ఎయిడ్స్ అంటే ఏంటి?

Publish Date:Dec 1, 2022

Advertisement

ప్రపంచం ఎన్నో విషయాలలో ఎంతో ముందుకు దూసుకుపోతున్న కొన్ని విషయాలలో వెనుకబడే ఉంది అని చెప్పడానికి ఇది ఒక సాక్షం..

ప్రస్తుతం మనం ఉన్న 21 వ శతాబ్దంలో వైద్య రంగం అభివృద్దిసాధించింది. పరిశోధనలుకొనసాగుతున్నాయి. అయినా ఎయిడ్స్ వ్యాధి కి మెరుగైన వైద్యం అందకపోవడం విచారకరం.హెచ్ ఐ వి వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గు ముఖం పట్టిందని అనుకోడం మన సంతృప్తి కోసమే వాస్తవానికి కొన్ని కాటోర వాస్తవాల పై స్పెషల్ ఫోకస్.ఎయిడ్స్ అనగా అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోం. ఈ ఎయిడ్స్ వ్యాదిని హెచ్.ఐ.వి. కలుగజేస్తుంది.ఇది ఒక రకమైన వైరస్.. దీనిని హ్యూమన్ ఇమ్యునో  డెఫిషియన్సీ వైరస్ అంటారు. ఈ వ్యాధిని ముందుగా 4 H Diseases గా పిలిచేవారు.  జూలై 1982లో ఎయిడ్స్ అనే నామ కారణం  చేసారు . ఇది మన శరీరంలో వ్యాధుల నుండి పోరాడే తెల్ల  CD 4 రక్త కణాలను ఈ వైరస్ నాశనం చేస్తుంది. ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధి ఎక్కువగా ఉన్న దేశం దక్షిణాఫ్రికా... ప్రపంచంలో తొలి ఎయిడ్స్ కేసును అమెరికా 1981 లో  నమోదు అయింది.భారతదేశంలో తొలి ఎయిడ్స్ కేసు 1986 మే నెలలో చెన్నై లో నమోదయ్యింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం ను 1999 లో ప్రారంభించారు. NACO అనగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 2010 వరకు ప్రపంచంలో మొత్తం HIV AIDS రోగుల సంఖ్య 3,40,00000 కాగ 2010 సంవత్సరంలో కొత్తగా నమోదయిన రొగుల సంఖ్య 27,000,000. ఎయిడ్స్ బాధితులలో అత్యధికులు ఆఫ్రికా ఖండంవారే. వారి తరువాత 3 వ  స్థానంలో భారతదేశం ఉందితెల్చిచెప్పింది ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య  తెలుగు రాష్ట్రా లలో చాలా తొందరగా పెరుగుతుందని కేంద్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) చెబుతుంది. 2009 లెక్కల ప్రకారం మన దేశంలొ మొత్తం HIV/AIDS రోగుల సంఖ్య 23,95,442 అలాగే 2009 వరకు మన రాష్ట్రంలో HIV/AIDS రోగుల సంఖ్య 4,99,620 గా ఉంది. ఒక్క 2011-2012 లోనే నమోదైన HIV/AIDS కేసులు 2,66,919 గా నమోదు కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. మన ఆంధ్రప్రదేశ్‌‌లో అయితే 60,952. మన దేశంలొ మొత్తం NACO నుండి ఉచితంగా ART మందులు అందుకుంటున్న HIV/AIDS రోగుల సంఖ్య March 2012 వరకు 5,16,412. ఆంధ్రప్రదేశ్ నుండి 1,13,106 గా వుంది. దేశంలో 20% మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు.ఈ సంఖ్యలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇందుకు భిన్నంగా , NACO లో నమోదు చేసుకొకుండా ప్రైవేటుగా చికిత్స అందే వారి వివరాలు నమోదు కావడం లేదని తెలుస్తోంది.

