వాళ్లు కలిస్తే.. ఊహకే ఉలిక్కిపడుతున్న వైసీపీ

Publish Date:Jun 29, 2021

Advertisement

వాళ్లు కలుస్తారని కొందరు అనుకుంటున్నారు. కలిస్తే బాగుండని కొందరు ఫీలవుతున్నారు. కలవకూడదని బలంగా మరికొందరు ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఆయనేమనుకుంటున్నారో మాత్రం తెలియదు. ఆయన ఫ్యాన్స్ దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. కాని రాతల పోటీలు మాత్రం సోషల్ మీడియాలో జరిగిపోతున్నాయి. కలుస్తారని కొందరు రాస్తుంటే... కలిస్తే అది బ్లండర్ అవుతుందని ఆ నాయకుడికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు మరికొందరు. 

జగన్ ఈసారి కూడా వచ్చేటట్లు ఉన్నాడు. సంక్షేమ పథకాల పేరుతో జనానికి డబ్బులు వేసేస్తున్నాడు.. మిగతా విషయాలు మాత్రం పట్టించుకోరు. మళ్లీ ఆయనకే వేసేస్తారేమో.  కాని టీడీపీ జనసేన కలిస్తే మాత్రం...ఓడగొట్టేస్తారు భయ్యా...ఇలా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. చాలా చోట్ల జగన్ ను తిట్టుకుంటున్నారు..వ్యతిరేకత ఉందనుకున్నా...స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆ అంచనాలను గందరగోళంలో పడేశాయి. అప్పటి నుంచే ఈ కొత్త ఈక్వేషన్ గురించి చర్చ మొదలైంది. చంద్రబాబు మనసులో ఏముందో తెలియదు...పవన్ మనసులో ఏమనుకుంటున్నారో అసలే తెలియదు.. కాని చర్చ మాత్రం నడుస్తోంది.

సోషల్ మీడియాలో కొందరు ఈ చర్చను పెడుతుంటే.. కొన్నిఛానళ్లు ఒక అడుగు ముందుకేసి కలిసిపోతున్నారని స్టోరీలు ప్రసారం చేస్తున్నాయి. టీడీపీ కోసం కొందరు ఈ పని చేస్తున్నారనుకోవచ్చు. కాని ఆశ్చర్యం ఏంటంటే.. వైసీపీని బహిరంగంగా సమర్ధిస్తున్న ఓ వెబ్ పోర్టల్ అయితే వారిద్దరూ కలవలేరని.. కలవకూడదని..ఒకవేళ పవన్ అలాంటి నిర్ణయం తీసుకుంటే తప్పు చేసినవాడే అవుతాడని..పైగా బిజెపికి దూరమైతే..భవిష్యత్ ఉండదని హెచ్చరించింది. ఎలాంటి మొహమాటం లేకుండా ఇవే మాటలు డైరెక్టుగా చెప్పేసింది.

ఆ కథనం చూస్తే.. టీడీపీ, జనసేన ఎట్టిపరిస్ధితుల్లో కలవకూడదని వైసీపీ బలంగా కోరుకుంటున్నట్లు అర్ధమవుతోంది. ఆ కలయుక ఊహల పట్లే భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఆ చర్చను కొనసాగించేలా చేసింది. లేదంటే పవన్ కేంద్ర మంత్రి పదవిలా కొన్నాళ్లు నడిచి ఆగిపోయేది. కాని ఇప్పుడు ఆ వెబ్ పోర్టల్ చర్చకు సశేషం మార్క్ పెట్టింది. అటు టీడీపీ, ఇటు జనసేన వర్గాలను సైతం ఆలోచనలో పడేసింది.

పవన్ జనసేన పెట్టిన వెంటనే బిజెపికి, ఆ తర్వాత టీడీపీకి మద్దతు పలికారు. 2014 ఎన్నికల్లో అది ఫలితాలను మార్చిందనే చెప్పుకోవాలి.  ఆ తర్వాత అమరావతి విషయంలో పవన్ ఆందోళన చేశారు. తర్వాత టీడీపీ పరిపాలనపైనా ధ్వజమెత్తారు. మరోవైపు జగన్ వైఖరిపైనా మండిపడ్డారు. ఎవరు బలమైన శత్రువో తేల్చుకోలేక గందరగోళంలో పడటం.. టీడీపీతో అవగాహనే అనే అనుమానాలు జనంలో పెరగడంతో ఫలితాలు వేరేగా వచ్చాయి. అప్పటి నుంచి టీడీపీకి దూరంగా ఉంటూ..మెల్లగా బిజెపికి దగ్గరయ్యారు. కాని అక్కడా సంతృప్తి లేదు. అమరావతి రాజధాని, ప్రత్యేక హోదా తదితర విషయాల్లో బిజెపి వైఖరి ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. అలాగే జగన్ పట్ల రహస్య ప్రేమ చూపిస్తూ బిజెపి పవన్ ఆగ్రహానికి గురవుతోంది. అందుకే మళ్లీ పవన్ టీడీపీ వైపు వస్తారా అనే అంచనాలు మొదలయ్యాయి. కలిస్తే ఏంటి..కలవకపోతే ఏంటి అనే చర్చ బలంగా సాగుతుండటంతో.. ఇరు పార్టీల అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. మరి ఏం జరగనున్నదో వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.