చింత చచ్చినా పులుపు చావలేదంటారు… అలాగే ఉంది తిరుపతిలో వైసీపీ నాయకుల ధోరణి… అధికారులపై వైసీపీ నాయకుల పెత్తనం ఇంకా తగ్గడం లేదు. తమ ప్రభుత్వ హయాంలో ఉన్న విధంగానే ఇంకా అయ్యా సార్ అనేలాగే అధికారులు ఉండాలనే ఆశిస్తున్నారు. కాదు… కాదు ఆదేశిస్తున్నారు. ఓవైపు అధినేత జగన్ ఉన్నతాధికారులను హెచ్చరిస్తుంటే.. మరోవైపు జిల్లా స్థాయి నాయకులు కిందిస్థాయి అధికారులను బెదిరిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను ప్రచారం చేయడానికి ఓ కొత్త అంశంతో తెర పైకి వచ్చింది. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణస్వామి, శ్రీకాళహస్తి ఇంఛార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డి, సత్యవేడు ఇంఛార్జ్ రాజేష్, మేయర్ డాక్టర్ శిరీష, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశి సహా వైసీపీ నాయకులు తరలి వచ్చారు.
కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకపోవడంతో డీఆర్వో నరసింహులు, ఇతర అధికారులు ప్రజలు నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. అక్కడికి వచ్చిన వారు నేరుగా డీఆర్వో దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే ఇతరుల నుంచి అర్జీలు తీసుకుంటున్న డీఆర్వో వారితో మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు హడావుడితో అర్జీదారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో అర్జీ పత్రాన్ని భూమన కరుణాకర్ రెడ్డి డీఆర్వోకు ఇవ్వడానికి సిద్దం కాగా.. డీఆర్వో నరసింహులు తన సీటులో కూర్చోని చేయి చాచారు. దీంతో వైసీపీ నాయకులు డీఆర్వోపై ఆగ్రహిస్తూ.. సీటులో నుంచి లేచి వినతి పత్రం తీసుకోవాలని హూంకరించారు . తొలుత లేచి వినతి పత్రం తీసుకోవడానికి ఇష్టపడని డీఆర్వో, మరోసారి వైసీపీ నాయకులు గద్దించడంతో సీటులంచి లేచి నిలబడి తీసుకున్నారు. అయితే వైసీపీయుల దాష్టీకం, అహంభావం జనానికి ఇసుమంతైనా నచ్చలేదు. అక్కడ ఉన్న ప్రజలు మాత్రం చింత చచ్చినా పులుపు చావలేదనే సామెతను తలుచుకుంటూ అధికారం పోయినా అహంకారం తగ్గడం లేదని వ్యాఖ్యానించడమే ఇందుకు తార్కానం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-arrogance-continue-even-after-power-loss-39-203529.html
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.