బలం లేకున్నా నామినేషన్లు వేశారు.. బహిష్కరణ అంటూ డ్రామాలాడుతున్నారు!

Publish Date:Nov 22, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి  పీఏసీ కమిటీ సభ్యుల  ఎన్నికకు పోలింగ్ పూర్తయ్యింది. దీనితో పాటు ప్రజాపద్దులు , అంచనాలు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ  ల్లో సభ్యుల నియామకం కోసం ఎన్నిక  జరిగింది. ఈ ఎన్నికలను వైసీపీ బాయ్ కాట్ చేసింది.  సాంప్రదాయంగా ప్రతిపక్షానికి కేటాయించాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని సంఖ్యాబలంతో అధికార పక్షమే దక్కించుకోవాలన్న కుట్రతో ప్రభుత్వం ఎన్నిక నిర్వహించిందని విమర్శలు గుప్పించింది. అయితే వాస్తవానికి ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడమన్నది లాంఛనం మాత్రమే. అ లాంఛనాన్ని పాటించాలన్నా సభలో ప్రతిపక్షం హోదా ఉన్న పార్టీ ఉండాల్సి ఉంటుంది. వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. నిబంధనల ప్రకారం అయినా, లాంఛనం మేరకు అయినా వైసీపీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఇసుమంతైనా లేదు. అయినా ఆ పార్టీ పీఏసీ కోసం తగుదునమ్మా అంటూ పుంగనూరు పుడింగి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేత నామినేషన్ వేయించింది. 

పీఏసీలో మొత్తం 12 మంది సభ్యుల ఎన్నిక జరగాల్సి ఉంది. ఇందులో 9 మంది ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు. అయితే కూటమి నుంచి 9 నామినేషన్లు దాఖలు కావడంతో ప్రస్తుత సభలో సంఖ్యాబలం మేరకు వారంతా ఎన్నిక కావడం ఖాయం. అయితే వైసీపీ నుంచి దాఖలైన మూడు నామినేషన్లలో ఒక అభ్యర్ధి మాత్రం గెలిచే అవకాశముంది. ఈ తరుణంలో వైసీపీ పీఏసీ ఎన్నికల్ని బహిష్కరించింది.

ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం రెండు వరకూ సాగింది. ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటమి ఎటూ తప్పదని ముందే తెలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. అసలు తమ పార్టీ తరఫున నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఓటు వేయడానికి వైసీపీ అధినేత జగన్ కూడా అసెంబ్లీకి రాలేదు. వైసీపీ ఎన్నిక బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడానికి ముందే ఆయన బెంగళూరు చెక్కేశారు. అంటే ఏదో ఒక అయోమయం సృష్టించి ప్రభుత్వం సంప్రదాయాన్ని పాటించడం లేదు అన్న విమర్శ చేయడం కోసమే పెద్దిరెడ్డిచేత జగన్ నామినేషన్ వేయించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి పీఏసీ చైర్మన్ గా వైసీపీకి నిజంగా అవకాశం ఉంటే..  క్యాబినెట్ ర్యాంక్ కోసం జగనే స్వయంగా నామినేషన్ వేసి ఉండేవారని పరిశీలకులు అంటున్నారు.  

అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. కేవలం 11 మంది సభ్యుల సంఖ్యా బలంతో మూడు కమిటీలకూ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు  నామినేషన్లు దాఖలు చేశారో ఆ పార్టీకే తెలియాలి.  ఎన్నిక పూర్తయ్యింది. ఇక ఫలితాల ప్రకటనే తరువాయి. పీఏసీ చైర్మన్ గా  పులపర్తి ఆంజనేయులు (జనసేన), అంచనాల కమిటీ చైర్మన్ గా  వేగుళ్ల జోగేశ్వర రావు (టీడీపీ), పీయూసీ చైర్మన్ గా కూన రవికుమార్ (టీడీపీ) ఎన్నిక కానున్నారు. 

By
en-us Political News

  
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.