హెచ్ఐవి మరియూ ఎయిడ్స్:మధ్య వ్యత్యాసం ఉందా? తాకినా,కలిసి తిరిగినా, కలిసి భోజనం చేసినా బట్టలు వేసుకున్నా,ఎయిడ్స్ వస్తుందా?పచ్చ బొట్టు వేసుకున్నాఒకరు వాడిన బ్లేడ్ లు,సూదుల వాళ్ళ వస్తుందా  అన్న సందేహాలు అపోహలు ఉన్నాయి అసలు వాస్తవం ఏమిటి?అన్నవిషయం తెలుసుకుందాం.హెచ్ఐవి వైరసు ఉన్న అందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. శరీరం లోపల హెచ్ఐవి వైరస్ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. వారికి ఎప్పుడయితే ఆరోగ్యం నశిస్తుందో అప్పుడు ఎయిడ్స్ వచ్చినట్లు పరిగణించడం జరుగుతుంది. ఒక వ్యక్తి శరీరంలో హెచ్ఐవి వైరసు ఉన్నట్లయితే అతనిని హెచ్ఐవి పాజిటివ్ అని సంభోదిస్తారు.హెచ్ఐవి ఉన్న వారికి ఎయిడ్స్ వచ్చినట్లు ఎప్పుడు నిర్ధారిస్తారంటే:

•రక్త పరీక్ష చేసినప్పుడు రోగనిరోదకత బాగా క్షీణించిందని తేలినప్పుడు.CD4 కణాల సంఖ్య 5౦౦ కంటే తక్కువ ఉన్నప్పుడు

•ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు మనుషులలో సహజంగా రోగనిరోధక శక్తి ఎన్నో రోగాలను అడ్డుకుంటుందిటాయి. ఆ నిరోధక శక్తి నశించినప్పుడు రుగ్మతలు శరీరంలోకి చేరుకుంటాయి.ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు సాధారణంగా, ఆరోగ్యవంతులెవరికీ రావు. అందుకనే వీటికి ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు అని పిలుస్తారు.

ఎయిడ్స్ కలిగించే కొన్ని రుగ్మతలు:

•హర్ప్‌‌స్ జొస్టర్ ( శింగెల్స్ గజకర్ణము )Herpes Zoster Virus (shingles)

•కపోసీస్ సర్కోమా (Kaposi's Sarcoma) - సాధారణంగా చర్మానికి వచ్చే క్యాన్సరు.

•సిఎంవి రెటీనైటిస్ (CMV Retinitis) - కంటి వెనుక భాగంలో సోకే ఒక వైరసు.

•న్యుమోనియా (PCP) - ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో చాలా మందికి సోకే రోగము, ఇది ఊపిరితిత్తులకు సోకుతుంది

•టాక్సోప్లాస్మోసిస్ (Taxoplasmosis) - ఈ రోగము మెదడుకు సోకుతుంది.

•క్షయ (Tuberculosis)

•ఇన్వేసీవ్ సర్వికల్ క్యాన్సర్ (Invasive Cervical Cancer) - ఇది ఆడవారి గర్భకోశం కింద వ్యాపించే క్యాన్సరు.

హె.ఐ.వి  ఉందని చాల మందికి అసలు తెలియదు. హెచ్ ఐ వి ఉందని తెలిసినా దాన్ని నిర్లక్ష్యం చేయడం, సరైన వైద్యం తీసు కోక పోవడం వాళ్ళే వ్యాధి తీవ్రత పెరిగి నీరసించి పోతు ఉంటారు. ఫలితం తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు.అసలు నిర్ధారణకు చేసే పరీక్షలు ఏ మిటో తెలుసుకుందాం.బాగా వ్యాధి ముదిరేవరకు తమలో జబ్బు ఉందని ఎవరూ అనుకోరు,ఊహించరు. కలిగిన అనారోగ్యానికి కారణం తెలుసుకోవడానికి జరిపే వైద్యపరీక్షలలో ఇటువంటి ప్రాణాంతక జబ్బులు బయటపడతాయి. హెచ్.ఐ.వి.కి చేసే పరీక్షలలో ముఖ్యమైనవి 1. ట్రైడాట్,2.వెస్ట్రన్ బ్లాట్, 3.సి.డి సెల్ కౌంట్.

