వైసీపీ నేతల పుష్ఫ డైలాగ్‌లు.. జగన్ మెహర్బానీ కోసమేగా?
Publish Date:Jul 14, 2025

Advertisement
రప్పా.. రప్పా.. డైలాగ్‌పై పేటెంట్ తీసుకున్నట్లు దాన్నే స్లోగన్‌గా మార్చేసుకుంటున్నారు వైసీపీ నేతలు ... జగన్ సైతం ఆ డైలాగ్ వాడకాన్ని సమర్ధించడంతో ఆయనతో వీరతాళ్లు వేయించుకోవడానికి ఎవరికి వారు ఆ పుష్ఫ డైలాగ్ తెగ రిపీట్ చేస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు వరకు ఆ డైలాగ్ వాడుతూ కార్యకర్తలను రెచ్చ గొడుతూ.. పోలీసులకు వార్నింగులిస్తున్నారు.
కృష్ణాజిల్లాలో బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమాల్లో పాల్గొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని రప్పా.. రప్పా..డైలాగ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లోకేష్ రెడ్ బుక్ అంటున్నాడు.. మీరు కూడా రప్పా.. రప్పా అంటున్నారు.. ఏదైనా పని చేయాలంటే రప్పా రప్పా అనడం కాదు.. చీకట్లో కన్నుకొడితే పని అయిపోవాలని పేర్నినాని వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మూడు నాలుగు రోజులుగా పేర్ని నాని ఎక్కడకు వెళ్లినా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు.
నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైసీపీ కార్యకర్తల విస్తృత సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటాసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి కూడా సినిమా స్టైల్లో డైలాగులు వల్లె వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు సృష్టిస్తున్నారని.. కూటమి నాయకులకు వత్తాసు పలుకుతున్న అధికారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారీ వార్నింగ్ ఇచ్చారు. వైసిపి 2.0 అంటే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే టిడిపి నాయకుల తుకులు ఎలా ఉంటాయో చూస్తాం.. అంటూ అనుచిత బాషలో చెలరేగిపోయారు ఓబుల్‌రెడ్డి.
మరోవైపు విద్యాశాఖ మాజీమంత్రి ఆదిమూలపు సురేష్‌కు సైతం రప్పా..రప్పా.. పూనకం రావడం విశేషం. ప్రకాశం జిల్లా కొండేపి వైసీపీ ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ పార్టీ సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలని రెచ్చగొడుతూ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుండి కొండేపి నియోజకవర్గంలో మరో లెక్క అంటూ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడి కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీమంత్రి పినిపే విశ్వరూప్ కూడా అదే మంత్రం ఎత్తుకున్నారు.. ఆ ఫ్లోలో రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ధ్వజమెత్తిన ఆయన.. రాబోయేది వైసీపీ ప్రభుత్వమని సిఐని విఆర్ లో పెట్టిస్తానని.. జైల్లో పెట్టించి, ఊచలు లెక్కిపెట్టిస్తానని హెచ్చరించారు .
ఒకవైపు కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కార్యక్రమాలు నిర్వహస్తోంది. సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలు జరిగాయో తెలుసుకొని, అర్హత కలిగి ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల లబ్ది పొందలేని వారికి సంక్షేమ పథకాలను అందజేసేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు వాడవాడకు,ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు తో పాటు స్థానిక సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే పనిలో పడ్డారు. గెలిచిన తరువాత ఏసీ గదులకు, సొంత కార్యాలయాలకు ... దూరపు నగరాలకు పరిమితం అయిన నేతలు ప్రజల్లోకి వెళ్లటం మొదలు పెట్టారు. దీంతో ప్రజల్లో కూటమి నేతలకు మంచి ఆదరణ లభిస్తోందంటున్నారు. అది గమనించిన వైసీపీ అధిష్టానం టీడీపీ మ్యానిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ పథకాల లో కొన్ని పథకాలను అమలు చెయ్యలేదని దానిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించింది. దీంతో విద్రోహ దినం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా ఆశించిన ఫలితం రాలేదు.
ఆ క్రమంలో వైసీపీ అధిష్టానం వెంటనే .. బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ .. పేరుతో కార్యక్రమానికి పిలుపునిచ్చి నేతలను ప్రజల్లోకి వెళ్లాలని తీర్మానించింది. దీంతో ప్రజల్లోకి వెళ్లేందుకు వారు ఏ మార్గం దొరక్క కార్యకర్తలను రెచ్చగొడుతున్నారంట. వైసీపీ అధ్యక్షుడి కార్యక్రమాల్లో కూడా అదే ఉద్దేశ్యంతో కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేయిస్తుండటం, వాటిని జగన్ సమర్ధిస్తుండటం అందులో భాగమే అంటున్నారు. జగన్ ఎక్కడకు వెళ్లినా అక్కడ భారీ జనసమీకరణతో పాటు ఏదో ఒక గొడవ సృష్టిస్తూ చర్చల్లో నిలవడడమే పనిగా పెట్టుకున్నారు.
పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే నాలుగైదు కేసులు నమోదయ్యాయి. పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన కాటసాని ఓబుల్ రెడ్డిపై బనగానపల్లె స్టేషన్లో కేసు నమోదు అయింది. కూటమి నేతలు, పోలీసులను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తానంటున్న పినిపే విశ్వరూప్ వంటి వారిపై కూడా కేసు పెట్టడానికి కూటమి శ్రేణులు సిద్దమవుతున్నాయి. మొత్తమ్మీద ఈ రప్పా.. రప్పా.. రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో
http://www.teluguone.com/news/content/ycp--leaders-provacative-dialauges-39-201961.html












