సునీత రాజ‌కీయ ప్రవేశం... వైసీపీ కొత్త డ్రామా?

Publish Date:Apr 25, 2023

Advertisement

వివేకా హత్య కేసు విషయంలో అన్నిదారులూ మూసుకుపోయి.. అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమని తేలిపోయిన తరువాత.. ఈ కేసు విషయంలో తార్కిక ముగింపు కోసం సాహసోపేత న్యాయపోరాటం చేసిన సునీతను బదనాం చేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు అడుగులు వేస్తున్నాయి. వివేకా హత్య కేసును గుండెపోటు నుంచి అల్లుడు, కూతురే హంతకులు అంటూ చేసిన ఆరోపణలన్నీ సందేహాలకు అతీతంగా కోర్టుల్లో వీగిపోయిన నేపథ్యంలో వివేకా కుమార్తె సునీతను బదనాం చేయడమే లక్ష్యంగా ఆమె తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారంటూ వైసీపీ శ్రేణులుపోస్టర్ల పర్వానికి తెరతీశాయి.  

వివేకా రెండో  భార్య, ఆస్తుల  గొడవ అంటూ మరణించిన వివేకా వ్యక్తిత్వ హననానికి కూడా వెనుకాడని అవినాష్ రెడ్డి, వైసీపీ శ్రేణులు ఇప్పుడు తాజాగా వైఎస్ సునీత రాజకీయ ప్రవేశం అంటూ పోస్టర్ల పర్వానికి తెరతీశారు. కడప జిల్లా తాడిపత్రిలో ఈ మేరకు పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లను ఎవరు ఏర్పాటు చేశారన్నదానిపై స్పష్టత లేకపోయినా.. వీటి వెనుక ఉన్నది వైసీపీయే అన్న అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి.    ఎందుకంటే.. వైఎస్ వివేకా హత్య కేసులో   వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి నిందితులు అంటూ  ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. టెక్నికల్ ఎవిడెన్స్ సహా సుప్రీం కు నివేదించింది. ఈ కేసులో ఇప్పటికే   భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ  అవినాష్ రెడ్డినీ అరెస్టు చేయనుంది. అరెస్టును తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. తెలంగాణ అవినాష్ కు ముందస్తు బెయిలు ఇస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కొట్టివేసింది.

ఈ నేపథ్యంలోనే  కడప జిల్లా వాసులంతా  ఆజాత శత్రువు  భావించి అభిమానించే వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడిన  అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డిలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.   వివేకా.. రెండో వివాహం.. అక్రమ సంబంధాలు, దందాలు.. ల్యాండ్ సెటిల్‌మెంట్లు తదితర అంశాలను వీరిద్దరూ తమ నేరం నుంచి తప్పించేందుకు పుట్టించిన కట్టుకథలుగా పలువురు భావిస్తున్నారు. పైగా వివేకా బంధువులే  ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడటం పట్ల మొత్తంగా వైఎస్ కుటుంబం పట్ల కడప జిల్లా వాసులకు ఒకింత గౌరవం తగ్గిందని కూడా వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.  

ఈ నేపథ్యంలో సునీత తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారంటూ వైసీపీ నుంచి వస్తున్న విమర్శలను ఎవరూ పట్టించుకోకపోవడంతో నే పోస్టర్ల పర్వానికి తెరతీశారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ముఖ్యుల ఫొటోలతో  సునీత రాజకీయ ప్రవేశానికి స్వాగతం అంటూ వెలసిన పోస్టర్ల వెనుక ఉన్నది వైసీపీయేనని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. సునీత తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారంటూ వైసీపీ సీనియర్ నేతలు చేస్తున్న ఆరోపణలను వారు ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులూ ఎవరో తెలియాల్సిందేనంటూ సునీత చేసిన న్యాయపోరాటాన్ని ఒక్క వైసీపీ వినా అన్నిరాజకీయ పార్టీలూ, ప్రజలూ కూడా స్వాగతించారు. అలాగే  తెలుగుదేశం పార్టీ కూడా పలు సందర్భాలలో  సునీత పోరాటాన్నిస్వాగతిస్తూ, ఆమెకు సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించింది.

అయితే రాజకీయంగా ఆమె తెలుగుదేశం వైపు అడుగులు వేస్తున్నట్లుగా, సునీత ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. ఆమె  ఓ కూతురిగా  తండ్రి హంతకులకు శిక్షపడాలంటూ  చేసిన ఒంటరి పోరు చేశారు. ఆ పోరాటంలో ఆమె విజయానికి చేరువయ్యారు.  దీంతో ఆమెను బదనాం చేయాలనీ, బురద జల్లాలన్న ఉద్దేశంతోనే రాజకీయ ప్రవేశం అంటూ పోస్టర్లు వెలిశాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 

By
en-us Political News

  
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.