వైసీపీకి షాక్ తెలుగుదేశం గూటికి యార్లగడ్డ.. ముహూర్తం ఖరారు?

Publish Date:Aug 12, 2023

Advertisement

వైసీపీకి  జిల్లాల వారీగా నేతలు షాకులిస్తున్నారు. ఇప్పటికే బహిష్కృత ఎమ్మెల్యేలు గంపగుత్తగా టీడీపీ జెండా కిందకి వెళ్తుంటే మొన్న ఉత్తరాంధ్ర నుండి విశాఖ జిల్లా అధ్యక్షుడే పార్టీకి గుడ్ బై చెప్పేశాడు. ఇక ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన ఉమ్మడి కృష్ణా జిల్లా  నుండి మరో షాక్ సిద్దమవుతున్నది. రాజధాని అమరావతికి అటు కృష్ణా, ఇటు గుంటూరు ఉమ్మడి జిల్లాలు ఈసారి ఎన్నికలకు ఎంతో కీలకం అన్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల పుణ్యమా అని ఈ రెండు ఉమ్మడి జిల్లాలలో ఈసారి వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్నది ఎప్పటి నుండో రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు జిల్లాలో చాలా మంది నేతలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇలాంటి వారందరికీ ఇప్పుడు గన్నవరం వైసీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు దారి చూపించేలా ఉన్నారు. యార్లగడ్డ వైసీపీని వీడి సైకిలెక్కేందుకు సిద్దమైనట్లు ఇక్కడ రాజకీయ వర్గాలు గట్టిగా చెప్తున్నారు.

నిజానికి చాలా కాలంగా యార్లగడ్డ పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఆయన పార్టీ మారలేదు. వైసీపీ అధిష్టానం తనకు ఏదైనా హామీ ఇస్తుందేమో అని చాలాకాలంగా ఎదురు చూశారు. కానీ, అటు సీఎం జగన్ నుండి కానీ, వైసీపీ పెద్దల నుండి కానీ యార్లగడ్డ రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెలలోనే నారా లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో ఎంటర్ కాబోతుంది. దీంతో అప్పుడే యార్లగడ్డ టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు చెప్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను దిగ్విజయం చేసి తన సత్తా చాటుకోవాలని యార్లగడ్డ సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇందుకు తగ్గట్లే తాజాగా యార్లగడ్డ తన అనుచరులతో ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని చర్చలు జరిపినట్లు తెలిసింది. 

అమెరికాలో పలు బిజినెస్‌లు చేసే యార్లగడ్డని వైసీపీ పనిగట్టుకొని 2019 ఎన్నికల సమయంలో  పార్టీలోకి తెచ్చుకుంది. అప్పుడు తెలుగుదేశం నుండి గన్నవరం బరిలో ఉన్న వల్లభనేని వంశీని ఓడించాలని యార్లగడ్డని గన్నవరం బరిలో నిలబెట్టి భారీగా ఖర్చు పెట్టించారు. కానీ  తెలుగుదేశంకు గట్టి పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలవలేకపోయింది. అయితే  ఎన్నిక‌లు అయ్యాక‌ రెండు మూడు నెలలకే వంశీ టీడీపీని విడిచి వైసీపీ పంచ‌న చేరారు. అధికారికంగా పార్టీ కండువా క‌ప్పుకోక‌పోయినా వంశీ వైసీపీకి అనుబంధంగానే కొన‌సాగుతున్నారు. అప్పటి నుండి  అమెరికా నుండి తీసుకొచ్చి ఖర్చు పెట్టించిన యార్లగడ్డను వైసీపీ పక్కన పెట్టేసింది. ఆది నుంచి ఇక్క‌డ వైసీపీని డెవ‌ల‌ప్ చేసిన యార్లగడ్డను కాదని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా వైసీపీ త‌ర‌ఫున వంశీ ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నట్లు తెలుస్తుంది. 

దీంతో కొంతకాలంగా వంశీపై బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్న యార్లగడ్డ.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ ఎమ్మెల్యే వంశీకి వ్య‌తిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పుడు వైసీపీని వీడి పసుపు సైన్యంలో చేరనున్నారు. దీంతో ఉమ్మడి కృష్ణాలో ముమ్మర చర్చ జరుగుతుంది. యార్లగడ్డ టీడీపీలో చేరితే వల్లభనేని వంశీ ఇక గన్నవరంపై ఆశలు వదులుకోవాల్సిందే అనే ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే ఆర్ధికంగా బలంగా ఉన్న యార్లగడ్డ ఏది ఏమైనా ఈసారి వంశీని ఓడించాలని బలంగా నిర్ణయించుకున్నారు. గత ఎన్నికలలో కూడా వంశీకి గట్టి పోటీ ఇచ్చారు. కానీ కేవలం వెయ్యి ఓట్ల తేడాతో వంశీ గెలిచారు. అయితే, ఈసారి రాజధాని అంశం, ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు యార్లగడ్డపై సానుభూతి కూడా తోడవనుంది. ఈ క్రమంలో వంశీకి ఈసారి గన్నవరంలో ఎదురీత తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదీ గాక గతంలో  మొత్తం తెలుగుదేశం గంపగుత్తగా వంశీ వెనుక నిలబడింది. ఇప్పుడు వైసీపీ శ్రేణులు గన్నవరంలో వంశీకి మద్దతు ఇచ్చే పరిస్థితులు అంతంత మాత్రమేనని కూడా అంటున్నారు. 

By
en-us Political News

  
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.