్యే వంశీ అయితే పోలింగ్ రోజున ఏదో హల్ చల్ చేయాలని ప్రయత్నించి భగంపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా ఆయనైతే పోలింగ్ కు ముందే ఇవే తన చివరి ఎన్నికలు, వచ్చే ఎన్నికలలో పోటీ చేయను అని ప్రకటించేసి ముందుగానే గెలుపు ఆశలు వదిలేసుకున్నారు. 

దీంతో ఇప్పుడు రాష్ట్ర మంతటా వైసీపీ ఫైర్ బ్రాండ్ బ్యాచ్ గా పేరుపడ్డ ఈ నలుగురిపైనే చర్చ జరుగుతోంది. వీరి పరిస్థితి ఏమిటి? గెలుపా? ఓటమా? అన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది.  ఆ ఫైర్ బ్రాండ్ బ్యాచే  కొడాలి నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ. అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు కూడా ఉన్నప్పటికీ, పార్టీ అధినేతే వారి గెలుపు చీటీ చింపేసి నియోజకవర్గం మార్చేశారు కనుక అటువంటి వారిపై పెద్దగా చర్చ జరగడం లేదు.  

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వీరు వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారు. జగన్ మీద ఈగ వాలితే ఆ ఈగను కూడా చంద్రబాబే పంపించారు అనే స్థాయిలో విరుచుకుపడేవారు. అటువంటి ఈ నలుగురూ ఈ సారి తమతమ నియోజకవర్గాలలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. 

ముందుగా కొడాలి నాని విషయానికి వస్తే ఆయన గుడివాడ నియోజకవర్గం నుంచి 2004నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. మొదటి రెండు సార్లే తెలుగుదేశం అభ్యర్థిగా, ఆ తరువాత రెండు సార్లూ వైసీపీ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు.  జగన్  తొలి క్యాబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. అటువంటి నాని ఈ సారి గుడివాడలో విజయం సాధించే అవకాశాలు దాదాపు మృగ్యమనే చర్చ వైసీపీ లోనే జరుగుతోంది.  ప్రభుత్వ వ్యతిరేకతకు, నాని వ్యవహారశైలి, ఆయన అనుచిత భాషా ప్రావీణ్యంతోడైందనీ, అందుకే ఆయనకు నియోజకవర్గంలో గడ్డు పరిస్థితి ఎదురైందని అంటున్నారు.

 ఇక రోజా విసయానికి వస్తే ఆమె నగరి నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. జగన్ మలి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు.   అయితే ఈ సారి మాత్రం ఆమె విజయం అంత సులువు కాదని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఆమె వ్యవహారశైలి కారణంగా సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆమె విజయానికి పార్టీ పరంగా నగరిలో సహకారం కరవైందని అంటున్నారు. అంతే కాకుండా సొంత పార్టీ నేతలే తెలుగుదేశంకు అనుకూలంగా పని చేశారని అంటున్నారు. వేరే ఎవరో అనడం కాదు, పోలింగ్ రోజున స్వయంగా రోజాయే ఆ విషయం చెప్పి తన ఓటమిని పరోక్షంగానైనా ముందే అంగీకరించేశారు.  

