తప్పుడు అధికారుల తుప్పు వదలగొడతా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేననీ.. ఇప్పుడు తప్పులు చేసిన అధికారులెవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. సీబీ సీఐడీ వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయని విమర్శించారు. కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్ వరకూ వెళ్లిపోయిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోందని దుయ్యబట్టారు. సుప్రీం నిబంధనల తోసి రాజని మరీ సీబీసీఐడీ వ్యవహరిస్తోందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని సీబీసీఐడీ చేస్తున్న అరెస్టులను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజును సీబీసీఐడీ అధికారులు డీల్ చేసిన విధానంపై జగన్ సర్కార్ ఎన్నో విమర్శలను ఎదుర్కొందని గుర్తు చేసిన చంద్రబాబు.. సామాజిక మాధ్యమంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడతారా అని నిలదీశారు.
కొద్ది మంది కళంకిత అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సామాజి క మాధ్యమంలో చురుకుగా ఉండే వెంకటేశ్, సాంబశివరావు వంటి వారి విషయంలో సీబీసీఐడీ వ్యవహరించిన తీరు అమానుషంగా ఉందన్నారు.
రాబోయే ప్రభుత్వం తెలుగుదేశందే అన్న చంద్రబాబునాయుడు కళంకిత అధికారులను వదిలే ప్రశక్తే లేదని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మాదేనన్న చంద్రబాబు. కార్యకర్తలనే కాదు.. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/wount-leave-tainted-officers-after-we-come-to-power-25-138927.html
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.