కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ సెంటిమెంట్!

Publish Date:Sep 19, 2024

Advertisement

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌టంతో పార్టీలో కీల‌క ప‌ద‌వుల‌ను ద‌క్కించుకునేందుకు నేత‌లు పోటీ ప‌డుతున్నారు. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం కాంగ్రెస్ నేత‌లు అనేక మంది పోటీప‌డ్డారు. వారిలో సీనియ‌ర్లు, జూనియ‌ర్లు కూడా ఉన్నారు. అయితే  సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న‌ల‌తో  పార్టీ అధిష్టానం బీసీ వ‌ర్గానికి చెందిన  సీనియ‌ర్ నేత‌ మహేష్ కుమార్ గౌడ్ కు టీపీసీసీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. దీంతో  రెండు రోజుల కిందట ఆయ‌న టీపీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను చేపట్టారు. ఇప్పుడు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విపై సీనియ‌ర్ నేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు.  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ద‌క్కితే అదృష్టం క‌లిసొస్తుంద‌ని కాంగ్రెస్  నేత‌లు భావిస్తున్నారు. గ‌తంలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్య‌లు చేప‌ట్టిన‌వారు ప్ర‌స్తుతం  ప్రభుత్వంలో కీలక పదవులలో ఉన్నారు. దీంతో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు పార్టీలోని సీనియ‌ర్‌, జూనియ‌ర్ నేత‌లు పోటీలు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే పార్టీ అధిష్ఠానంపెద్ద‌ల‌తోపాటు, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ముఖ్య‌ నేత‌ల‌ను సంప్ర‌దించి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి త‌న‌కు ద‌క్కేలా చూడాల‌ని ఆశావ‌హులు కోరుతున్నారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి పోటీ ఎక్కువ‌గా ఉండ‌టంతో  ఈసారి ముగ్గురు లేదా న‌లుగురిని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియ‌మిస్తే బాగుంటుంద‌ని పార్టీ పెద్ద‌లు భావిస్తున్నారని సమాచారం.

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత కాంగ్రెస్ పార్టీలో  మొట్ట‌మొద‌టి సారిగా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును క్రియేట్ చేశారు. అప్ప‌టి నుంచి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులో కొన‌సాగిన‌వారంతా ప్ర‌స్తుతం మంచి ప‌ద‌వుల్లో కొన‌సాగుతున్నారు. మంత్రి, డిప్యూటీ సీఎం, సీఎం స్థాయిలో కొన‌సాగుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ద‌క్కించుకోవ‌టం అంటే అదృష్టాన్ని వెంట‌పెట్టుకొని ప్ర‌యాణించ‌డ‌మేన‌న్నసెంటిమెంట్ బలపడింది. తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత పార్టీ తొలి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆ త‌రువాత జ‌రిగిన జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ లో పార్టీ అశించిన స్థాయిలో రాణించ‌క‌పోవ‌టంతో  టీపీసీసీ ప్రెసిడెంట్ గా కొన‌సాగుతున్న పొన్నాల ల‌క్ష్మ‌య్య‌ను బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి.. ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి   పార్టీ అధిష్ఠానం ప్ర‌మోష‌న్ ఇచ్చింది. దీంతో పొన్నాల స్థానంలో ఉత్త‌మ్ టీపీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తాజాగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆయ‌న‌ కీల‌క శాఖ‌ల‌కు మంత్రిగా కొన‌సాగుతున్నారు. దీనికితోడు ప్ర‌భుత్వంలో కీల‌క వ్య‌క్తిగా కొన‌సాగుతున్నారు. ఉత్త‌మ్ టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విలో ఉన్న స‌మ‌యంలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా భ‌ట్టి విక్ర‌మార్క బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌రువాత భ‌ట్టి గ్రాఫ్ పార్టీలో ఒక్కసారిగా పెరిగింది. పార్టీ జాతీయ స్థాయి నాయకులతో మంచి ప‌రిచ‌యాలు ఏర్ప‌డ్డాయి. ఆ త‌రువాత‌కాలంలో భ‌ట్టి విక్ర‌మార్క‌కు అధిష్ఠానం కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ వ‌చ్చారు. సీఎల్పీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ గా, సీఎల్పీ లీడ‌ర్ గా ఆయ‌న‌ ఎంపిక‌య్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఉప ముఖ్య‌మంత్రిగా భ‌ట్టి కొన‌సాగుతున్నారు. ప్ర‌భుత్వంలో నెం.2 స్థానంలో కొన‌సాగుతున్నారు.  

భ‌ట్టి విక్ర‌మార్క త‌రువాత కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం స్థానంలో ఉన్నారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొన్నాళ్ల‌కే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను   పార్టీ అధిష్టానం కట్టపెట్టింది. ఆ త‌రువాత రేవంత్ త‌న‌దైన  శైలిలో ప్ర‌త్య‌ర్థి పార్టీల వ్యూహాల‌కు చెక్‌ పెడుతూ గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కేంద్ర పార్టీ పెద్ద‌లు రేవంత్ రెడ్డికే సీఎంగా పగ్గాలు అప్ప‌గించారు.  ఇక రేవంత్ కు అధిష్ఠానం వద్ద కూడా పలుకుబడి పెరిగింది. రాహుల్ గాంధీకి న‌మ్మ‌కైన వ్య‌క్తిగా కొన‌సాగుతున్నారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన నాటినుంచి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన వారంతా ప్ర‌స్తుతం మంచి స్థాయిల్లో ఉన్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి దక్కడమంటే అదృష్టం తలుపుతట్టడమే అన్న సెంటిమెంట్ పార్టీ రాష్ట్ర నేతలలో ఏర్పడింది. 

బీసీ వ‌ర్గానికి చెందిన మ‌హేశ్ కుమార్ గౌడ్ కు టీపీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో.. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఎస్సీ సామాజిక వ‌ర్గ నేత‌ల‌కు ద‌క్కుతుంద‌న్న వాద‌న పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తుంది. అయినా, అన్ని వ‌ర్గాల‌వారు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు పోటీ ప‌డుతున్నారు. ఢిల్లీలోని పార్టీ పెద్ద‌ల ద్వారా, రాష్ట్రంలోని పార్టీ పెద్ద‌ల ద్వారా ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు రాయ‌బారాలు న‌డుపుతున్నార‌ు. ఇప్ప‌టికే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం పోటీప‌డుతున్న ఇరవై నుంచి ముప్పై మందికి పైగా నేత‌ల పేర్లు అధిష్టానం వ‌ద్దకు చేరిన‌ట్లు తెలుస్తోంది. పోటీ ఎక్కువ‌గా ఉండ‌టంతో అన్నివ‌ర్గాల వారిని సంతృప్తి ప‌ర్చేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని ముగ్గురు లేదా న‌లుగురికి ఇచ్చేలా నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. బీసీ వ‌ర్గానికి చెందిన మ‌హేశ్ కుమార్ గౌడ్ కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో.. మిగిలిన ఎస్సీ, ఓసీ, మైనార్టీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాల నుంచి ఒక్కొక్క‌రికి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని అధిష్టానం పెద్ద‌లు భావిస్తున్నార‌ని కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతోంది.  

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.