రాచమల్లుకు ఎదురుగాలి.. ప్రొద్దుటూరులో తెలుగుదేశందే పై చేయి!

Publish Date:May 3, 2024

Advertisement

కడప పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఆ జిల్లాపై ఆ కుటుంబం ఆధిపత్యం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయింది.  ఆ ప్రభావం జిల్లాలో ఆ కుటుంబం ఆధిపత్యంపై కూడా పడింది. వైఎస్ మరణం తరువాత కడప జిల్లా మొత్తం కాంగ్రెస్ ను వీడి  జగన్ కు మద్దతుగా నిలిచింది. 2014 ఎన్నికలలో జగన్ పార్టీ పరాజయం పాలైనా కడప జిల్లా మాత్రం ఆయనకూ, ఆయన పార్టీకే జై కొట్టింది. అయితే 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ జగన్ పునాదులు కదులుతున్న పరిస్థితి గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని ఆ పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. 

ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎనిమిది పదుల వయస్సున్న వరదరాజులు రెడ్డి పోటీలో ఉన్నారు. చంద్రబాబు ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిగా వరదరాజులు రెడ్డిని ఎంపిక చేయడంపై అందరూ విస్మయం వ్యక్తం చేశారు. ఆయితే ఆయన తనక ఇవే చివరి ఎన్నికలు అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలలో సానుకూలతకు కారణమైంది. అన్నిటికీ మించి ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన సమీప బంధువు బంగారురెడ్డిల అరాచకాలు, దౌర్జన్యాలతో విసిగిపోయిన స్థానికులు, వ్యాపారులు వరదరాజులురెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే నియోజకవర్గంలో తెలుగుదేశం బలం, వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతా అన్నీ కలిసి వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో రాచమల్లు అరాచకత్వం అన్ని వర్గాల ప్రజలలో ఆయన పట్ల అసహనానికీ, అసంతృప్తికీ కారణమైంది. దీంతో  ప్రొద్దుటూరులో తెలుగుదేశం వైపు మొగ్గు కనిపిస్తోంది. 

ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలూ, క్యాడర్ తో సమన్వయం కరవైంది. ఆయన పూర్తిగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు తనకే ఓటు వేస్తారన్న భావనలో ఉన్నారు. అన్నిటికీ మించి వైఎస్ షర్మిలపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రజలలో మరీ ముఖ్యంగా మహిళల్లో ఆయన పట్ల వ్యతిరేకతకు కారణమయ్యాయి. వీటన్నిటికీ అదనంగా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న మైనారిటీలు కాంగ్రెస్ వైపు చూస్తుండటం రాచమల్లు విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసిందని పరిశీలకులు అంటున్నారు. మొత్తంగా ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ షర్మిల ప్రభావం వైసీపీకి ప్రతికూలంగా మారిందంటున్నారు. ప్రొద్దుటూరు పరిస్థితి కడప జిల్లాలో మారిన రాజకీయ ముఖచిత్రానికి అద్దంపడుతోందని చెబుతున్నారు. ప్రచారం నుంచి ప్రజా స్పందన వరకూ  తెలుగుదేశం కూటమికి సానుకూలత కనిపిస్తోందని చెబుతున్నారు. దీంతో ప్రొద్దుటూరులో రాచమల్లుకు ఎదురీత తప్పదని విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.