చాపకింద నీరులా పిల్లల్ని కబళించే జబ్బు.. ప్రతి తల్లిదండ్రి తెలుసుకోవాలి!

Publish Date:May 8, 2023

Advertisement

మానవ ఆరోగ్య ప్రపంచంలో చాలా జబ్బులు ఉన్నాయి. పిల్లల నుండి పెద్దల వరకు ఎన్నో జబ్బులొస్తాయి. ముఖ్యంగా తల్లుల ఆరోగ్యం తగినంత సమర్థవంతంగా లేకపోతే పుట్టే పిల్లలు కూడా అనారోగ్యంతో పుడతారు. ఎవరికీ ఎక్కువగా తెలియని జబ్బు తలసేమియా.. ఇది ఒక జన్యుపరమైన రుగ్మత, దీని కారణంగా రోగి ఎర్ర రక్త కణాలు అంటే RBCలు తగినంత హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయవు. ఇది రక్తహీనతకు దారితీస్తుంది.

1938లో భారతదేశంలో మొదటి తలసేమియా కేసు నమోదైంది. 1994లో తొలిసారిగా అంతర్జాతీయ తలసేమియా సమాఖ్య మే 8న ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని జరుపుకుంది. అప్పటి నుండి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి యేడూ మే 8 వ తేదీన తలసేమియా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి బాధితులు నిరంతరం పెరుగుతూనే ఉండటం అందరినీ కలవరపెడుతున్న విషయం. బాధితుల సంఖ్య కొన్ని కోట్లలో ఉంది. ఈ వ్యాధి వచ్చినవారు  బ్రతకాలంటే ప్రతి రెండు నుండి మూడు వారాలకు రక్తమార్పిడి అవసరం. వ్యాధి మూడు దశలుగా ఉంటుంది...

మొదటి దశ..

మొదటి దశను మైనర్ తలసేమియా అంటారు. ఇందులో ఒక జన్యువు తల్లి నుండి మరొకటి తండ్రి నుండి వస్తుంది. ఒక జన్యువులో తలసేమియా లక్షణాలు ఉన్న వ్యక్తులను క్యారియర్లు అంటారు. ఇందులో వ్యక్తికి తేలికపాటి రక్తహీనత మాత్రమే ఉంటుంది.

రెండవ దశ..

రెండవ దశను ఇంటర్ మీడియా అంటారు. ఇందులో తేలికపాటి నుండి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి.

మూడవ దశ

మూడవ దశను మేజర్ తలసేమియా అంటారు. ఇది తలసేమియా అత్యంత తీవ్రమైన రూపం. ఇది ఒక పిల్లవాడు ప్రతి పేరెంట్ నుండి రెండు జన్యువులను పొందడం ద్వారా వచ్చే సమస్య. తలసేమియా మేజర్ ఉన్న పిల్లవాడు జీవితంలో మొదటి సంవత్సరంలో తీవ్రమైన రక్తహీనత లక్షణాలను ఎదుర్కొంటాడు. ఈ సమస్య ఉన్నవారు జీవించడానికి ఎముక మజ్జ మార్పిడి లేదా సాధారణ రక్త మార్పిడి అవసరం.

తలసేమియా వ్యాధిలో కనిపించే లక్షణాలు..

రక్తహీనత - బలహీనమైన ఎముకలు, ఆలస్యంగా లేదా నెమ్మదిగా శారీరక అభివృద్ధి, శరీరంలో ఐరన్ ఓవర్లోడ్, ఆకలి లేకపోవడం - చర్మం సున్నితంగా మారిపోవడం, విస్తరించిన ప్లీహము లేదా కాలేయం

తలసేమియాకు పరిష్కారాలు..

తరచుగా రక్తమార్పిడి అవసరం. ఈ రోగులలో కొన్నిసార్లు హెపటైటిస్ లేదా హెచ్ఐవి కూడా కనిపిస్తుంది. రక్త మార్పిడి వల్ల కూడా ఇది జరగవచ్చు. తలసేమియా మేజర్‌తో బాధపడుతున్న పిల్లవాడు 30 కిలోల బరువు ఉంటే, ఆ పిల్లవాడికి రక్తం ఎక్కించడం, ఐరన్ కోసం ఏటా రెండు లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. అంటే ఆ పిల్లాడు 50 ఏళ్లు బతికితే కోటి రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. 

పౌష్టికాహారం, వ్యాయామం ద్వారా కొంత వరకు నియంత్రించవచ్చు. అలాగే, నవజాత శిశువుకు , గర్భిణీ తల్లికి క్రమం తప్పకుండా టీకాలు వేయడం కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

ఈ వ్యాధికి ఏకైక నివారణ.. 

చెలేషన్ థెరపీ, ఎముక మజ్జ మార్పిడి ఒక ఎంపిక. ఎముక మజ్జ మార్పిడి ఖరీదైనది. దీని కోసం దాత HLA పొందడం అవసరం. అందుకే చాలా మంది రోగులు రక్తమార్పిడితో బతుకుతున్నారు

ఐరన్ నియంత్రణ చాలా ముఖ్యం. ఐరన్ పెరుగుదల కాలేయం, గుండె పై దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అయితే, ఐరన్  మొత్తాన్ని నియంత్రించడానికి వైద్యులు  కొన్ని మందులు ఇస్తారు. 

శరీరంలో రక్తం పాత్ర, హిమోగ్లోబిన్ పాత్ర చాలా కీలకమైనది కాబట్టి ఈ జబ్బు మొత్తం శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ముందు జాగ్రత్తలు, అవగాహన చాలా అవసరం.

                                    ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.