రాజధాని రైతుల పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలు!

Publish Date:Sep 12, 2022

Advertisement

రాజధాని అమరావతి మహా పాదయాత్ర 2.0కు.. ఆ ప్రాంత రైతులు సోమవారం(సెప్టెంబర్ 12) శ్రీకారం చుట్టారు. వెంకటాయపాలెంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం వెలుపల ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి వారి రథాన్ని నడిపారు. ఆ క్రమంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం రైతులు ఈ పాదయాత్రను ప్రారంభించారు.

 అయితే ఈ పాదయాత్రలో పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరో వైపు కొంతమంది అధికార వైసీపీ కార్యకర్తలు సైతం అమరావతి మహాపాదయాత్రకు మద్దతు ప్రకటించారు. ఆ క్రమంలో రథం నడిపే బాధ్యతను  వైసీపీ కార్యకర్తలకు రైతులు స్వయంగా అప్పగించారు. వెంకటాయపాలెం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర .. కృష్ణాయపాలెం, యర్రబాలెం మీదగా  15 కిలోమీటర్లు సాగి మంగళగిరి చేరుకుంటుంది.  ఈ రోజు రాత్రికి రైతులు అక్కడే బస చేస్తారు. రైతుల మహాపాదయాత్రలో  శ్రీవెంకటేశ్వరుడి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేశారు.  

అయితే రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు.. జగన్ ప్రభుత్వ ప్రకటనను వ్యతిరేకించారు. ఆ క్రమంలో రైతులు ప్రారంభించిన ఉద్యమం 2022 సెప్టెంబర్ 12(సోమవారం)తో వెయ్యి రోజూలు పూర్తి చేకుంది. ఈ నేపథ్యంలో అమరావతి టు అరసెవెల్లి పాదయాత్రకు రైతులు శ్రీకారం చుట్టారు.

అయితే ఈ పాదయాత్రలో అమరావతి అభివృద్ధి చెందితేనే ఆ ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందుతాయని..  రైతులు  ప్రజలకు వివరించనున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల నుంచి రైతులు, రైతు కూలీలు, మహిళలుతోపాటు అన్ని వర్గాల వారు విడతలవారీగా ఈ పాదయాత్రలో పాల్గొనున్నారు. నేడు వెంకటాయపాలెంలో  ప్రారంభమైన ఈ పాదయాత్ర... వెయ్యి కిలోమీటర్లు సాగి.. నవంబర్ 11వ తేదీన శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో కొలువైన  ప్రత్యక్ష నారాయణుడు సూర్య భాగవానుడి చెంతకు చేరనుంది.  ఇక ఈ పాదయాత్రకు అధికార వైసీపీ వినా  మిగిలిన రాజకీయ పక్షాలన్నీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.