యార్లగడ్డ జంప్.. జగన్ రాయబారం !

Publish Date:Aug 22, 2023

Advertisement

గన్నవరం నియోజకవర్గంలో వైయస్ఆర్ సీపీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావ్.. అధికార ఫ్యాన్ పార్టీ వీడి.. సైకిల్ పార్టీలోకి జంప్ కొట్టేశారు. ఆ క్రమంలో ఆదివారం అంటే ఆగస్ట్ 20వ తేదీ హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయనతో యార్లగడ్డ వెంకట్రావ్‌ భేటీ అయ్యారు.

దీంతో ఇప్పటి వరకు గన్నవరం నియోజకవర్గ వ్యవహారంపై స్తబ్దుగా ఉన్నా.. ఫ్యాన్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ అదే రోజు.. అంటే ఆగస్ట్ 20వ తేదీ.. గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఫ్యాన్ పార్టీ కీలక నేత దుట్టా రామచంద్రరావుతోపాటు అతడి కుమార్తె, అల్లుడు శివభరత్‌రెడ్డిని.. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయానికి పిలుపించుకొని..  వారితో వైయస్ జగన్ భేటీ అయి.. వారికి భవిష్యత్తు భరోసా ఇచ్చారు. 

ఈ బేటీ అనంతరం దుట్టా రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలోని కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దని.. త్వరలో మంచి రోజులు వస్తాయని ఆయన ప్రకటించడం.. నాయకులు వస్తుంటారు, వెళ్తూంటారు.. కానీ కార్యకర్తలు మాత్రం శాశ్వతమని.. అలాగే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. ఇక వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్‌ని గెలిపించుకొనేందుకు మనమందరం కష్టపడాలంటూ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు. తమకు వైయస్ కుటుంబంతో 45 ఏళ్లు అనుబంధం ఉందని ఈ సందర్భంగా దుట్టా గుర్తు చేసుకొన్నారు. 

అయితే ఇటు యార్లగడ్డ సైకిల్ పార్టీలోకి దూకేయడం.. అటు సీఎం జగన్‌తో దుట్టా రామచంద్రరావు భేటీ కావడం.. ఈ రెండు భేటీలు ఒకే రోజు కావడం.. ఆ వెంటనే దుట్టా రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యాన్ పార్టీ శ్రేణులకు ధైర్య వచనాలు చెప్పడంపై పోలిటికల్ సర్కిల్‌లో ఊహాగానాలు ఊపందుకొన్నాయి.   

యార్లగడ్డ వెంకట్రావ్ ఇటీవల ఆయన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్ పార్టీ అగ్రనేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం వైయస్ జగన్ అపాయింట్‌మెంటి ఇవ్వడం లేదని.. అలాగే పార్టీ స్థాపించిన నాటి నుంచి వైయస్ జగన్ కోసం కష్టపడుతోన్న దుట్టా రామచంద్రరావు లాంటి వారిని సైతం పదవులకు దూరంగా పెట్టారని..... అంతేకాకుండా వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ వారం, రెండు వారాల ముందు ఫ్యాన్ పార్టీలో చేరిన.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కైకలూరుకి చెందిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మంగళగిరికి చెందిన మాజీ మంత్రి ఎం హనుమంతరావు లాంటి వారికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారంటూ వైయస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. మరి ఫ్యాన్ పార్టీ ఎదుగుదల కోసం కష్టపడిన దుట్టా రామచంద్రరావులాంటి వారు.. మీకు గుర్తుకు రాలేదా? అంటూ ఇదే సమావేశంలో ఫ్యాన్ పార్టీ అగ్రనేతలను యార్లగడ్డ వెంకట్రావ్ కడిగి పారేశారు.  

దీంతో యార్లగడ్డ వెంకట్రావ్ సైకిల్ పార్టీలోకి వెళ్లిపోతే.... దుట్టా రామచంద్రరావుతోపాటు ఆయన వర్గం సైతం యార్లగడ్డ బాట పట్టేస్తారని సీఎం జగన్ భావించి.. తనతో భేటీ కావాలంటూ దుట్టా రామచంద్రరావుకు ఆగమేఘాల మీద ఫ్యాన్ పార్టీ అధినేత రాయబారం పంపినట్లు ఓ టాక్ అయితే పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి దుట్టా రామచంద్రరావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. దీంతో దుట్టా సైతం పార్టీ మారితే.. గన్నవరంలో ఫ్యాన్ పార్టీ గెలుపు గల్లంతు అయ్యే అవకాశం ఉందనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.

ఎందుకంటే గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట.. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో సైతం టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఆ తర్వాత ఆయన జగన్ పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో గన్నవరం నుంచి గట్టి అభ్యర్థిని బరిలో దింపేందుకు టీడీపీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. అలాంటి వేళ... యార్లగడ్డ సైకిల్ పార్టీలో చేరడం వల్ల... పసుపు పార్టీకి మరింత బలం చేకూరుతోందనే ఓ చర్చ సైతం నడుస్తోంది.

ఇంకోవైపు.. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాలని.. దుట్టా రామచంద్రరావు అల్లుడు, సీఎం వైయస్ జగన్ భార్య వైయస్ భారతీ సమీప బంధువు శివ భరత్ రెడ్డి ఆశిస్తున్నారు. గత ఎన్నికల వేళే.. దుట్టా అల్లుడు గన్నవరం ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. అది సాధ్యపడలేదు. కానీ ఈ సారి ఆయన సైతం తన ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అదీకాక గన్నవరం సీటు వల్లభనేని వంశీకే అని ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించారని ఓ చర్చ అయితే ఆ నియోజకవర్గంలో ప్రచారంలో ఉంది. మరి అలాంటి వేళ వచ్చే ఎన్నికల్లో వంశీ, శివభరత్ రెడ్డి మధ్య పోటీ ఉండే అవకాశాలు లేకపోలేదనే ఓ చర్చ సైతం వాడి వేడిగా సదరు సర్కిల్‌లో నడుస్తోంది. 

ఎందుకంటే గతంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో నియోజకవర్గంలోని ప్రజల్లో వల్లభనేని వంశీపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. అదీ కూడా చాపకింద నీరులా ఉందనే ఓ చర్చ అయితే ఉందని... దీంతో ఎన్నికలు సమీపించగానే.. ఇదే అంశాన్ని సాకుగా చూపి... వైయస్ భారతీ సమీప బంధువు శివ భరత్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ తెరపైకి తీసుకు వచ్చినా అందులో ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో కొన.. సాగుతోంది. 

మరి వచ్చే ఎన్నికల్లో అదీ.. గన్నవరం లాంటి హాట్ సీట్‌ కోసం టీడీపీ నుంచి యార్లగడ్డ బరిలోకి దిగితే.. ఫ్యాన్ పార్టీ నుంచి వల్లభనేని వంశీనా? లేకుంటే శివ భరత్ రెడ్డా? ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అనే అంశం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా ఎవరు బరిలోకి దిగినా.. ఆ ఎమ్మెల్యే స్థానాన్ని ఏ పార్టీ అభ్యర్థి కైవసం చేసుకొంటారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో మాత్రం అలా ఇలా కాదు ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తోంది.

By
en-us Political News

  
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.