జగన్ తీరు.. వైసీపీ క్యాడర్ బేజారు!

Publish Date:May 19, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన వైసీపీ  ప్రస్తుతం ఉనికిమాత్రంగా మిగిలిపోయింది. ఒకరిద్దరు నేతలు వినా మరెవరూ పెద్దగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం లేదు. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్  రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత,  జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి. ఇక ఏపీకి జగన్ చుట్టపు చూపుగా వస్తుండటం, తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లకే పరిమితం కావడం తప్ప చొరవ తీసుకుని పార్టీని, క్యాడర్ ను ముందుకు నడిపించడంలో ఎటువంటి చొరవా తీసుకోవడం లేదన్న విమర్శలు పార్టీ వర్గాల నుంచే వినవస్తున్నాయి.  

ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విపక్షం వైసీపీ మాత్రమే. అటువంటి పార్టీకి ఇప్పుడు దిశానిర్దేశం చేసే విషయంలో జగన్ ఉదాశీనంగా వ్యవహరించడంలో పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.  క్షేత్రస్థాయిలో సమస్యలపై స్పందించడంలో గానీ, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో గానీ పార్టీ శ్రేణులు పెద్దగా ఉత్సాహం చూపని పరిస్థితులు నెలకొని ఉండటానికి జగన్ నేరుగా ప్రజాక్షేత్రంలోకి రాకుండా బెంగళూరులోనే ఎక్కవ కాలం మకాం ఉండటం కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుని  నేరుగా రంగంలోకి దిగి, పార్టీని గాడిలో పెట్టకపోతే కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీకి దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాల్లోనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 

ఇక పోతే రాజకీయవర్గాలలో అయితే.. జగన్ రాజకీయ సన్యాసం చేశారా? లేక వ్యూహాత్మకంగా క్రియాశీలంగా ఉండటం లేదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ విధానాలను అడపాదడపా సోషల్ మీడియా వేదికగానో, తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే విమర్శించడం వినా..   ప్రజాక్షేత్రంలోకి వచ్చి గళమెత్తకపోవడంతో జగన్ ప్రభావం ఏపీ రాజకీయాలలో నామమాత్రంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.   

By
en-us Political News

  
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇమామ్‌లు, ముయెజ్జిన్‌లు, ఆలయ పూజారులకు నెలవారీ గౌరవ వేతనాలను ప్రకటించారు. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రవేశపెట్టిన ఈ విధానాలన్నింటికీ ప్రస్తుత సువేందు సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.