న్యాయవ్యవస్థపై వైసీపీ మళ్లీ దాడి- సుప్రీం కోర్టు తీర్పునకే వక్ర భాష్యాలు

Publish Date:Aug 2, 2022

Advertisement

కోర్టు తీర్పులను లెక్క చేయకపోవడం, తీర్పులను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా వ్యవహరించడం వైసీపీ సర్కార్ కు  ఒక అలవాటుగా మారిపోయింది. జగన్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల అధికారులు కోర్టు బోనులో నిలబడాల్సి వచ్చిన సందర్భాలు ఏపీలో పలు ఉన్నాయి. అయినా తన ధోరణి తనదే అన్నట్లుగా వైసీపీ సర్కార్ వ్యవహరిస్తోంది.

ఈ క్రమంలో ఏకంగా సుప్రీం కోర్టు తీర్పునే తప్పుపడుతూ ఆ పార్టీ ఎంపి తీవ్ర వ్యాఖ్యలు  చేశారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ న్యాయ వ్యవస్థకు వివక్షను ఆపాదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం కిందట సుప్రీం కోర్టు రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదంటూ ఇచ్చిన తీర్పులు ఉటంకిస్తూ వైసీపీ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తీర్పు కారణంగా న్యాయవ్యవస్థలో బీసీల సంఖ్య చాలా తక్కువ అయ్యిందనీ, ఆ కారణంగానే కోర్టు తీర్పులలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందనీ విమర్శలు గుప్పించారు.

దుర్భుద్దితోనే సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై  తీర్పు ఇచ్చిందని.. వెంటనే దాన్ని ఎత్తి వేయాలని అన్నారు.   రిజర్వేషన్లపై  సుప్రీం తీర్పు రాజ్యాంగం సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన అధికారాల దుర్వినియోగమేనని విరుచుకు పడ్డారు. న్యాయవ్యవస్థలో తగినంత మంది బీసీలు లేకపోవడం వల్లే వారికి అన్యాయం జరుగుతోందని సంజీవ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు తప్పుడు ఉద్దేశాలను అపాదించడమనే ప్రమాదకర క్రీడకు వైసీపీఎంపీ సంజీవ్ కుమార్ తెరతీయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అయితే న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు టార్గెట్ గా వైసీపీ దాడులు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో వైసీపీ   న్యాయవ్యవస్థపై చేయని దాడి లేదు. సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పేరు పరిశీలనలో ఉన్న సమయంలో ఏకంగా ఆయనపైనే తప్పుడు ఆరోపణలు చేశారు. రాష్ట్రపతికి స్వయంగా వైసీపీ అధినేత జగన్ జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలతో లేఖ కూడా రాశారు. అయితే ఆ ఫిర్యాదులూ, ఆరోపణలూ అన్నీ తప్పుడువని తేలిపోయాయి. జస్టిస్ ఎన్వీరమణ సీజేఐ అయ్యారు. ఈ నెలలోనే ఎన్వీ రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నెలలోనే మళ్లీ న్యాయవ్యవస్థపై వైసీపీ వ్యూహాత్మకంగా దాడి చేస్తోందని న్యాయవర్గాలు అంటున్నాయి. అక్రమాస్తుల కేసుల భయంతోనే జగన్ ఇదంతా చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.