జ‌గ‌న్‌ డౌన్ డౌన్‌.. పిన్నెల్లి ర‌చ్చ‌.. కోటంరెడ్డి క‌న్నీరు.. వైసీపీలో సంక్షోభం..

Publish Date:Apr 10, 2022

Advertisement

జ‌గ‌న్ ప‌ని అయిపోయిన‌ట్టే. ఒక‌ప్పుడు జ‌గ‌నే మోనార్క్‌.. జ‌గ‌న్‌ చెప్పిందే శాస‌నం అన్న‌ట్టు ఉండేది వైసీపీ. అధినేత గీసిన గీత‌ను ఏ ఒక్క‌రూ జ‌వ‌దాటేవారు కాదు. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. కేబినెట్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌తో వైసీపీలో కుంప‌టి రాజుకుంది. జ‌గ‌న్‌రెడ్డిని అయితేనేం.. సీఎం డౌన్ డౌన్ అంటూ వైసీపీ నేత‌లు రోడ్డెక్కారు. జ‌గ‌న్ దిష్టిబొమ్మ‌లు త‌గ‌ల‌బెట్టారు. ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తున్నారు. అధికార పార్టీలో కిష్కింద‌కాండ న‌డుస్తోంది.  

కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశకు గురయ్యారు. వివిధ రూపాల్లో తమ అసమ్మతిని వ్యక్తం చేస్తుండగా.. వారి అనుచరులు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కేబినెట్‌లో చోటు కల్పించకపోవడంపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లికి జ‌గ‌న్‌రెడ్డి హ్యాండ్ ఇవ్వ‌డంపై మండిపడ్డారు. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, రెంటచింతల మండలాల పరిధిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలిపారు. రోడ్ల‌పై టైర్లు తగులబెట్టారు. మాచర్ల నియోజకవర్గ మహిళా నాయకురాలు ఒక‌రు మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా.. అక్క‌డున్న‌వారు ఆమెను అడ్డుకున్నారు. ఇక‌, మాచర్ల మున్సిపల్‌ ఛైర్మన్‌ కిషోర్‌తో పాటు 30మంది కౌన్సిలర్లు, 5మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు రాజీనామాలు చేస్తామ‌ని ప్రకటించారు. సీఎం కార్యాలయం ఫోన్ వ‌చ్చినా.. పిన్నెళ్లి స‌రిగ్గా జ‌వాబు ఇవ్వ‌కుండా సెల్‌ఫోన్‌ స్విఛాఫ్ చేసి సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.

మ‌రోవైపు, జ‌గ‌న‌న్న త‌న‌కు తీవ్ర అన్యాయం చేశాడంటూ నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి క‌న్నీరు పెట్ట‌డం క‌ల‌క‌లం రేపింది. ‘‘పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్నా. మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించింది. కార్యకర్తలు, నాయకులు వారి రక్తం చెమటగా మార్చి నాకోసం కష్టపడి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు’’ అన్నారు. నెల్లూరు రూరల్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాజీనామాలకు సిద్ధమైన నేతలు, కార్పొరేటర్లకు కోటంరెడ్డి నచ్చజెప్పారు. 

కేబినెట్‌లో చోటు కల్పించకపోవడంతో ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అనుచరులు భగ్గుమన్నారు. ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. పెట్రోల్‌పోసి ద్విచక్రవాహనాన్ని తగులబెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు మంటలు అంటుకున్నాయి. అనంతరం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మరోవైపు జగ్గయ్యపేటలోని ఉదయభాను నివాసం వద్దకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన తెలిపారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ ప్రభాకర్‌, ప‌లువురు కార్పొరేట‌ర్లు రాజీనామాల‌కు సిద్ధ‌మ‌య్యారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.    

కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధికి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున విజయవాడ చేరుకుని నిరసన చేశారు. కేబినెట్‌లో తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధికి చోటు లేకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సహకార సంఘాలు అధ్యక్షులు రాజీనామాలకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో  నంద్యాల జిల్లా ఆత్మకూరులో ముగ్గురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు. 
 

By
en-us Political News

  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.