రెండు ఒకట్లు ఒకటవుతుంది.. ఇంకా మాట్లాడితే సున్నా అవుతుంది!

Publish Date:Mar 6, 2025

Advertisement

అయితే కావచ్చును. ఆయన మహా నేత కడుపున పుట్టిన, ఓ మహా నే(మే)త అయితే కావచ్చును.అలాగని ఆయన అనుకోవచ్చును.ఇక్కడ విషయం ఏమంటే, ఆయనగారి ఐదేళ్ళ సుందర ముదనష్ట పాలనకు శిక్షగానా, అన్నట్లుగా ప్రజలు, ఎన్నికల్లో ఆయన్ని, ఆయన పార్టీని  చిత్తు చిత్తుగా ఓడించారు.గట్టిగా బుద్ధి చెప్పారు. కొద్దిగా గడ్డి కూడా పెట్టారు.  

అవును మనం ఇప్పడు మాట్లాడుకుంటోంది, ఆంధ్ర ప్రదేశ్ మాజీ, ముఖ్యమంత్రి, వైసీపీ శాశ్వత అధ్యక్షుడు  శ్రీమాన్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి గురించే. ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్ అని వేడుకుంటే, సరే ఇచ్చి చూద్దాం అని, ప్రజలు 2019లో ఒక్క ఆవకాశం ఇచ్చారు. అలా ఒక్క సారి, అధికారం ఇచ్చిన ప్రజలే, 2024 ఎన్నికల్లో, ఇక చాలు ఛీ పో ..అంటూ  జగన్మోహన్ రెడ్డిని ఛీ కొట్టి పంపించారు. వైసీపీని ఓడించారు. ఏదో అనుకుని, ఏదో ఆశించి ఓటేసి గెలిపిస్తే, జగన్ రెడ్డి అరాచక, అవినీతి పాలనతో వందేళ్ళకు సరిపడా ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. ఈ  ముదనష్టపు పీడ ఎప్పడు వదిలి పోతుందా? అని ప్రజలు ఎదురు చూసేలా దుర్మార్గ, దుష్ట పాలనా సాగించారు. అందుకే ప్రజలు, ఓటు అస్త్రంతో రాక్షస  సంహారం గావించారు. 2024 ఎన్నికల్లో కసితీరా ఓడించారు. ముఖ్యమంత్రి పీఠం నుంచి మెడ పట్టి గెంటారు. 

అధికార పీఠం నుంచి గెంటేస్తే గెంటేశారు,పోనీ ప్రతిపక్ష హోదా అయినా ఇచ్చారా అంటే అదీ లేదు. అందుకు పనికిరావని, పదకొండు సీట్లకు పరిమితం చేశారు. నిజానికి, పార్లమెంటరీ  ప్రజాస్వామ్య వ్యవ స్థలో గెలుపు ఓటము సహజం. ఆలాగే ఓడలు బళ్లవడం, బళ్ళు ఓడలు అవడం మామూలు విషయమే. ప్రజాస్వామ్యం పట్ల ఏ కొంచెం నమ్మకం, విశ్వాసం  ఉన్న ఎవరైనా, చివరకు అత్యంత చౌకబారు రాజకీ య నాయకుడు అయినా, ఓటమిని అంగీకరించి, గౌరవిస్తారు.  ఎంతో కొంత హుందాగా వ్యహరిస్తారు. ప్రజలు అవకాశం  ఇచ్చిన మేరకు, ప్రజాసేవ చేసి తద్వారా తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. 

కానీ, జగన్ రెడ్డికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదు. ఆ విషయం అర్థ మయ్యేందుకు   అంతగా కష్టపడవలసిన అవసరం లేదు. జగన్ ఐదేళ్ళ పాలనే అందుకు ప్రత్యక్ష సాక్షిగా నిలచింది.ఆయన పాలనే, అందుకు సజీవ సాక్ష్యం. ఇక హుందాతనం అనేది, ఆయన నిఘంటువులో లేని పదం. కన్న తల్లి, రక్తం పంచుకు పుట్టిన సోదరి పై ఆయన ప్రవర్తించిన తీరే, అందుకు సాక్ష్యం. సో సహజంగానే, ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించడం, అయన సహజ నైజానికి విరుద్ధం. అందుకే, ప్రతిపక్ష హోదా కోసం వికృత విన్యాసాలు చేస్తున్నారు.  

