షర్మిలతో సంధికి వైసీపీ యత్నాలు?

Publish Date:Dec 31, 2023

Advertisement


ఏపీలో కొత్త ఏడాదిలో కొత్త రాజకీయాలు మొదలు కానున్నాయా అంటే అన్ని వర్గాలు అవుననే ముక్తకంఠంతో చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఏపీలోఅసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలూ జరగనున్నాయి. ఈ ఎన్నికలకు జనవరి నుండే సన్నాహాలు మొదలు కానున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండగా.. జనవరిలో దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించనున్నాయి. అయితే, ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఒకవైపు, ప్రతిపక్షంలో తెలుగుదేశం.జనసేన  మరోవైపు  బరిలో నిలవనుండగా.. కాంగ్రెస్ కూడా పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  సీఎం జగన్ సోదరి   షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు అప్పగించడం దాదాపుగా ఖరారైంది. జనవరి మొదటి వారంలోనే షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఖరారైపోయింది. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే వైసీపీ నుండి భారీ స్థాయిలో వలసలు ఉంటాయని చెబుతున్నారు.

షర్మిల అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో వేరు కుంపటి పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో వైసీపీ లేకపోవడంతో ఇన్నాళ్లు ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఉన్నా జగన్ కు పెద్దగా నష్టం లేకుండా పోయింది. కానీ, ఆమె ఏపీకి వస్తే జగన్ కు భారీ డ్యామేజ్ జరగడం ఖాయం. ఇది వైసీపీకి తీరని నష్టంగా విశ్లేషణలు సాగుతున్నాయి. అంతేకాదు, ఒకే రాష్ట్రంలో రెండు వేరువేరు పార్టీలలో ఉంటూ.. అన్నా చెల్లెలు ఎదురు నిలిచి రాజకీయ పోరాటం చేసుకుంటే ఖచ్చితంగా అది జగన్ ప్రతిష్టను మరింత మసకబారుస్తుందని అంటున్నారు. పైగా షర్మిల తన రాజకీయ ప్రయాణంలో జగన్ పై సూటిగా విమర్శలకు దిగితే వైఎస్ కుటుంబంలో వివాదాలు కూడా బహిర్గతం కావడం ఖాయం. ఇవన్నీ రానున్న ఎన్నికలలో వైసీపీకి ఘోర ఓటమికి కారణం కావడమే కాకుండా.. జగన్ ను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడం ఖాయం. ఈ నేపథ్యంలో దీనిని దృష్టిలో పెట్టుకొనే షర్మిల కోసం జగన్ అండ్ కో రాయబారాలు మొదలుపెట్టినట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. వైసీపీలోకి తిరిగి షర్మిలను తీసుకుని వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయనే వార్త వైరల్ అవుతోంది. వైఎస్ కుటుంబానికి సంబంధించిన పెద్ద ఒకరు   వైసీపీ తరఫున  షర్మిలతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. షర్మిలకు ఏం కావాలి? ఆమె ఆలోచనలు ఏంటి? ఆమె డిమాండ్లు ఏంటి? అన్నది తెలుసుని మళ్ళీ అన్న జగన్ తో రాజీ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనా ఆమెను తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చే బాధ్యత కూడా సదరు రాయబారే తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు, వైసీపీ నుండి కడప ఎంపీగా షర్మిలను పోటీ చేయించేందుకు కూడా వైసీపీ హై కమాండ్ సుముఖంగా ఉందని, ఆమె రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చడం, ఆస్తులకు సంబంధించిన విషయాలను కూడా సానుకూలంగా పరిష్కరించడానికి   షర్మిలతో సంధికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   అయితే, ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే జగన్ నైజం తెలిసిన వారెవరూ ఆయన  అంత సులభంగా రాజీకి వచ్చే మనిషి కాదనే అంటారు. అదే విధంగా  షర్మిలకు కూడా అన్న జగన్ తో  రాజీకి వచ్చే అవకాశాలు లేవనీ, తెలంగాణలో   అడుగడుగునా ఇబ్బందులు సృష్టించడమే కాకుండా, షర్మిలకు ఆర్థికంగా ఇసుమంతైనా సహకారం అందకుండా జగన్ చేశారనీ, అందుకే  ఆమె ఏపీకి వచ్చి అన్నతో తలపడేందుకు సిద్ధమయ్యారనీ అంటున్నారు. కనుక షర్మిల అన్నతో రాజీపడే అవకాశాలు మృగ్యమని అంటున్నారు.  అసలు ఈ ప్రచారాన్ని జగన్ అభిమానులే సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రచారం నిజమై.. మళ్ళీ అన్నా చెల్లెల్లు ఒక్కటి అవుతారనేందుకు ఉన్న ఏకైక పాజిటివిటీ ఏదైనా ఉందంటే అది తల్లి విజయమ్మ మాత్రమే. ఎంతైనా తల్లి కదా మళ్ళీ అన్నా చెల్లెల్లు కలిస్తారంటే తల్లిగా ఆమె పాత్ర ఆమె నిర్వర్తిస్తారు. ఇద్దరినీ ఉన్నతంగా చూడాలన్నదే ఆమె కోరిక కనుక ఆ అవకాశం వస్తే విజయమ్మ ఇందులో కీలకం కానున్నారు. కానీ, జగన్ అంత సులభంగా కరుగుతారా? ఒకేవేళ చెల్లే కదా అని జగన్ తగ్గినా.. వదిన భారతీ అందుకు ఒప్పుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.