కమలంలో కట్టు తప్పిన క్రమశిక్షణ! బండి పట్టాలు తప్పిందా..?

Publish Date:Jun 29, 2021

Advertisement

ముఠాలు, కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీలోనే కానీ, క్రమశిక్షణకు మారు పేరైన బీజేపీలో ఉండవు అని ఎవరైనా అనుకుంటే వారు తప్పులో కాలేసినట్లే ... ఒకప్పడు అధికారానికి దూరంగా ఉన్న రోజుల్లో బీజేపీలో మడీ ఆచార కట్టుబాట్లు ఉంటే ఉండేవేమో కానీ, ఇప్పుడు అంత సీన్ లేదు. అప్పట్లో కాంగ్రెస్, ఇతర మధ్యేవాద పార్టీలకు కొంత భిన్నంగా, విభిన్నంగా బీజేపీ ఉండేదేమో,కానీ, అధికారం రుచి మరిగిన తర్వాత,ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చి పోయే వాళ్ళు ఎక్కువైన తర్వాత,అన్ని పార్టీల అవలక్షణాలు కమల దళానికి అంటుకున్నాయి. నిజానికి, ఈమధ్య కాలంలో ఇతర పార్టీలలో కంటే కూడా బీజేపీలో క్రమశిక్షణా రాహిత్యం  కొంచెం ఎక్కువగా కనిపిస్తోందని, కమలదళం పాత కాపులు బాధను వ్యక్తం చేస్తున్నారు. 

ఈ మధ్య కాలంలో అయితే బీజేపీలో క్రమశిక్షణ రాహిత్యం, తరచూ వార్తల్లో వినవస్తోంది. కొద్ది కాలం క్రితం, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు సారధ్యంలో ప్రతి నాయాకుల బృందం, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్’ ను కలిశారు. పార్టీ నాయకులు బృందం మరో పార్టీ నాయకుడిని కలవడం తప్పు కాకపోయినా, పార్టీకి సమాచారమే లేకుండా, కనీసం పార్టీ అధ్యక్షుడి అనుమతి అయినా లేకుండా కలవడం పార్టీలో దుమారం సృష్టించింది. షోకాజు నోటీసులు, విచారణలు,వివరణలు, సంజాయిషీలు ఇలా చాలా కథ నడిచింది.

ఇక ప్రస్తుతానికి వస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం దళిత సాధికరితఫై ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు హాజరు కావడం పార్టీలో దుమారం రేపుతోంది. ఎస్సీ సాధికారతపై ముఖ్యమత్రి కేసీఆర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ నాయకత్వం బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినా.. పార్టీని కాదని మోత్కుపల్లి హాజరు కావడంపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పార్టీ నిర్ణయాన్ని కదాని కేసీఆర్‌తో భేటీకి మోత్కుపల్లి ఎలా హాజరవుతారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే మోత్కుపల్లి తమను తాము గట్టిగా సమర్ధించుకుంటున్నారు. అఖిల పక్ష సమావేశానికి హాజరై  బీజేపీని రక్షించానని చెప్పుకుంటున్నారు. లేదంటే బీజేపీపై దళిత వ్యతిరేక ముద్ర పడేదంటూ ఆయన పార్టీ నేతలకు పాఠాలు  చెపుతున్నారు. ఒక విధంగా సవాలు విసురుతున్నారు. 

అదలా ఉంటే,అనుమతి లేకుండా మీటింగ్’కు వెళ్ళిన మోత్కుపల్లి, మీడియా ఇంటర్వ్యూ లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ఎంతో గొప్పగా  పనిచేస్తున్నారని కొనియాడుతున్నారు. ఇలాంటి నిర్ణయం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదని ప్రశంసిస్తున్నారు. మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో చర్యలు తీసుకుని.. ప్రభుత్వంపై విశ్వాసం కల్గించారని కితాబు నిచ్చారు. 

నిజానికి, మోత్కుపల్లి బీజేపీలో చేరక ముందు నుంచే తెరాసలో చేరుతున్నారని వార్తలొచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కారెక్కేందుకు చాలా ప్రయత్నాలు  చేశారు. అయితే, అటునుంచి ఎంతకీ గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో .. ఎదురు చూసి చూసి చివరకు బీజేపీ చేరారు. ఇక ప్రస్తుతానికి వస్తే, మోత్కుపల్లి  త్వరలో కారెక్కడం ఖాయంగా కనిపిస్తోందని, బీజేపీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే స్వలాభం కోసం పార్టీలు మారనని, తాను కేసీఆర్‌కు దగ్గర కాలేదని, భారతీయ జనతాపార్టీలోనే ఉంటానని మోత్కుపల్లి స్పష్టం చేశారు. బహుశా గతంలో ఎదురైన చేదు అనుభవం దృష్టిలో ఉంచుకుని కావచ్చు,జాగ్రత్త పడుతున్నారు. అందులోనూ అసలే ఆయన కేసీఆర్, ఆయనకు ఎప్పుడు ఎవరు ఎదుకు ముద్దోస్తారో.. ఎవరు ఎప్పుడు కంపవుతారో .. ఆయనకే తెలియదు. అదీ గాక మోత్కుపల్లి తీరని కోరిక ఎదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కావడం,ఆ కోరిక తీరాలంటే బీజేపీలో ఉండవలసిందే, అందుకే కావచ్చు.. ఆయన అటూ  ఇటూ అవుతున్నారు. అయితే, కేసీఆర్ పిలిస్తే మాత్రం ... మిత్కుపల్లి నిముషం ఆలోచించకుండా వెళ్లి కారెక్కుతారు. అందులో సందేహంలేడంటున్నారు ఆయన సన్నిహితులు.

By
en-us Political News

  
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.