ట్రైడాట్:

ఎలీసా టెస్ట్స్ లో ఇది మొదటిది. మనిషి శరీరములో ప్రవేశించిన 'హెఐవి' క్రిములకు ప్రతిస్పందన కణాలు (Antibodies)తయారవడానికి 3-6 నెలలు పడుతుంది. అప్పుడే ఈ పరీక్ష ద్వారా ఎయిడ్స్‌ను గుర్తించవచ్చు. 'హెఐవి' ఉందా? లేదా? అని మాత్రమే తెలుస్తుంది . ఈ టెస్ట్ చేయడము తేలిక, తొందరగా అయిపోతుంది. మాస్ స్క్రీనింగ్ విధానములో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా నిర్ధారణ అయిన పరీక్ష కాదు.

వెస్ట్రన్ బ్లాట్:హెచ్.ఐ.వి నిర్ధారణ కోసం ఉపయోగించే పరీక్ష ఇది. ఖర్చు ఎక్కువ. వారం రోజులు పడుతుంది. పూర్తి టెస్ట్ వివరాలకోసం వేరే చోట చూడండి.

సిడి4 కణాల సంఖ్య:మనుషుల రోగనిరోధకతకు రక్తంలో సిడి4 అనే రకం తెల్ల రక్తకణాలు ఎంతో దోహద పడతాయి. ఇవి రోగకారక జీవాలతో పోరాడి మనుషులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే హెచ్ఐవీ ఈ సిడి4 కణాలను చంపేస్తుంది. హెచ్ఐవి పెరుతున్నకొద్దీ ఈ సిడి4 కణాలు నశించటం ప్రారంభిస్తాయి. ఒక మైక్రోలీటరులో 200 కన్నా తక్కువ సిడి4 కణాలు ఉన్నట్లయితే అప్పుడు ఎయిడ్స్ ఉన్నట్లు ద్రువపరుస్తారు.

మనుషుల శరీరంలో ఎయిడ్స్ ఏం చేస్తుంది?మరణానికి చేరువగా తీసుకు పోయే ఎయిడ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి?ఆవివరాలు అందరు తెలుకోవడం ముఖ్యం. లక్షణాలు గుర్తించి తగు జాగ్రత్త తీసుకోడం ముఖ్యం అంటున్నారు వైద్యులు. ఆవివరాలు మీకోసం.హెచ్ఐవి వైరస్ మనుషులలో చేరిన వెంటనే, రోగనిరోధకతా శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా వ్యాధి గ్రస్తులు జలుబు తదితర అంటురోగాల బారిన త్వరగా పడతారు. అంతేకాక వ్యాధి నిరొదకత తగ్గినకొద్ది ఎయిడ్స్ అహ్వానిత వ్యాధులు (Opportunistic Infections ) రావటం మొదలు పెడతాయి.ఒక్కసారి గనక ART మందులు వాడటం మొదలుపెడితె ఈ వ్యాధులు రావటం అరుదు. 

హెచ్ ఐ వి లక్షణాలు:

సాధారణంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని నెలల (కనీసం 3 నుండి 6 నెలల )వరకు రక్త పరీక్ష ల ద్వారా వైరస్ జాడ కనుగోనలేము దీనినె Window Period అంటారు. ఈ క్రింది లక్షణాలు హెచ్ ఐ వి రోగులలో కనిపిస్తాయి. జ్వరం, నోటి పూత, చర్మ వ్యాధులు, నీరసం, నీళ్ళ విరేచనాలు, ఆకలి తగ్గిపోవుట, అలసట, పది శాతం బరువుని కోల్పోవడం, గ్రంథుల వాపు ( గొంతు క్రిందుగా )Swollen lymph nodes, మొదలగునవి హెచ్ ఐ వి వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.ఒక్కసారి మనిషి శరీరంలొ హెచ్ ఐ వి వైరస్ ప్రవేశించాక కొందరికి పై లక్షణాలలొ కొన్ని కనబడి కొద్దిరోజుల్లో తగ్గిపోవచ్చు. కొందరిలొ అసలు ఎలాంటి లక్షణాలు కనపడకపొవచ్చు. హెచ్ ఐ వి వైరస్ చాల నెమ్మదిగా, బద్దకంగా శరీరంలో వ్యాపిస్తుంది. హెచ్ ఐ వి నుండి ఎయిడ్స్ దశకు చెరుకోవాటానికొ దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది, కొందరిలొ అంతకంటె ఎక్కువ కూడ. కొందరిలో ఈ పది సంవత్సరాల కాలంలొ ఎలాంటి లక్షణాలు కనపడకపోవచ్చు. దీన్నే Asymptomatic Period అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు హెచ్ ఐ వి టెస్ట్ చెసుకొని నిర్ధారించుకోవాలి. సరియైన సమయంలొ ART మందులు వాడటం మొదలుపెడితె జీవితకాలాన్ని 25 నుండి 30 సంవత్సరాలవరకు పొడిగించుకొవచ్చు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త మందులు అందుబాటులొకి రావటం ద్వారా ఎయిడ్స్ రొగుల జీవితకాలం పెరుగుతు ఉంటుంది.

