మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం కొత్త దిశ : మంత్రి సీతక్క

Publish Date:May 31, 2026

Advertisement

 

తెలంగాణ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన మహిళా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. మే 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, నాయకత్వ వికాసం, మహిళా భద్రత, బాలికల అభివృద్ధి, పారిశ్రామిక ప్రోత్సాహం వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వారోత్సవాలు గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం, యువతుల్లో నాయకత్వ లక్షణాల పెంపును ప్రధాన లక్ష్యాలుగా ముందుకు తీసుకెళ్లాయి.

వారోత్సవాల ప్రారంభ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి భవనాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్య కార్యాలయాలు, వర్క్‌షెడ్లు, గోదాముల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. మహిళా సంఘాల సభ్యులతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిలుకపచ్చ రంగు యూనిఫాం చీరలను కూడా ఆవిష్కరించారు.

ఖమ్మం జిల్లా మధిరలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవం వారోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మహిళలు పునరుత్పాదక ఇంధన రంగంలోనూ విజయవంతంగా రాణించగలరనే సందేశాన్ని ఈ కార్యక్రమం రాష్ట్రానికి అందించింది.

మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా POSH చట్టంపై అవగాహన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు నిర్వహించారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం “బాల్య వివాహం – బతుకు ఆగం” పేరిట ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టి సమాజంలో చైతన్యం కల్పించారు.

మహిళలను ఉద్యోగాలు కోరుకునే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రుణమేళాలు, జీవనోపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలు, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

చిన్నారుల ఆరోగ్యం, పోషణకు ప్రాధాన్యతనిస్తూ “బలమైన బాల్యానికి 1000 మెట్లు” కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు. తొలి వెయ్యి రోజుల ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ముగింపు రోజున నిర్వహించిన “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమంలో చిన్నారులకు యూనిఫారాల పంపిణీ, విద్యారంభ ధృవపత్రాల అందజేత, మహిళల అక్షరాస్యతకు సంబంధించిన కార్యక్రమాలు విశేష స్పందన పొందాయి.

అలాగే స్నేహ సంఘాల బాలికలతో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమాలు యువతుల్లో నాయకత్వ సామర్థ్యాలను వెలికితీశాయి. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించడంతో పాటు నిర్ణయాత్మక స్థానాల్లో మహిళల పాత్ర ఎంత కీలకమో తెలియజేశాయి.

వారంరోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో లక్షలాది మంది మహిళలు, బాలికలు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములయ్యారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరగడం, మహిళల్లో వ్యాపార ఆలోచనలు బలోపేతం కావడం, నాయకత్వ లక్షణాలు పెంపొందడం వంటి సానుకూల ఫలితాలు కనిపించాయి.

మహిళా సాధికారతను ప్రజా ఉద్యమంగా మలచాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ఈ వారోత్సవాలు బలమైన పునాది వేశాయని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు బలపడితే కుటుంబం, సమాజం, రాష్ట్రం బలపడుతుందనే నమ్మకంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు.

By
en-us Political News

  
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.