బడ్జెట్ ప్రవేశపెట్టిన యనమల.. 5 వేల కోట్లతో మరో కొత్త పథకం

Publish Date:Feb 5, 2019

Advertisement

 

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,26,177.53 కోట్లతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వకారణమని అన్నారు. అపార అనుభవం గల నాయకత్వాన్ని ప్రజలు ఆశించారని.. ఆ నమ్మకంతోనే చంద్రబాబుకు అధికారం అప్పగించారన్నారు.

ఈజ్‌ఆఫ్ డూయింగ్‌లో ఏపీ అగ్రగామిగా నిలిచిందని, ఇది చంద్రబాబు సమర్థ నాయకత్వం వల్లే సాధ్యమైందని యనమల అన్నారు. నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని తెలిపారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని, దీంతో రాజధాని నగరాన్ని కోల్పోయామన్నారు. విభజన సమయంలో ఆదాయ-వ్యయాలు, ఆస్తులు-అప్పులు సరిగా పంపిణీ చేయలేదని.. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరాశా నిస్పృహలు నెలకొన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అరకొర సాయం వల్ల సమస్యలు మరింత జఠిలమయ్యాయని యనమల పేర్కొన్నారు.

మహిళా సాధికారత సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని.. 20 ఏళ్ల క్రితమే మహిళా పొదుపు సంఘాలను ఆయన ఏర్పాటు చేశారని యనమల గుర్తు చేశారు. వెలుగు పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమమని, ఆ పథకంలో ప్రస్తుతం 94 లక్షల మంది మహిళలు ఉన్నారని చెప్పారు. ఈ బడ్జెట్ లో పలు కొత్త పథకాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఇందులో రైతుల పెట్టుబడి సాయం కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు.

బడ్జెట్‌ ముఖ్యాంశాలు:

  • వ్యవసాయానికి రూ. 12, 732 కోట్లు
  • బీసీ వెల్ఫేర్‌ రూ.8,242
  • అటవీపర్యావరణానికి రూ. 491 కోట్లు
  • ఉన్నత విద్య- 3,171 కోట్లు
  • ఇంధన మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ రూ.5,473
  • సెకండరీ ఎడ్యుకేషన్‌ రూ. 22,783
  • పౌరసరఫరాలు- రూ. 3,763 కోట్లు
  • ఆర్థికశాఖకు రూ. 51, 841 కోట్లు
  • సాధారణపరిపాలన శాఖకు- రూ.1,117
  • వైద్యారోగ్యశాఖకు రూ. 10,032
  • హోంశాఖకు రూ.6,397 కోట్లు
  • గృహనిర్మాణశాఖకు రూ.4079
  • జలవనరులశాఖకు- రూ. 16,852 కోట్లు
  • పరిశ్రమలశాఖకు 4,114 కోట్లు
  • ఐటీకి 1006 కోట్లు
  • కార్మిక ఉపాధి కల్పనకు 1225 కోట్లు
  • న్యాయశాఖకు 918 కోట్లు
  • అసెంబ్లీకి 149 కోట్లు
  • మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు 7979 కోట్లు
  • మైనార్టీ వెల్ఫేర్‌కు రూ. 1308 కోట్లు
  • ప్లానింగ్‌కు 1403 కోట్లు
  • పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ రూ. 35,182 కోట్లు
  • రెవెన్యూశాఖకు రూ. 5546 కోట్లు
  • రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ 172 కోట్లు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ 458 కోట్లు
  • సోషల్‌ వెల్ఫేర్‌కు రూ. 6861 కోట్లు
  • రోడ్లు భవనాలశాఖకు రూ. 5382 కోట్లు
  • మహిళాశిశు సంక్షేమశాఖకు రూ. 3408 కోట్లు
  • యువజన క్రీడలు రూ. 1982 కోట్లు
  • చిన్నమధ్యతరహా పరిశ్రమలకు రూ. 400 కోట్లు
  • డ్రైవర్‌ సాధికార సంస్థకు రూ. 150 కోట్లు
  • క్షత్రియ కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లు
  • ధరల స్థిరీకరణ నిధికి రూ. 1000 కోట్లు
  • యాంత్రీకరణకు రూ. 300 కోట్లు
  • మత్స్యశాఖ అభివృద్ధికి రూ. 100 కోట్లు
  • ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 14,367 కోట్లు
  • ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 5,385 కోట్లు
  • బీసీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 16,226 కోట్లు
  • మైనార్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 1,304 కోట్లు
  • పసుపు- కుంకుమ కింద రూ. 4 వేల కోట్లు
  • బీసీల కార్పొరేషన్‌కు రూ. 3 వేల కోట్లు
  • ముఖ్యమంత్రి యువనేస్తానికి రూ. 1200 కోట్లు
  • డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ. 1100 కోట్లు
  • చంద్రన్న బీమాకు రూ. 354 కోట్లు
  • అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు
  • చేనేతలకు రూ. 225 కోట్లు
  • 9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ. 156 కోట్లు
  • చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ. 175 కోట్లు
  • చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ. 128 కోట్లు
  • మైనార్టీలకు దుల్హన్‌ పథకం కింద రూ.100 కోట్లు
  • ఎన్టీఆర్‌ విదేశీ విద్యకు రూ. 100 కోట్లు
  • పెన్షన్‌ కింద వృద్ధాప్య, వింతంతువులకు రూ. 10,401 కోట్లు

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.