హెచ్ఐవి మరియు ఎయిడ్స్‌ల చికిత్స:ఉందా?ఇన్ని వైద్య పరిసోదనలు జరుగు తున్నా హెచ్ ఐ వి కి సరైన వైద్యం లేకపోడం దురదృష్టకరం. మందులు ఉన్నాయంటూ కొన్ని సంస్థలు చేస్తున్న ప్రచారం లో నిజం ఎంత. హెచ్ ఐ వి రోగులు ఇప్పటికీ మోసానికి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.HIV  ని పూర్తిగా నిర్మాలిస్తాం అన్న ప్రకటన ఎంత అబద్దమో HIV కి చికిత్స లేదు అన్నది అంతె అబద్ధం. HIV కి WHO ప్రామాణికరించిన   అత్యంత సమర్థవంతమైన చికిత్స ఉంది. ఈ ART మందులతొ మరియు మంచి జీవన శైలిసహాయంతొ, HIV లేని వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారొ HIV ఉన్న వాళ్ళు దాదాపు అన్ని రోజులు బ్రతకడం ఈ రోజుల్లో సుసాద్యంకాని ఇది అన్ని వేళలా సాద్యం కాదు రోగి మందులు  వేళకు వేసుకొవటం (Drug Adherence), రోగి జీవన శైలి ( ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లు), పౌష్టికరమైన ఆహారం (Protein Rich Food), వేళకు డాక్టరు గారు సూచించన ప్రకారం Lab Testలు, మీరు మందులు ప్రారంబించినప్పుడు ఉన్న CD4 సంఖ్య వీటన్నింటి పైన అదారపడి ఉంటుంది. ఒక్క సారి చికిత్స ప్రారంభించిన తర్వాత చికిత్సను నిలిపివేయడం అత్యంత ప్రమాదకరం ఒక్కసారి గనక చికిత్స ప్రారంభిస్తే జీవితాంతం మందులు వెసుకొవలసి ఉంటుంది. ప్రస్తుతానికయితే ఎయిడ్స్  ని పూర్తిగా నిర్మూలించటానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతని తగ్గించటానికి మందులు ఉన్నాయి, అవి కొంచెం ఖరీదయినవే. కొన్ని హెచ్ఐవి వైరసులు కొన్ని మందులను తట్టుకోగలవు, అలాగే ఒకే రకమైన మందులను కొన్ని సంవత్సరాలు వాడుతుపోతు ఉంటే హెచ్ఐవీ వైరస్.., మందులను తట్టుకునే సామర్థ్యం పెంచుకుంటాయి. అందుకనే ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుస్తు ఉంటారు. కొన్నయితే ఒకటి కంటే ఎక్కువ మందులను తట్టుకోగలుగుతున్నాయి.దీనినే వైరస్ రెజిస్టన్స్ అంటారు. అందుకని వాటి చికిత్సకు ఒకేసారి రెండు మూడు రకాల మందులను వాడుతూ ఉంటారు ఈ మందులనే హెచ్ఐవి కాక్‌టెయిల్ అని లేదా Fixed Dose Combination ( ఇందులో రెండు లేదా అంతకంటె ఎక్కువ మందులు ఒకే టాబ్లెట్ గా ఉంటాయి ) అని పిలిస్తారు. కాబట్టి శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు.

