గోబెల్స్ ను మించిపోయిన వైసీపీ ప్రచారం
Publish Date:Feb 12, 2026
Advertisement
శుద్ధ అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేయడం ద్వారా నిజమని నమ్మించడానికి చేసే ప్రయత్నాన్ని గోబెల్స్ ప్రచారం అంటారు. అటువంటి ప్రచారంలో వైసీపీది అందె వేసిన చేయిగా పరిశీలకులు అంటున్నారు. అయితే వైసీపీ ఓటుకు నోటు కేసులో అలుపులేకుండా చేస్తున్న అబద్ధపు ప్రచారం ఫలితం ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇందుకు కారణాలను కూడా సహేతుకంగా విశ్లేషిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఉన్నారనీ, ఆ కేసు కోసమే తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డితో చంద్రబాబు రాజీపడుతున్నారంటూ వైసీపీ ప్రచారం చేస్తున్నది. గతంలో అంటే తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో కూడా అప్పడు ఏపీ సీఎంగా కేసీఆర్ తోనూ చంద్రబాబు లాలూచీ రాజకీయం నెరపారని వైసీపీ ప్రచారం చేస్తున్నది. అయితే వాస్తవానికి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ముద్దాయి కాదు. చార్జిషీట్ లో ఆయన పేరు లేదు. కాగా చంద్రబాబు పేరు ఓటుకు నోటు కేసులో లేకపోవడంపై గతంలో వైసీపీ కోర్టుకు కూడా వెళ్లింది. అయితే అక్కడ ఆ పార్టీకి చుక్కెదురైంది. ఆ తరువాత సుప్రీంను కూడా ఆశ్రయించింది.. అక్కడా వైసీపీకి ఎదురుదెబ్బే తగిలింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన వైసీపీకి పరాభవం తప్పలేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్నిప్రమాదాన్నిఆసరాగా తీసుకుని రాజకీయం కోసం మళ్లీ ఓటుకు నోటు కేసును వాడేసుకుంటోంది. దానితో పాటు ఓటుకు నోటు కేసు కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నిలిపి వేయించారని వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అదెలాగంటే.. ఓటుకు నోటు కేసు కు సంబంధించిన కీలక వివరాలు ఆ ల్యాబ్ లో ఉన్నాయి. ఆ ఫైల్స్ దగ్ధం చేసేందుకు రేవంత్ తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారనీ ఆరోపిస్తోంది. అదే ఓటుకు నోటు కేసులో రేవంత్ సైతం ఉండడంతో ఆ ఇరువురూ కలిసి అగ్ని ప్రమాదం చేయించారని ఆరోపిస్తూ.. ఇందు కోసం చంద్రబాబు రేవంత్ కు అనుకూలంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారని చెబుతోంది. ఇక ఓటుకు నోటు కేసు విషయానికి వస్తే.. 2015లో ఓ నామినేటెడ్ ఓ నామినేటెడ్ ఎమ్మెల్సీ ని ప్రలోభ పెట్టారన్న కేసులో ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ1గా ఉన్నారు. ఆ కేసులో చంద్రబాబు ప్రస్తావనే లేదు. అయితే కోర్టుకు దాఖలు చేసిన చార్జి షీట్లో చంద్రబాబు ప్రస్తావన ఒకచోట ఉంది. దీనిపైనే గతంలో వైసీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలంగాణ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని కోరారు. అయితే ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్నారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటీషన్ డిస్మిస్ చేసింది. ఇది జరిగి సంవత్సరాలు గడిచిపోయినా వైసీపీ మాత్రం ఆ ఆరోపణలనే పట్టుకు వెళాడుతోంది. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం విషయానికి వస్తే.,. ఆ అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసుతో పాటు ఫోన్ టాపింగ్ కేసునకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం కాలేదని సంబంధిత అధికారులు విస్పష్టంగా ప్రకటించారు. అయినా సరే వైసీపీ తన తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నది. తెలంగాణలో విపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా ఓటుకు నోటు కేసు ఫైల్స్ దగ్ధం కోసమే ఆ కేసులో ఏ1గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ అగ్నిప్రమాదాన్ని సృష్టించిందని ఆరోపిస్తోంది. చంద్రబాబు ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. తెలంగాణ సీఎం రేవంత్ ను కేసులో ఏ1గా చార్జిషీట్ లో పేర్కొన్నందున బీఆర్ఎస్ ఆరోపణలు చేయడాన్నితప్పుపట్టలేం. కానీ వైసీపీ మాత్రం ఓటుకు నోటు ప్రస్తావన తీసుకొస్తూనే ఉంది. కోర్టుల్లో మొట్టికాయలు తిన్న తరువాత కూడా ఆ పార్టీ ఆ ప్రచారం కొనసాగిస్తుంది. ఇక ఈ కేసు కోసం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేశారని మరో అబద్ధాన్ని కూడా ప్రచారంలోకి తీసుకు వచ్చింది. వాస్తవానికి 2020 లోనే ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అప్పటి జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టారు.అయితే కేంద్రం అందుకు అనుమతులు ఇవ్వలేదు. వాస్తవం అలా ఉంటే.. ఏపీలో 2024 ఎన్నికలలో విజయం సాధించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టిన తరువాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయిందని వైసీపీ చెప్పడం కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న అసత్య ప్రచారమేనంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-false-propaganda-39-213916.html





