Publish Date:Jul 16, 2022
పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం మోగించేశారు. జనసేన ఎన్నికలకు సిద్ధంగా ఉందని ప్రకటించేశారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆయన శనివారం ఆయన లక్ష రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా మండపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
ఏపీ భవిష్యత్‌కు హానికరంగా మారిన వైసీపీ మరో సారి అధికారంలోకి రాకూడదన్నారు. జనసేనను అధికారంలోకి తీసుకు రావాలని ప్రజల్ని తాను కోరడం లేదనీ, ఈ ప్రభుత్వం కావాలా.. మరో ప్రభుత్వం రావాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. తనకు జగన్ లాగా సిమెంట్ ఫ్యాక్టరీలు లేకపోయినా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు కోట్ల రూపాయలు సాయం అంద జేశానని చెప్పిన పవన్ కల్యాణ్. ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ. ఏడు లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును దురుద్దేశపూర్వకంగా పెట్టారని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ చేసిన హత్య కేసును తప్పు దారి పట్టించేందుకే ఎన్నికల సమయంలో జనసేన ఎన్నికల ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులను పంచాయతీ అభివృద్దికే కేటాయిస్తామని స్పష్టం చేశారు. తప్పు జరిగినప్పుడు ఎదిరించే శక్తి లేకపోతే మనుగడ ఉండదన్నారు. గతంలోలాగే ఆయన ప్రసంగంలో కొంత అస్పష్టత కనిపించింది.
జనసేనను అధికారంలోకి తీసుకు రావాలని తాను కోరడం లేదని అంటూనే తమ పార్టీ అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులను పంచాయతీల అభివృద్ధికే ఖర్చు చేస్తామన్నారు. అభ్యర్థి ఎవరన్నది చూడకుండా తనను చూసి ఓటేయమన్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. ఎన్నికలలో విజయంపై భిన్న వ్యాఖ్యలు చేసినా వైసీపీ అధికారంలోకి రాకూడదన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పారు. కులాలను గౌరవిస్తూనే కుల రహిత సమాజం కోసం ఆలోచించాలన్నారు. యువత తిరగబడితేనే మార్పు వస్తుందన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-a-hurdle-to-progerss-says-pawan-kalyan-25-139908.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!