మధుమేహం- ముందుచూపే అసలు మందు!

Publish Date:Apr 7, 2016

Advertisement

 

ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పేరుతో ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహనను పెంచేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా ఈసారి మధుమేహం మీద తన యుద్ధాన్ని ప్రకటించింది ఆరోగ్య సంస్థ. ఒకప్పుడు మధుమేహాన్ని ఎవరో డబ్బున్నవారికి వచ్చే జబ్బనీ, ఎక్కడో ఒకరికి మాత్రమే కర్మ కొద్దీ ఏర్పడే అసౌకర్యం అనుకునేవారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. ఒక అధ్యయనం ప్రకారం 1980లో 1.19 కోట్ల మంది భారతీయులు ఈ వ్యాధిబారిన పడితే, ప్రస్తుతం ఈ సంఖ్య ఆరుకోట్లని దాటిపోయిందని అంచనా! మధుమేహం కనుక ఇదే ఊపుతో విస్తరిస్తూ వెళ్తే, భారతదేశం ప్రపంచానికే మధుమేహ రాజధానిగా మారిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

మధుమేహం రావడానికి జన్యుపరమైన లోపాలే ముఖ్యకారణం అన్న విషయంలో సందేహం లేదు. అయితే అసంబద్ధమైన జీవనశైలి వల్లే ఈ లోపం బయపడుతోందన్నది నిపుణుల మాట. ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ, తక్కువ పని చేయడంతో శరీరం త్వరగా మధుమేహానికి లోనవుతోందని తేలింది. బేక్ చేసిన ఆహారపదార్థాలు, శీతలపానీయాలు, మద్యం, వేపుళ్లు, పాలిష్‌డ్ బియ్యం.... ఇవన్నీ మన జీవితంలో భాగమైపోయాయి. తొలుత ఇవి ఊబకాయానికీ, తరువాత మధుమేహానికీ దారితీస్తున్నాయి. అదే స్థానంలో ఆకు కూరలు, పండ్లు, సంప్రదాయ వంటకాలు... మనకు దూరమైపోతున్నాయి. వీటికి తోడు ఏమాత్రం వ్యాయామం లేని జీవనశైలి కూడా కొంప ముంచుతోంది. సీట్లకు అతుక్కుపోయే ఉద్యోగాలు, ఒక్క నాలుగు అడుగులు కూడా వేయడానికి బద్ధకించే మనస్తత్వాలు మనల్ని మరీ సుకుమారంగా మార్చేసి... రోగగ్రస్తులుగా మార్చేస్తున్నాయి. పాఠశాలల్లో ఆటస్థలాలు ఉండవు. ఉద్యోగాలలో ప్రశాంతత కరువు. దీంతో అటు ఆహారమే కాదు మానసిక ఒత్తిడి, శారీరిక స్తబ్దత కూడా మధుమేహానికి కారణాలుగా మారుతున్నాయి.

 

మధుమేహం రావడం దురదృష్టమే! అయితే, వచ్చిన తరువాత రోగుల ప్రవర్తన కూడా అంతే నిరాశను కలిగిస్తోంది. మధుమేహాన్ని అదుపుచేసుకునేందుకు మందులు ఎంత అవసరమో, జీవనశైలిలో మార్పులు కూడా అంతే అవసరం అన్న నిజాన్ని చాలామంది గ్రహించరు. మధుమేహం వచ్చే లక్షణాలు కనిపించిన వెంటనే జీవనశైలిలో పెనుస్థాయి మార్పులను కనుక తీసుకురాగలిగితే, చాలా రోజులపాటు దాని దుష్ఫలితాల నుంచి తప్పించుకోవచ్చు. వెల్లుల్లి, మెంతులు, వేప, కాకరకాయ వంటి పదార్థాలను తీసుకోవడం; ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతులతో ఒత్తిడిని తగ్గించుకోవడం; రోజులో ఎంతో కొంత నడకను అలవాటు చేసుకోవడం; పాలిష్‌డ్, ప్రాసెస్‌డ్ తదితర ఆహారపదార్థాలకు దూరంగా ఉంటూ, మనం తీసుకుంటున్న కేలరీలను గమనించుకోవడం; ఎప్పటికప్పుడు షుగర్, బీపీలను పరీక్షి చేయించుకోవడం.... లాంటి చర్యలతో శుభ్రంగా మధుమేహంతో కలిసిమెలిసి జీవించవచ్చు.

