ప్రతి ఆరుగురిలో ఒకరికి వంధత్వ సమస్య.. డబ్ల్యుహెచ్ఓ

Publish Date:Apr 6, 2023

Advertisement

ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ ఓ) వెల్లడించింది. మొత్తం జనాభాలో 17.15 శాతం మందిలో ఈ సమస్య ఉందని, దీనిని అధిగమించడానికి   సంతాన సాఫల్య చికిత్సలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని ప్రపంచ దేశాలకు సూచించింది. వంధ్యత్వ సమస్యలో ప్రాంతాల బేధం పెద్దగా లేదని డబ్ల్యుహెచ్ ఓ పేర్కొంది.  సంపన్న,అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలన్నిటికీ  ఇదో పెద్ద సవాలుగా మారిందని సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది.  సంపన్న దేశాల్లో 17.8 శాతం, అభివృద్ధి చెందుతున్న, పేదదేశాల్లో 16.5 శాతం మందిలో వంధ్యత్వ సమస్య ఉందని సదరు నివేదిక వివరించింది.

సంతానలేమి సమస్య అనేది ప్రతి ప్రాంతంలోనూ ఒకేలా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  చెబుతోంది. ఇంత మంది ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధిగమించడానికి సంతాన సాఫల్య సౌకర్యాలను విస్తరించాలని, అవి అందుబాటు ధరల్లో ఉండాలని, తక్కువ వ్యయం, భద్రతతో కూడిన విధానాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది.

వరుసగా 12 నెలలు, అంతకంటే ఎక్కువ కాలం శృంగారంలో పాల్గొన్న దంపతులకు పిల్లలు కలగకపోతే దానిని వంధ్యత్వ సమస్యగా గుర్తిస్తారు. వంధ్యత్వ నివారణ, నిర్ధారణ, ఐవీఎఫ్ తదితర చికిత్సా విధానాలకు అతి తక్కువ నిధుల కేటాయింపు, పరిమితంగా చికిత్స అందుబాటులో ఉండటం ఇబ్బందిగా మారిందని  పేర్కొంది.

ఐవీఎఫ్ కోసం భారీగా ఖర్చు చేస్తున్న కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారని తెలిపింది. అత్యుత్తమ పాలసీలు, ప్రభుత్వ నిధుల కేటాయింపు ద్వారా ఈ సమస్య కారణంగా  ప్రజలు పేదరికంలోకి జారకుండా కాపాడవచ్చని సూచించారు.  ప్రపంచ జనాభా  విపరీతంగా  పెరుగిపోతందన్న ఆందోళన ఓ వైపు..  సంతాన లేమి పై ఆందోళన మరో వైపు ఒకే సమయంలో ఈ పరస్పర విరుద్ధ సమస్యలు మానవాళిని  ఆందోళనలోకి నెట్టడం గమనార్హం.

By
en-us Political News

  
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.