అందుకే ప్రజలు ఇంతగా ఛీ కొట్టినా, చీదరించుకున్నా, తగుదునమ్మా’ అంటూ సిగ్గు విడిచి చిందు లేస్తున్నారు.ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం చిత్ర విచిత్ర వికృత విన్యాసాలు చేస్తున్నారు. ఛీ..పో అని ఛీ కొట్టినా చూరుపట్టుకుని వెళ్ళాడుతున్నారు. నవ్వుల పాలవుతున్నారు. నిజానికి,. వై నాట్ 175 అంటూ, మితిమీరిన అహంకారంతో విర్ర వీగిన, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన తీర్పు మింగుడు పడడం కొంచెం చాలా కష్టమే, కాదన లేము. 

కానీ, ప్రతిపక్ష హోదా కోసం జగన్ రెడ్డి, వైసీపీ నయకులు పాకులాడుతున్న తీరు,పార్టీకే  తలవంపులు తెస్తోందని, వైసీపీ నాయకులే వాపోతున్నారు. పదవులు అడుక్కోవం ఏమిటని విస్తుపోతున్నారు. నిజమే కావచ్చును, జనసేన కంటే వైసీపీకి ఎక్కు శాతం ఓట్లు వచ్చిన మాట నిజమే కావచ్చును, కానీ, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి  ఒక రికార్డును సృష్టించింది. మరోవంక వైసీపీ, వై నాట్ 175 అంటూ విర్రవీ  11 స్థానాలకు పడిపోయి పరువు పోగుట్టుకుంది. అంతే కాదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నట్లుగా, జగన్ అండ్ కో ఎంతగా దిగజారినా, ఎంతగా విలపించినా,వేడుకున్నా ఈ ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు. జగన్ రెడ్డికి ప్రతిపక్ష నేత అధికార పీఠం దక్కదు. రాదు అంటే, ఎవరో అడ్డు కుంటారని కాదు.  రాజ్యాంగం ప్రకారం మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అంటే ప్రతిపక్షహోదా పొందేందుకు, వైసీపీకి ఉన్న రెండు ఒకట్లు ,అదే 11 సంఖ్యా బలం సరిపోదు. అందుకే, ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్’ పస్తుత సభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని సోదాహరణగా వివరించారు. అయితే ఉన్నమాటంటే, ఉలుకెక్కువ అన్నట్లు జగన్ రెడ్డి మీడియా ముందు, ప్రతిపక్ష హోదా కోసం విలాపనలతో నోరు పారేసుకున్నారు. పవన్ కళ్యాణ్’ కార్పోరేటర్’కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ వికారపు వ్యాఖ్యలు చేశారు. అలాగే, నవ్విపోదురు గాక నాకేటి సిగ్గంటూ గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా తానే ఇచ్చినట్లు చెప్పుకున్నారు.

ఇది చాలదన్నట్లు ఇప్పుడు గత ఎన్నికలలో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం, వైసీపీకి వచ్చిన ఓట్ల శాతాన్ని పోల్చి చూపుతూ ఆ పార్టీ మేధావులు? వితండ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. 2024 ఎన్నికలలో కేవలం 6 శాతం ఓట్లు వచ్చిన జనసేన పార్టీ అధినేతకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి నప్పుడు.. 40 శాతం ఓట్లు వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరంటూ ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. అంటే, ప్రతిపక్ష హోదాకు ఉండవలసిన అర్హతలు ఏమిటో కూడా, ఈ మేతావులకు ... మహా మేతకు తెలియదని అనుకోవాలేమో. 

ఇలా ఒకదాని వెంట ఒకటిగా విచిత్ర వాదనలను, ఇల్లాజికల్ లాజిక్’ ను తెర పైకి తెస్తున్న జగన్ రెడ్డి, ఆయన బఫూన్ బ్యాచ్ పార్టీ పరువును మరింత పలచన చేసుకుంటున్నారని, అంటున్నారు. అలాగే, జగన్ రెడ్డి ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన తీర్పును సరిగా అర్థంకుని , హుందాగా వ్యవహరిస్తే అది ఉభయ తారకం. అది అందరికీ మంచింది.. కాదంటే పదకొండు ఒకటవుతుంది.. ఇంకా మాట్ఒలాడితే   సున్నా కు చేరుతుంది.

By
en-us Political News

  
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.