Publish Date:May 20, 2025
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ చేస్తాని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
Publish Date:May 20, 2025
రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.
Publish Date:May 20, 2025
తిరుమల తిరుపతి దేవస్థాన మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల కొండల్లో ఉన్న పచ్చదనాన్ని అటవీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణయించారు. పచ్చదనాన్ని పెంచేందుకు రూ.4 కోట్ల కేటాయించింది. స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు.
Publish Date:May 20, 2025
ఏపీ సీఎం చంద్రబాబు రేపు చిత్తూరు జిల్లా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం మధ్యాహ్నం అమ్మవారిని కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి దర్శించుకుంటారు.
Publish Date:May 20, 2025
జగన్ అడ్డా కడపలో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 19 వరకూ జరిగే పసుపు పండుగ మహానాడు నిర్వహణ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు.
Publish Date:May 20, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Publish Date:May 20, 2025
ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
Publish Date:May 20, 2025
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఆందోళన రేపుతున్నాయి. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు, వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు.
Publish Date:May 20, 2025
బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో వంశీని రెండు రోజుల కస్టడీకి ఇవ్వాలని హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టుకు కోరారు.
Publish Date:May 20, 2025
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. యూనివర్శిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత, అనీల్ కుమార్ దంపతులు హాజరయ్యారు.
Publish Date:May 20, 2025
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పెంచిన ప్రయాణ ఛార్జీలను సవరించింది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరిస్తూ, వాటిని 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం పేర్కొన్నాది.
Publish Date:May 20, 2025
నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో బుధ, గురువారాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Publish Date:May 20, 2025
తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఓవంక సుపరిపాలన ద్వారా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటూనే, మరో వంక పార్టీ పటిష్టతపై దృషి కేంద్రీకరించారు. గతంలో అధికారంలో ఉన్న ఐదేళ్లలో.. అప్పటి పరిస్థితులు, ముఖ్యంగా రాష్ట్ర విభజన విసిరిన సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కునే క్రమంలో .. చంద్రబాబు, స్టేట్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ నినాదంతో శక్తి యుక్తులు అన్నింటినీ రాష్ట్ర ప్రయోజనాలకే వెచ్చించారు.