ఇక అంబటి రాంబాబు విషయానికి వస్తే సత్తెన పల్లిలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఆయన వ్యవహారశైలి, ఇష్టారీతిగా నోరు పారేసుకునే విధానం కారణంగా సొంత పార్టీలోనే ఆయన పట్ల అసంతృప్తి వ్యక్తం అయ్యిందంటున్నారు. ఇక ఆయన కూడా పోలీసులు, ఈసీ తెలుగుదేశం కూటమికి అనుకూలంగా పని చేశాయని ఆరోపణలు గుప్పించి, తన ఓటమిని తానే చాటుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక చివరిగా గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ విషయానికి వస్తే... తెలుగుదేశం అభ్యర్థిగా 2019లో విజయం సాధించిన వంశీ ఆ తరువాత వైసీపీ గూటికి చేరిపోయారు. చేరి ఊరుకోకుండా గన్నవరం తెలుగుదేశం శ్రేణులపై వేధింపులకు పాల్పడ్డారు. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈ సారి ఎన్నికల నామినేషన్ సందర్భంగానే వంశీ పట్ల నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత ఏమిటన్నది గోచరమైంది. ఆయన నామినేషన్ ర్యాలీ నామ్ కే వాస్తేగా జరిగింది. పార్టీ శ్రేణులు కూడా దాదాపు ముఖం చాటేశాయని అప్పట్లో గట్టిగా వినిపించింది. మొత్తం మీద ఈ సారి వంశీ గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
అమరావతి మహానగరాన్ని పురిట్లోనే చంపేయాలని అనుకున్న యముడు జగన్ పోయాడు... అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి ఆ మయబ్రహ్మకు ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పదేళ్ల తర్వాత అధికారంలో  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చీ రాగానే ఫోన్ ట్యాపింగ్ తెరమీదకు తెచ్చింది. 
హ్యాట్రిక్ కొట్టన ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ సారి తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించనుందన్న వార్తలు వెలువుడుతుందన్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పార్లమెంట్ సమావేశాల తేదీలు కన్ఫర్మ్ అయ్యాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే
మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసి కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసారు. బీజేపీకి 240 స్థానాలు మాత్రమే రావడంతో మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా 32 స్థానాలు అవసరమయ్యాయి. ఫలితంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరమయ్యింది. ముఖ్యంగా తెలుగుదేశం,జేడీయు సహకారంతో పాటు 21పార్టీల మద్దతు తప్పని సరి అయింది.
ఈరోజు కోసమే.. ఈ శుభవార్తని రాజధాని ప్రాంత రైతులందరూ వినడం కోసమే ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించారు. ఏ లక్ష్యాన్ని ఆశించి ఆయన ఆ సినిమా రూపొందించారో, ఈరోజు చంద్రబాబు నాయుడి ప్రకటనతో ఆ లక్ష్యం నెరవేరిందని భావించవచ్చు.
చరిత్ర కనీవినీ ఎరుగని పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. ఇక ఓటమికి సాకులు వెతకడం మానేసింది. చేతులెత్తేసింది. జనాలకు ముఖం చూపలేక నానా యాతనా పడుతోంది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( నీట్) టాప్ ర్యాంక్ సాధించినప్పటికీ, దేశంలోని టాప్ మెడికల్ కాలేజీ ఎయిమ్స్(ఏఐఐఎంఎస్)లో సీటు రావడం కష్టమే. ఎందుకంటే, ఈసారి టాప్ 1 ర్యాంక్ 67 మందికి వచ్చింది.
కేసీఆర్‌కి కరెంట్ షాక్ తగిలింది. ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నోటీసులు జారీ చేసినట్టు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు.
తెలంగాణలో నాలుగు స్థానాలు ఉన్న బిజెపి రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను గెలిచినప్పటికీ  హైదరాబాద్ పరాజయానికి గల కారణాలను అన్వేషించ పనిలో అధిష్టానం ఉంది.
ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జగన్ ను ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగిడి ఆకాశానికెత్తేసిన వారు ఇప్పుడు పార్టీ పతనానికి, తమ ఓటమికి కారణం జగనే అంటూ వేలెత్తి చూపుతున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే జగన్ ను నిందించారు. తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణా అదే బాట పట్టారు.
ఇంతకాలం తెలుగుదేశం, జనసేన నాయకుల మీద బూతుపురాణం విప్పుతూ, అందరూ చెవుల్లో దూది పెట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చిన అచ్చతెలుగు మహిళామణి శ్రీరెడ్డి ఇప్పుడు వైసీపీ నాయకుల మీద తన ప్రతాపం చూపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలలో విజయానికి సోపానంగా దోహదం చేస్తుందన్న ఆశతో అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ఎన్నికలకు ముందే అంటే ఈ ఏడాది జనవరిలో అట్టహాసంగా ప్రారంభించి ఆ ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేసింది మోడీ ప్రభుత్వం. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు జరిగాయి.
బుధవారం జరిగే తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని స్పెషల్ గెస్ట్‌.గా చంద్రబాబు ఆహ్వానించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.