పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అది ఇప్పటి నుంచే కాదు.. గత ఏడాది ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ ఖరారైనప్పటి నుంచే ఈ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందది. సరే ఆ ఎన్నికలలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడే ఇళ్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం గురించి ఏ వార్త అయినా రాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అటువంటి నియోజకవర్గంలో వైసీపీ క్రమంగా ఖాళీ అయిపోతోంది. ఇప్పటికే పలువురు ఆ పార్టీని వీడి జనసేన గూటికి చేరారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పెండెం దొరబాటు 2014 నుంచీ వైసీపీతోనే నడిచారు. 2019 ఎన్నికలలో ఆయన పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మపై విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలలో జగన్ పెండెం దొరబాబుకు టికెట్ నిరాకరించారు. వంగా గీతకు ఇక్కడ టికెట్ ఇచ్చారు. జనసేనాని పవన్ కల్యాణ్ ను వంగా గీత అయితేనే దీటుగా ఎదుర్కోగలరని జగన్ భావించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన పెండెం దొరబాబు వైసీపీ మార్కు బుజ్జగింపుల కారణంగా పార్టీలోనే కొనసాగారు.
అయితే 2024 ఎన్నికలలో వంగా గీతపై పవన్ కల్యాణ్ 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సరే అది పక్కన పెడితే జగన్ పెండెం దొరబాబు గత ఎన్నికలలో తనను పక్కన పెట్టిన దానికి ఇప్పుడు అదును చూసి దెబ్బ కొట్టారు. వైసీపీని వీడి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీ గూటికి చేరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన గూటికి చేరడంతో పిఠాపురంలో వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయినట్లే. వంగా గీత ఉన్నప్పటికీ ఆమెకు పార్టీ క్యాడర్ లో పెద్దగా పలుకుబడి లేదు. ఆమెకు నియోజకవర్గంలో కార్యకర్తల మద్దతు కూడా పెద్దగా లేదు. పెండెం దొరబాబు చేరికతో పిఠాపురంలో జనసేన బలో పేతం కావడమే కాదు.. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ పరిస్థితి మరింత దిగజారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-empty-in-pithapuram-39-193834.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.