Publish Date:Jul 19, 2022
గోదావరి మహోగ్ర రూపం యానాం వాసులను అతలాకుతలం చేసేసింది. యానాంకు వరద పోటు ఏటా ఉండేదే. అయినా గోదారి తల్లికి మామీద అనుగ్రహమే కానీ ఆగ్రహం లేదు అన్నది అక్కడి వారి నమ్మకం, విశ్వాసం. అలాగే ఈ వరద కూడా అనుకున్నారు. కానీ కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరద యానాం వాసుల నమ్మకాన్ని వమ్ము చేసేసింది. ఏటా ఉండేదా కదా అని ఇళ్లల్లోనే ఉండిపోయిన వారు వరద ఉగ్రరూపాన్ని చూసి వణికి పోతున్నారు. గుడారాల్లోనూ, తమ నివాసాల డాబాలపైకి చేరి ప్రాణాలనైతే కాపాడుకున్నారు కానీ, తిండీ, నీరు లేక అల్లాడిపోతున్నారు. భారీ వరదల కారణంగా గోదావరికి చేరువలో ఉన్న ఎనిమిది గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. పలు కాలనీల్లో నడుములోతు నీరు చేరింది. గోదావరి పాయ అయిన గౌతమీ నది ఉద్ధృతితో యానాంలో కాలనీలు నీట మునిగాయి. పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.అడుగు బయట పెట్టలేని పరిస్థితి.. అక్కడ పరిస్థితి రాత్రికి రాత్రే మారిపోయింది. ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రజలపై వరద ఒక్కసారిగా విరుచుకుపడింది. అర్ధరాత్రి నీరు రావడంతో ఉలిక్కి పడిన ప్రజలు సూర్యోదయం వరకు బిక్కుబిక్కుమంటు గోడలు, డాబాలపై కంటిమీద కునుకు లేకుండా కూర్చున్నారు.ఆకలితో ఆపన్న హస్తం ఎదురు చూసిన వారికి మాజీ ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావుతో పాటు పలు స్వచ్చంద సంస్థలు సహాయం చేస్తునా, ఆ సాయం పరిమితమే. అది కొందరికే అందుతోంది.
మరోవైపు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కనీసం తమని పరామర్శించడానికి రాలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తము కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గోదావరి నదిలో నీరు తగ్గడంతో పలు గ్రామాల్లో వరద 2 అడుగులు మేర తగ్గింది. అయినప్పటికీ ఇంకా అనేక ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి.
రాజోలు, మామిడికుదురు, సఖినేటిపల్లి, పి.గన్నవరం, అయినవిల్లి మండలాల్లోని పలు గ్రామాల్లోని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏకంగా మామిడి కుదురు మండలంలోని లంక గ్రామ వరద బాధితులు భోజనాల కోసం ఘర్షణ పడే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ఆకలితో అలమటిస్తున్న బాధితుల ఆపన్నహస్తం అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వినవస్తున్నాయి.పెదపట్నం లంక గ్రామంలో వరద బాధితులకు గత ఆరు రోజులుగా కనీసం మంచినీళ్లు అందలేదని చెబుతున్నారు.
గత వారం రోజులగా వరద ముంపులోనే పీక లోతు నీటిలో ఆకలితో అలమటిస్తున్నామని,మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేరని లంక గ్రామాల్లోని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల స్పందన సరిగా లేదంటూ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం తమను గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/yanam-in-flood-water-people-suffering-with-hunger-25-140059.html
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.