బీజేపీ.. వైసీపీ లవ్ బ్రేకప్!?

Publish Date:Jun 13, 2023

Advertisement

నాలుగేళ్లకు పైగా అవిచ్ఛన్నంగా సాగుతున్న బీజేపీ, వైసీపీ లవ్ బ్రేకప్ అయ్యిందా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  వైసీపీ, బీజేపీ బంధం తెగిపోయిందా అంటే ఔనని కానీ, కాదని కానీ చెప్పే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇరు పార్టీల బంధం పరస్పర ప్రయోజనాలతో కూడుకుని ఉన్నదని, ఆ ప్రయోజనాలు సిద్ధించవని నిస్సందేహంగా తేలిపోతే తప్ప ఆ బంధం తెగిపోయే అవకాశాలు లేవనీ చెబుతున్నారు.

అసలు బీజేపీ, వైసీపీల మధ్య లవ్..లవ్ జిహాద్ వంటిదేనని పరిశీలకులు అంటున్నారు. తనపై కేసుల నుంచి రక్షణ కోసం జగన్.. రాజ్యసభలో వైసీపీ మద్దతు కోసం బీజేపీ ఒకరికొకరు అండగా ఉంటున్నారే తప్ప అందులో ప్రజలకు సంబంధించిన అంశమేదీ లేదని పరిశీలకులు పలు సందర్భాలలో విశ్లేషించారు. ఈ పరస్పరాధార బంధం వెనుక అనేక విచిత్రాలు ఉన్నాయి. జగన్ పార్టీ వైసీపీ ఎన్డీయే భాగస్వామ్య పక్షం కాదు. అలాగే ఏపీలో ఆ రెండూ మిత్ర పక్షాలు కావు. వైసీపీని గట్టిగా వ్యతిరేకించే జనసేన ఏపీలో బీజేపీకి మిత్ర పక్షం. అయినా సరే మిత్రపక్షానికి మించిన ప్రాముఖ్యతను  కేంద్రంలోని బీజేపీ సర్కార్ జగన్ ప్రభుత్వానికి ఇస్తుంది. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అప్పులు తీసుకునే అవకాశం లేకుండా చేసిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏపీలోని జగన్ సర్కార్ కు మాత్రం కావాలని కోరిన ప్రతి సందర్భంలోనూ అప్పులకు అనుమతి ఇచ్చేస్తొంది. అభివృద్ధి అనే మాటే లేకుండా అప్పులు చేసి మరీ బటన్ లు నొక్కి ఎన్నికల ప్రయోజనాల కోసం సోమ్ములు పందేరం చేస్తున్న జగన్ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణా  రాహిత్యాన్ని ఖండించని కేంద్ర సర్కార్.. బహిరంగ వేదికలపై మాత్రం ఉచిత హామీలు అనుచితం అని ప్రసంగాలు దంచుతూ ఉంటుంది.  

మొత్తంగా జగన్ అక్రమాస్తుల కేసులో చాలా గట్టిగా వినిపించిన క్విడ్ ప్రోకో..యే వైసీపీ, బీజేపీ బంధానికి కూడా కారణమన్నది పరిశీలకుల విశ్లేషణ.   ఇప్పటి వరకూ రెండు పార్టీల మధ్యా ఎప్పుడైనా విమర్శలు చోటు చేసుకున్నా అవన్నీ కూడా ప్రేమికుల మధ్య వచ్చే చిలిపితగవుల వంటివేనని అంటున్నారు.  అయితే అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో  తాజాగా అమిత్ షా, నడ్డాల ఏపీ పర్యటన బ్రేకప్ చేప్పేసిందా అన్న స్థాయిలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. షా నడ్డాలు గతంలో  అంటే ఈ నాలుగేళ్ల పైచిలుకు కాలంలో ఎన్నడూ లేని విధంగా  జగన్ సర్కార్ అక్రమాలు, అన్యాయాలు, కుంభకోణాలే లక్ష్యంగా ఏపీ గడ్డపై నుంచే తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై విమర్శలేంటి అంటూ మొహమాటంతో  ప్రసంగ అనువాదాన్ని ఒకంత తీవ్రత తగ్గించి చేసిన జీవీఎల్ ను అయితే అమిత్ షా వేదికమీదే తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ, బీజేపీ లవ్ కు బ్రేకప్ పడిపోయిందా అన్న అనుమాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇందుకు ఇటీవల అమిత్ షా, నడ్డాలతో హస్తినలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు భేటీని ఒక కారణంగా చూపుతున్నారు. నిజమే చంద్రబాబు తనంత తానుగా హస్తిన వెళ్లి నడ్డా షాలతో భేటీ కాలేదు. అమిత్ షా నివాసంలో చంద్రబాబుతో నడ్డా షాలు భేటీ అయ్యారు. ఆ భేటీలో చర్చలు ఏమిటి? నిర్ణయాలు ఏమిటి? అన్నది పక్కన పెడితే.. బీజేపీ, వైసీపీల బంధం బ్రేక్ కావడానికి అదీ ఒక కారణమేనని అంటున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం ఆ రెండు పార్టీల బ్రేకప్ విషయంలో అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేయడం కరెక్ట్ కాదంటున్నారు. 

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.