 

అదుపులో ఉంటే మధుమేహం వల్ల ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవు. అందుకే చాలామంది వైద్యులు దీనిని ఒక రోగంగా కాకుండా ఒక లోపంగా భావిస్తారు. ఆ లోపాన్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండమని చెబుతారు. కానీ రోగులే అలసత్వాన్ని చూపుతూ ఉంటారు. ఒకసారి మధుమేహం వచ్చిందని తేలాక వైద్యులు ఏ మందులనైతే అందించారో, అవే మందులను తమంతట తాము దశాబ్దాల తరబడి వాడేవారు ఉన్నారు. అసలు మందులనే వాడకుండా ఆయాస, నీరసాలతో నెట్టుకొచ్చేసేవారూ ఉన్నారు. ఇక మందులు ఎలాగూ వాడుతున్నాం కదా అని, ఆహారం నియమాలు పాటించని వారి సంగతి సరేసరి! మన దేశంలో రోగులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు కాబట్టే ఔషధి సంస్థలు కూడా అంతే బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాయి. ఇష్టం వచ్చిన పాళ్లలో రకరకాల మందులను ఒక చోటకి చేర్చి ఒక పేరుని పెట్టి కౌంటర్‌ మీదే అమ్మేస్తున్నాయి. అందుకే ఈ మధ్య ప్రభుత్వం నిషేధించిన మందులలో మధుమేహానికి సంబంధించినవి చాలా ఎక్కువమొత్తంలో ఉన్నాయి.

 

ఇక మధుమేహానికి సంబంధించిన మందులను సుదీర్ఘకాలం వాడితే ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయన్న విషయం మీదా తగిన పరిశోధనలు జరగడం లేదు. ఉదాహరణకు పయోగ్లిటజోన్‌ అనే మందుని సుదీర్ఘకాలం వాడితే మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయినా అటు వైద్యులు కానీ ఇటు ఔషధి కంపెనీలు కానీ ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. మన ఆరోగ్యాన్నంతా ఇప్పుడు కార్పొరేట్‌ సంస్థలే నియంత్రిస్తున్నాయి కదా! మధుమేహం విషయంలో వచ్చిన మరో పెనుమార్పు వైద్య ఖర్చు. ఒకప్పుడు మధుమేహానికి కావల్సిన మందులను ఫ్యామిలీ డాక్టర్లే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మధుమేహానికి ప్రత్యేకమైన రంగం ఏర్పడింది. కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లి వీరిని కలవాటంటే 500 రూపాయలు కన్సల్టేషన్‌ ఫీజుకీ, 500 రూపాయలు షుగర్‌ నిర్థరణకీ సమర్పించుకోవాలి. ఇక మందులు ఇతరత్రా ఖర్చుల సంగతి చెప్పనే అవసరం లేదు. అలా మధుమేహం కూడా ఖరీదైన జబ్బుల జాబితాలోకి చేరిపోయింది.

 

మధుమేహం అనేది ఇప్పుడేమీ తెలియని వ్యాధి కాదు. ఇది ఎందుకు వస్తుంది. వచ్చాక ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి... లాంటి ప్రాథమిక సమాచారం అంతా ఇప్పుడు అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పటి తరానికి చిన్నప్పటి నుంచే సరైన జీవనశైలిని అలవాటు చేయాలి. సుదీర్ఘకాలం టీవీల ముందు కూర్చోవడం, వీడియోగేమ్స్‌తో సమయాన్ని గడపడం మాన్పించాలి. వారి తిండి విషయంలోనూ తగినంత జాగ్రత్త వహించాలి. బ్రెడ్డూ, బిస్కెట్, జామ్‌లే వారి అల్పాహారంగా మారకూడదు. పిజ్జాలతో వారి సరదా తీరకూడదు. ఇక అన్నింటికీ మించి వాళ్లు ఆటలాడుకునేందుకు తగినన్ని అవకాశాలు కల్పించాలి. మనమూ కొంత సమయాన్ని వారితో గడిపేందుకు ప్రయత్నించాలి. ఈ కాస్త జాగ్రత్తా తీసుకుంటే వారి కెరీర్‌ సంగతి తరువాత విషయం, కనీసం వారి ఆరోగ్యానన్నా కాపాడినవారమవుతాం. ఆరోగ్యం బాగుండి మనసు దృఢంగా ఉంటే... కెరీర్‌ దానంతట అదే దారికొస్తుంది. కాబట్టి ఇప్పుడు మన ముందు ఉన్న సవాళ్లు రెండు. ఒకటి మనం మధుమేహం నుంచి బయటపడటం. రెండు- మన పిల్లల జోలికి అది రాకుండా చూసుకోవడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుకుంటోంది ఇదే!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.