పుతిన్ దయాదాక్షిణ్యాలపై మానవాళి మనుగడ!

Publish Date:Nov 21, 2024

Advertisement

రష్యా నిర్ణయంపైనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందా? అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఔననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే ఫైల్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసిన క్షణం నుంచీ భూమిపై మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే ప్రపంచాన్ని నాశనం చేసే అత్యంత భయంకరమైన అణ్వాయుధం రష్యా వద్ద ఉంది. కేవలం ఒక్క మీట నొక్కితే చాలు ప్రపంచాన్ని అంతం చేసేంత శక్తిమంతమైన అణ్వాయుధాన్ని చేతిలో ఉంచుకున్న రష్యా ఇప్పుడు దానిని ఉపయోగించడానికి రెడీ అయిపోయింది. ఉక్రెయిన్ తో యుద్ధంలో గెలుపు, ఓటమి లేకుండా తీవ్రంగా నష్టపోతున్న రష్యా అసలే ఉక్రోషంలో ఉంది. సరిగ్గా అటువంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ రాజకీయ తంత్రమో, కుతంత్రమో తెలియదు కానీ అనాలోచితంగా తాము సరఫరా చేసిన క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపైకి ప్రయోగించడానికి అనుమతి ఇచ్చేశారు. ఇలా అనుమతి వచ్చిందో లేదో అలా ఉక్రెయిన్ అమెరికా క్షిపణిని రష్యాకు గురిపెట్టింది. బైడెన్ నిర్ణయంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పుతిన్.. గతంలో హెచ్చించిన విధంగా అణ్వాయుధాల వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అసలు సోవియెట్ యూనియన్ కాలం నుంచీ కూడా రష్యాది దుందుడుకు వ్యవహారమే. ఏక థృవ ప్రపంచాన్ని రష్యా సవాల్ చేస్తూనే వస్తోంది. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత కూడా రష్యా వ్యూహాత్మకంగా అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసురుతూనే ఉంది. ఇందుకు చైనా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాల మద్దతును కూడగట్టుకుంది. 

1990 పూర్వం సోవియట్,అమెరికాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడిచేది. అప్పుడు ప్రపంచంలోని దేశాలు రెండు వర్గాలుగా విడిపోయాయి.కొన్ని తటస్థ దేశాలు అలీన విధానం అవలంబించి నా ఆ ఆ అలీన విధానం ప్రాధాన్యత ప్రాభవం కల్పోయింది. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నంతో అమెరికా అటోమేటిక్ గా అగ్రరాజ్యంగా, ప్రపంచ దేశాలకు పెద్దన్నగా తనకు తాను ప్రకటించేసుకుని ఎదురులేని శక్తిగా మారింది. అయితే రష్యా అధ్యక్ష పగ్గాలు పుతిన్ చేతికి వచ్చిన తరువాత పరిస్థితి క్రమంగా మారుతూ వచ్చింది. అమెరికా,నాటో దేశాలతో ఢీకొనడానికి అవసరమైన శక్తియుక్తులను సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ను రష్యాపై ప్రయోగించడంతో  నిశ్శబ్దం ఒక్కరానిగా బద్దలైపోయింది. ఇప్పుడు ఉక్రెయిన్ కంటే అమెరికాయే టార్గెట్  అని  రష్యా అధ్యక్షుడి ప్రకటనలు రూఢీ చేస్తున్నాయి. దీంతో అమెరికా ఎప్పుడు, ఏ రూపంలో దాడులకు జరుగుతాయోనన్న భయంతో వణికిపోతున్నది. ప్రచ్ఛన్న యుద్ధం తరువాత  రష్యా విషయంలో అమెరికా ఈ స్థాయిలో భయపడటం ిదే తొలిసారని చెప్పవచ్చు. రష్యా వద్ద 5500 నూక్లియర్  వార్ హెడ్స్ ఉంటే, అమెరికా వద్ద 5,044 మాత్రమే ఉన్నాయి.   .ఉక్రెయిన్ రష్యాపై మరిన్ని దాడులకు పాల్పడితే రష్యా నిస్సందేహంగా అమెరికాపై అణుదాడులకు పాల్పడుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా నాటో దేశాలపై కూడా దాడులకు తెగబడే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.  ఇదే జరిగితే  ప్రపంచానికి ముప్పు తప్పదు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు అమెరికాలో అధికారమార్పిడి జరిగి మరో రెండు నెలల వ్యవధిలో బైడన్ స్థానంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు అంత వరకూ పుతిన్ సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.  

ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించగలరన్న నమ్మకాన్ని ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు ట్రంప్ ఎన్నికల సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానంటూ చేసిన వాగ్దానం ప్రధాన కారణం. పుతిన్, ట్రంప్ ల మధ్య అనుబంధం తెలియనిది కాదు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపనుండడమే  ఉక్రెయిన్ అధ్యక్షుడి దూకుడుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ జోక్యంతో యుద్ధం ఆగినా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలనెస్కీ మాత్రం సేఫ్ కాదని అంటున్నారు. అందుకే   ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు అందుకోవడానికి ముందే  పుతిన్ తో లెక్కలు తేల్చేసుకోవాలని  జెలనెస్కీతొందరపడుతున్నారు. ఇదే పుతిన్ ను అణ్యాస్త్రాల ప్రయోగం దిశగా రెచ్చగొడుతున్నది. ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుంటే పుతిన్ దయాదాక్షిణ్యాల మీదే ప్రపంచ దేశాల, మానవాళి మనుగడ ఆధారపడి ఉందని చెప్పడానకి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. 

By
en-us Political News

  
ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని, అలాగే ఏపీబీసీఎల్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కుంభకోణం తాలూకు మూలాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, అంతిమంగా దీని ప్రభావం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడబోతోందా అనే విషయంపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విశ్లేషించారు.
ఈ మొత్తం స్థలం విలువ బహిరంగ మార్కెట్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో సింహభాగం అంతా ప్రభుత్వానికి చెందిన భూమి కావడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.
సహజంగా దేశ చరిత్రలో జవహర్‌లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు, ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రులుగా సేవలందించారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన రికార్డు ఎలా ? అన్న విషయాన్నితెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ ఎనలిస్టు వివరించారు.
గత సార్వత్రిక ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమై కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముగిసిన తర్వాత నాని వైసీపీకి దూరంగా జరుగుతూ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తమ్ముడు కేశినేని చిన్నితో వైరం మాత్రం పెరుగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో భాగంగా ఒక ధర్నాలో పాల్గొన్న అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నిరసనల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.