చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేస్తూ సీబీఐ విచారణ కోరుతున్న వైసీపీ 

Publish Date:Sep 15, 2020

Advertisement

ఢిల్లీలో నిన్ననే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఒకపక్క కరోనాతో దేశ ప్రజలు అల్లాడుతుండగా మరో పక్క రాష్ట్రాలకు చెందిన వివిధ సమస్యలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీకి సంబంధించి రాజధాని అంశంలో ఇటు అమరావతి రైతులు తమ ఆందోళన ఉధృతం చేస్తున్నారు. మరో పక్క సీఎం జగన్ మాత్రం మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు మూడు రాజధానులను అడ్డుకునేందుకు లోక్ సభలో పోరాటానికి సిద్దమయ్యారు. ఇప్పటికే దీని గురించి టీడీపీ ఎంపీలు నిన్న కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ను కలిసి ఏపీ హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ల పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అక్కడ నెలకొన్న వాస్తవ పరిస్థితుల పై వివరించారు. ఆ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలను సరిచేయాల్సిన బాధ్యత ప్రస్తుతం కేంద్రంపై ఉందని ఈ సందర్భంగా ఎంపీలు అధికారులకు గుర్తు చేసారు. దీంతో న్యాయశాఖ అభిప్రాయాలను తీసుకుని అవసరమైతే అఫిడవిట్‌లు సరిచేసుకునే విషయాన్ని పరిశీలిస్తామని అజయ్‌భల్లా వారికి హామీ ఇచ్చినట్లుగా కూడా టీడీపీ ఎంపీలు తెలిపారు. దీంతో పాటు ఈ అంశాన్ని లోక్ సభ ప్రస్తుత సమావేశాల్లో లేవనెత్తి అమరావతికి న్యాయం జరిగే దిశగా పోరాటం చేయాలనీ నిర్ణయయించారు.

 

అయితే టీడీపీ ఎంపీల ఈ ప్రయత్నాన్ని తిప్పి కొడుతూ ఒక పక్క మూడు రాజధానులకు మార్గం సుగమం చేస్తూ.. మరో పక్క ప్రతిపక్ష నేత చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేస్తూ వైసిపి పావులు కదుపుతోంది. దీని కోసం ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతిలో చోటుచేసుకున్న అక్రమాలు, ఫైబర్ నెట్ కాంట్రాక్టుల్లో అవినీతిపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే దీని పై ఇంకా కేంద్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాల పై సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేస్తూ లోక్ సభలో ఈ అంశం లేవనెత్తబోతున్నారు. దీంతో అటు అమరావతి నుండి రాజధానిని మార్చడంతో పాటు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ లను టార్గెట్ చేసి ప్రతిపక్షాన్ని కోలుకోలేని దెబ్బకొట్టే ఆలోచనలో వైసిపి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఏమైనా సరే రాజధాని, ఫైబర్ నెట్ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని వైసీపీపీ కేంద్రాన్ని పట్టుబట్టే అవకాశం కూడా ఉంది. టీడీపీ అధినేత తో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతలకు కూడా ఈ స్కామ్ లో భాగస్వామ్యం ఉందని వైసిపి ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్ననేపథ్యంలో సిబిఐ విచారణ కు కేంద్రం ఒప్పుకుంటే ఇక టీడీపీ గట్టి దెబ్బ అనే ఆలోచనలో వైసిపి అగ్రనాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నటుగా ఇటు రాజధాని మార్పుతో పాటు అటు రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయవచ్చనేది వైసిపి మంత్రాంగం గా కనిపిస్తోంది. అయితే ఈ ప్రయత్నంలో వైసిపి ఎంతవరకు విజయవంతమౌతుందో వేచి చూడాలి.

By
en-us Political News

  
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
Publish Date:May 3, 2026
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు. ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.