ఎయిడ్స్ ని అరికట్టడం: సాధ్యమేనా అందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నం సూన్యమేనా  స్వచ్చంద సంస్థలు చేస్తున్న సేవలు ప్రభుత్వం అందించ లేక పోతోంది. హెచ్ ఐ వి తో బాధ పడే వారి కోసం ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు ఇతర సౌకర్యాల వివరాలు ఏమిటి అన్న సమాచారం పూర్తిగా అందడం లేదని బాదితులు వాపోతున్నారు. ఇంకా హెచ్ ఐ వి సోకిన వారి పట్ల వివక్ష కోన సాగుతూనే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులలో సుర్జరి చేసేందుకు నిరాక రిస్తున్నారని బాదితులు తమ గోడును వెళ్ళ గక్కారు.అయితే  ఎయిడ్స్ ను పూర్తిగా నివారించే  చికిత్స ప్రస్తుతానికి లేదు. అందుకని దానిని నివారించడం ఎంతో ఉత్తమం. ఎయిడ్స్ రాకుండా దానిని అరికట్టటానికి చాలా మార్గములు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని రిఫరల్ ఆసుపత్రులలో స్వఛ్ఛందంగా రక్తం పరీక్షించుకోడానికి, సరియైన సలహాలు పొందడానికి VCTC కేంద్రాలను ఏర్పరచింది.

By
en-us Political News

  
మన శరీర ఉష్ణోగ్రత ప్రతి సీజన్‌లో నార్మల్ గా ఉంటుంది.  దాదాపు 37-38 డిగ్రీల సెల్సియస్  వరకు శరీర ఉష్టోగ్రత ఉంటుంది. అయితే చలికాలంలో బయటి ఉష్ణోగ్రత 5, 10, 15, లేదా 18 డిగ్రీల సెల్సియస్‌ గా నమోదు అవుతూ ఉంటుంది....
ఆహారం శరీరానికి ఎంతో అవసరం. తీసుకునే ఆహారం వల్లనే శరీరానికి శక్తి వస్తుంది. ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, ఖనిజాలు చాలా అవసరం. ఇవన్నీ ఆహారంలో ఉండటం ఎంత ముఖ్యమూ. ఆహారం తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యం. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతారు. అలా చేయకపోతే జీవక్రియకు ఆటంకం కలుగుతుంది. కేవలం జీవక్రియ ప్రభావితం కావడమే కాదు.. సమయానికి ఆహారం తీసుకోకపోతే అది చాలా తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుందట. సమయానికి ఆహారం తీసుకోకపోతే జరిగేదేంటో తెలుసుకుంటే..
చలికాలంలో చలి సహజమే.. కానీ కొందరికి సాధారణం కంటే ఎక్కువ చలి పెడుతూ ఉంటుంది. ఇంత చలి పెడుతుంటే ఇతరులు ఎలా భరిస్తున్నారో ఏంటో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మందం పాటి దుస్తులు దరించినా, స్వెట్టర్లు వేసుకున్నా కూడా కొందరికి లోపల వణుకు పుడుతూనే ఉంటుంది. అయితే ఇది చలి కారణంగా వచ్చే చలి కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉంటాయని అంటున్నారు వైద్యులు. అసలు కొందరిలో అధికంగా చలి ఎందుకు పెడుతుంది? శరీరంలో కలిగే మార్పులు ఏంటి? తెలుసుకుంటే..
అల్పాహారం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే తీసుకునే ఆహారం.  ప్రతి రోజూ ఉదయం 8 నుండి 9 గంటలలోపు అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుందని..
ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో ఆహారం వండుకోవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  ఇంట్లోనూ,  బయటా రెండు చోట్లా ఒత్తిడితో కూడుకున్న పనులు...
ఇనుప పాత్రలలో వండిన పదార్థాలు   ఆరోగ్యానికి ఎంతో మంచివి. నాన్ స్టిక్,  అల్యూమినియం తో ఇనుప పాత్రలలో వండిన ఆహారం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  ఇనుప పాత్రలలో వంట చేయడం..
తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్..
శరీరంలో ఏదైనా అవయవం లేదా ప్రాంతం అసౌకర్యానికి లోనైనప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  సాధారణంగా శరీరంలో కలిగే నొప్పులు  ఒకటి రెండు రోజులలో వాటికవే తగ్గిపోతాయి....
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.