వైసీపీ స్వరం మారింది.. కేంద్రంతో ఎక్కడ చెడింది?

Publish Date:Jul 28, 2022

Advertisement

వైసీపీ స్వరం మారింది. నిన్నటి దాకా వేనోళ్ల పొగుడుతూ మోడీకి బ్రహ్మరథం పట్టిన వైసీపీ ఇప్పుడు విమర్శల పల్లవి అందుకుంది. కేంద్రం సొమ్ములు ఇవ్వడం లేదు కనకనే పోలవరం ముంపు బాధితులను ఆదుకోలేకపోతున్నాం. పునరావాల ప్యాకేజీ ఇవ్వలేకపోతున్నాం అని జగన్ చెప్పిన రెండో రోజునే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి కేంద్రం తీరుపై నిరసన గళం విప్పారు.

దేశంలోని ధనిక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పులు ఓ లేక్కా అని తేల్చేశారు. అసలు కేంద్రంలోని మోడీ సర్కార్ కంటే ఏపీలోని జగన్ సర్కార్ పాలన భేషుగ్గా ఉందంటూ కితాబిచ్చేశారు. హస్తినలో ఆయన గురువారం మీడియా సమావేవం ఏర్పాటు చేసి జగన్ వంటి సమర్థుడైన సీఎం ఉండటం ఏపీ ప్రజల అదృష్టం అన్నారు.  శ్రీలంకలో జరిగిన పరిణామాలపై కేంద్ర ఆర్దిక మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రుల ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అసందర్భంగా దేశంలోని   రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్దిక పరిస్థితులపై ప్రజంటేషన్ ఇచ్చారని విజయసాయి విమర్శించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 6.9% ఉంటే ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు కేవలం 3.18% మాత్రమే ఉందని అన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కేంద్ర విధానాలే కారణమని నిందించారు. కేంద్రంపై విమర్శలు గుప్పించడానికి ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటను ఎంచుకున్నారు.

 కేంద్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపేణా వచ్చిన మొత్తంలో 41% రాష్ట్రాలకు ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది పూర్తిగా అవాస్తవమన్నారు. ఇప్పటి వరకూ కేసీఆర్ ఏం చెబుతూ వచ్చారో అదే చెప్పి విజయ సాయి కేంద్రం రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతోందని విమర్శించారు.కేంద్రం సెస్‌లు, సర్‌చార్జీల ద్వారా తన ఆదాయాన్ని పెంచుకుంటూ రాష్రాలకు వచ్చేఆదాయాన్ని ప్రణాళికా బద్దంగా తగ్గించేస్తున్నదని అన్నారు. నిన్న మొన్నటి వరకూ అప్పుల కోసం దాదాపుగా పీఎంవోలోనే మకాం వేసినట్లుగా వ్యవహరించిన విజయసాయి..హఠాత్తుగా గళం మార్చడానికి ఇక కేంద్రం నుంచి అడ్డగోలుగా అప్పులకు అనుమతులు రావన్నది నిర్ధారణ కావడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అదీ కాక ఎర్లీ ఎలక్షన్ల విషయంలో సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లేనని, ఇంకా కేంద్రాన్ని పొగడుతూ కూర్చుంటే రాష్ట్రంలో మనుగడ కష్టమన్న భావనతోనే వైసీపీ గళం సవరించుకుని కేంద్రంపై విమర్శలకు తెరలేపిందని అంటున్నారు. కానీ
గతంలో కేంద్రం ఏపీ విషయంలో తక్కువ చేసి మాట్లాడినా, ఏపీకి నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసినా ఆఖరికి విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయడం తధ్యమని పార్లమెంటు సాక్షిగా ప్రకటించినా కిమ్మనని వైసీపీ నేతలు ఇప్పుడు కేంద్రంపై ఇలా రెచ్చిపోవడం వైసీపీ శ్రేణులనే ఆశ్చర్య పరుస్తోంది. కేంద్రంతో ఎక్కడ తేడా వచ్చిందా అని పార్టీ వర్గాలే తర్జనబర్జన పడుతున్నాయి. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.