గండిపేటలో బీఆర్ఎస్ వర్క్‌షాప్...అసెంబ్లీ వ్యూహాలపై దిశానిర్దేశం

Publish Date:Mar 10, 2026

Advertisement

 

హైదరాబాద్‌లోని గండిపేట వద్ద గోల్కొండ రిసార్ట్స్‌లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉమ్మడి ఓరియంటేషన్ వర్క్‌షాప్ నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలను సభలో ఎలా లేవనెత్తాలనే అంశాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్ రావు ప్రజాప్రతినిధులకు మార్గదర్శనం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ మూడో బడ్జెట్ కావడంతో దానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పదవీకాలం సగానికి చేరుకున్న నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని నిర్ణయించామని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు వైఫల్యాన్ని, ప్రజలతో చేసిన మోసాన్ని బడ్జెట్ సమావేశాల్లో బహిర్గతం చేయడానికి పార్టీ వ్యూహరచన చేసిందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీలో కమిటీల ఏర్పాటులో నిర్లక్ష్యం కొనసాగుతోందని కేటీఆర్ విమర్శించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన వ్యక్తికి ఇవ్వడం తప్ప మరే కమిటీని ఏర్పాటు చేయలేదన్నారు. సెలెక్ట్ కమిటీ, స్టాండింగ్ కమిటీ, పిటిషన్స్ కమిటీలు లేకపోవడం, డిప్యూటీ స్పీకర్ కూడా లేకపోవడం శాసనసభ వ్యవస్థను బలహీనపరుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం కేవలం బలవంతంగా సభను నడిపిస్తున్నదని ఆరోపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ విధానంతో ఇళ్లను కూల్చివేస్తోందని, అదే విధంగా అసెంబ్లీలో కూడా మందబలంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. సభలో అబద్ధాలు చెప్పడం, అంకెల గారడీ చేయడం ద్వారా సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నదని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినా, రెండున్నర సంవత్సరాలైనా అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు. అందుకే ఆరు గ్యారెంటీల అమలుకు ప్రైవేట్ మెంబర్ బిల్లును బీఆర్ఎస్ తరఫున తీసుకురావాలని నిర్ణయించామని చెప్పారు. ఆ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.

రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు పథకాన్ని పక్కన పెట్టి ఇతర కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆయన విమర్శించారు. ఖమ్మం ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన బాధితులు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, పేద దళితులు, గిరిజనుల సమస్యలను అసెంబ్లీలో బలంగా లేవనెత్తుతామని తెలిపారు. అలాగే దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలకు హామీ ఇచ్చిన నిధులు ఎందుకు కేటాయించలేదో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు.

మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ పేరుతో అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది. లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల పేరుతో వేలాది ఇళ్లను కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు మధుసూదనాచారి, బండ ప్రకాష్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు మాట్లాడి అసెంబ్లీ వ్యూహాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. భవిష్యత్తులో కూడా శాసనసభ, శాసనమండలి సభ్యుల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని పార్టీ నేతలు తెలిపారు.

By
en-us Political News

  
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు.
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రంతో ముగిసింది.
రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.
చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ లేకుండా రోజే కదలదు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వద్దు జగ్గారెడ్డి సంచలన పోస్ట్
ఇరాన్‌పై అగ్రదేశం అమెరికాతో కలిసి దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెనత్యాహూ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారంట
ఒక మత చిహ్నానికి ప్రాధాన్యతనిచ్చి, మరో మత సంప్రదాయాలను కించపరచడం సెలెక్టివ్ టార్గెటింగ్ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా లెన్స్ ‌కార్ట్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడంతో.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు కనిపించడంతో.. సంస్థ సీఈఓ పేయుష్ బన్సల్ రంగంలోకి దిగారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
ఒకటి.. హిజాబ్, టర్బన్ అనుమతి.. అంటే నల్లరంగు హిజాబ్, నల్ల టర్బన్ ధరించవచ్చు. హిజాబ్ ఛాతీ వరకు కవరేజ్ ఉండాలి, కంపెనీ లోగో కనిపించేలా ఉండాలి. అయితే బుర్ఖా మాత్రం స్టోర్లో అనుమతించబడదని గైడ్లో ఉంది. రెండు..బొట్టు, తిలకం చేతితాడుపై నిషేధం.. ఆ డాక్యమెంట్ లో మత చిహ్నం అయిన తిలకం, బింది, స్టిక్కర్ లకు అనుమతి లేదని స్పష్టంగా ఉంది. అలాగే మతపరంగా చేతికి కట్టుకుని తాడు కూడా నిషేధం అని విస్పష్టంగా ఉంది.
ఢిల్లీ హత్యాచార నిందితుడు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే నోరెళ్ల పెడుతున్నారు
ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశ జనాభా పెరుగుదల రేటు కంటే విద్యార్థుల ఆత్మహత్యల రేటు వేగంగా పెరుగుతోంది. 15 నుండి 20 ఏళ్ల లోపు యువతలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.
ర్యాంకు ఒక లక్ష్యం కాదు.. గుర్తింపుగా సమస్యగా మారుతుంది. పదమూడు ఏళ్ల వయసులోనే జేఈఈ చేయాలి అనే సందేశం బాల్యాన్ని ముందుగానే ముగిస్తుంది. దాని తరువాత వస్తున్న జీవితాన్ని ఎలా జీవించాలో మాత్రం ఎవ్వరూ నేర్పరు. ఫలితంగా, అడ్మిషన్ తర్వాత కలిగే శూన్యత, అపరాధ భావం, వెనుకబడిపోతానేమోనన్న భయం ఇవన్నీ కలిసి కలిసి మానసిక కృంగుబాటుగా మారతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.