విజయనగరం జిల్లాలో వైసీపీ క్యాడర్ ఖాళీ!?.. సత్తిబాబు ఉక్కిరిబిక్కిరి

Publish Date:Jun 6, 2022

Advertisement

బొత్స సత్యనారాయణ పవర్‌లోనే ఉన్నా... పార్టీలో ఆయన పవర్ క్రమ క్రమంగా తగ్గిపోతోందా? ఆ క్రమంలో సొంత జిల్లా విజయనగరంపై ఆయన పట్టుకోల్పోతున్నారా? జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ తెలుగుదేశంలోని జంప్ అవుతోందా? అంటే ఔననే సమాధానమే వస్తుంది.  

చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ క్యాడర్ సైకిలెక్కడానికి సిద్ధమౌతోంది. ఒక్క చీపురుపల్లి అనేమిటి.. విజయనగరం జిల్లా మొత్తంగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు పెరుగుతున్నాయి. దీంతో బొత్స సత్యన్నారాయణకుపార్టీ అధిష్ఠానం ఆగ్రహ సెగ తగులుతోందట. తాడేపల్లి ప్యాలస్   విజయనగరం జిల్లాలో పార్టీ నుంచి వలసలపై వస్తున్న ప్రశ్నల శరాలు తట్టుకోలేక బొత్స ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

దీంతో అసలు విజయనగరంలో  ఏం జరుగుతోందో తెలియక పార్టీ అగ్రనేతలు.. ఉత్తరాంద్ర ఇన్‌చార్జ్ వై వీ సుబ్బారెడ్డిని ఆశ్రయించి.. జిల్లాలో చోటు చేసుకొంటున్న తాజా పరిణామాలపై దృష్టి సారించి నివేదిక ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన వైవీ సుబ్బారెడ్డి.. జిల్లాలో కేడర్ జంపింగ్ కావడానికి గల రీజన్, రీజనింగ్ పై ఆరా తీయగా..   ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. 

విజయనగరం జిల్లా అంటేనే బొత్స సత్తిబాబు.. బొత్స సత్తిబాబు అంటేనే విజయనగరం జిల్లా అనుకునే పరిస్థితి నుంచి బొత్స సత్తిబాబు అండ్ కో.. ఒంటెద్దు పోకడలతో.. ఏక పక్ష నిర్ణయాలతో బొత్స ఉంటే విజయనగరంలో వైసీపీ ఖాళీ అనే పరిస్థితి ఏర్పడిందట.  బొత్స వైఖరిని చూసి జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఇదే ధోరణి అవలంబిస్తున్నారని.... దాంతో క్యాడర్ విసిగి వేశారిపోయి బొత్స, ఇతర ఎమ్మెల్యేల తీరుపై  బాహటంగానే విమర్శలు గుప్పిస్తూ..  సైకిల్ ఎక్కేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డికి అందిన సమాచారం. అలాగే జగన్ పరిపాలనపై ప్రజలలో పెరుగుతున్న  వ్యతిరేకత కూడా జిల్లా నుంచి వలసలకు ఒక కారణం అన్న సమాచారం కూడా వైవీ సుబ్బారెడ్డి ఆరాలో తేలిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
వైయస్ జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు.. మలి కేబినెట్‌లో సైతం బొత్స సత్యనారాయణ మంత్రిగా కొనసాగుతున్న సంగతి విదితమే.  అయితే జగన్ మలి కేబినెట్‌లో బొత్సకు చోటు దక్కకపోవచ్చుననే చర్చ బాగానే జరిగింది. విజయనగరం ఎమ్మెల్యే కె.వీరభ్రదస్వామికి మంత్రి పదవి కట్టబెడదామని తొలుత సీఎం  జగన్ భావించారని సమాచారం. కానీ వచ్చే ఎన్నికల్లో జిల్లాలో మళ్లీ ఫ్యాన్ పార్టీ సత్తా చాటాలంటే.. తనకు కేబినెట్‌ కొలువు తప్పని సరి అని బొత్స సత్తిబాబు జగన్ పై ఒత్తిడి పెంచడంతో తప్పని సరి పరిస్థితుల్లో ఒకింత అయిష్టంగానే జగన్ బొత్సకు కేబినెట్ లో చోటు పదిలం చేశారని చెబుతున్నారు.

అయితే ఒకింత అప్రాధాన్యత ఉన్న కేబినెట్ పోర్టుపోలియో కట్టబెట్టడంతో బొత్స రగిలిపోయారని సమాచారం. ఆయన తన శాఖను అంటే విద్యాశాఖను పట్టించుకోకపోవడం వల్లనే టెన్త్ ప్రశ్నపత్రాల  లీకేజీ, ఆ తరువాత చివరి నిముషంలో ఫలితాల విడుదల వాయిదా వంటి అంశాలు చోటు చేసుకున్నాయని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత తొలిసారి జరిగిన ఎన్నికలలో బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఘోర పరాజయం పాలైన సంగతి విదితమే. తదుపరి ఎన్నికలలో ఆయన విజయం సాధించినా అది ఫ్యాను గాలి స్పీడ్ తోనే అని వైసీపీ శ్రేణులు ఇప్పుడు విశ్లేషణలు చెబుతున్నారు.

ఆయనకు తన సొంత నియోజకవర్గంపై, జిల్లాపై నిజంగానే పట్టు ఉంటే 2014 ఎన్నికలలోనే జిల్లాలో పట్టు నిరూపించుకుని ఉండేవారు కదా అంటున్నారు.  జిల్లాలో అన్ని విధాలుగా  పరపతి కోల్పోయిన బొత్స సత్యనారాయణకు జగన్ పార్టీ అండతోనే ఎమ్మెల్యేగిరీ, మంత్రిపదవీ దక్కాయని వైసీపీ క్యాడర్ చెబుతోంది. అటువంటి వ్యక్తి తన ఒంటెత్తు పోకడలతో క్యాడర్ ను పార్టీకి దూరం చేస్తున్నారని పలువురు జిల్లా నేతలు వైవీ సుబ్బారెడ్డికి నివేదించినట్లు సమాచారం. బొత్స ఒంటెత్తు పోకడ కారణంగానే జిల్లాలో దాదాపు 2000 మంది వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగేదేశం గూటికి చేరారని వైవీకి నివేదిక అందిందంటున్నారు.

ఆ తరువాత బొత్స రంగప్రవేశం చేసి నష్ట నివారణకు చర్యలు చేపట్టినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉందని అంటున్నారు.  జిల్లా కేంద్రం విజయనగరంలోని వార్డుల నుంచి జిల్లా చిట్ట చివర నియోజకవర్గం వరకు ఫ్యాన్ పార్టీలోని కేడర్ మొత్తాన్ని లక్ష్యంగా చేసుకోని.. సైకిల్ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.  ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. దీంతో ఫ్యాన్ పార్టీలోని కేడర్‌నే కాదు.. లీడర్లను సైతం సైకిల్ ఎక్కించే పనిలో తెలుగు తమ్ముళ్లు.. ఫిక్స్ అయిపోయారని సమాచారం. జిల్లాలో వైసీపీ బలం, ప్రతిష్ట వేగంగా దిగ జారిపోతుండటంతో పార్టీలో  బొత్స ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనీ, పార్టీ అధిష్ఘానం ఆగ్రహానికి ఉక్కపోతకు గురౌతున్నారని పార్టీ క్యాడరే బొత్స మీద సెటైర్లు వెస్తున్నది.   

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.