ఐపీఎల్ విజేత ఆర్సీబీ

Publish Date:May 31, 2026

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  నిలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. కింగ్ కోహ్లీ  75 నాటౌట్; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు అద్భుతమైన అర్ధశతకంతో జట్టును ముందుండి నడిపించి విజయతీరాలకు చేర్చాడు.

156 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా కోహ్లీ, తన మణికట్టు మాయాజాలంతో అద్భుతమైన ఫ్లిక్స్, పుల్ షాట్లతో కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. మరోవైపు,  మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పటికీ వెంకటేశ్ అయ్యర్ 16 బంతుల్లో 32  దూకుడుగా ఆడాడు. ఈ జోడీ కేవలం 21 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఐపీఎల్ ఫైనల్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది.

అయితే, వెంకటేశ్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ స్వల్ప వ్యవధిలో ఔటవడంతో ఆర్సీబీ కాస్త నెమ్మదించింది. రజత్ పాటిదార్  కొన్ని చక్కటి షాట్లు ఆడి 14 పరుగులు చేసి ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో పటీదార్‌ను, కృనాల్ పాండ్యా  ను ఔట్ చేయడంతో  మ్యాచ్ ఉత్కంఘఠభరితంగా మారుతున్నట్లు కనిపించింది. అయితే..   కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పటికీ కోహ్లీ  చూడచక్కని షాట్లతో కేవలం పాతిక బంతుల్లోనే బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని జట్టుపై ఒత్తిడిని తగ్గించాడు. 

టిమ్ డేవిడ్  త్వరగానే ఔటయినా, కోహ్లీ తన క్లాస్ ఆటతీరుతో జట్టును గెలిపించాడు. 63 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ పట్టిన డైవింగ్ క్యాచ్‌ను రీప్లేలలో బంతి నేలను తాకినట్లు తేలడంతో కోహ్లీకి లైఫ్ లభించింది. ఆ తర్వాత, అర్షద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది ఆర్సీబీకి ఘనవిజయాన్ని అందించాడు.

తొలుత  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..  కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేసింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు   చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్  50 నాటౌట్, 37 బంతుల్లో   జట్టులో అత్యధికపరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.   ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

  ఆర్సీబీ ఈ విజయంతో... వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల సరసన చేరింది. కెప్టెన్ గానూ రజత్ పటీదార్ వరుసగా రెండు టైటిళ్లతో రికార్డు పుటల్లోకెక్కాడు.  సీఎస్కే జట్టు 2010, 2011లో వరుసగా టైటిళ్లు గెలవగా... ముంబై ఇండియన్స్ 2019, 2020లో విజేతగా నిలిచింది. ఆర్సీబీ 2025, 2026లో టైటిళ్లు గెలిచి ఆ రెండు జట్ల సరసన చేరింది.

2025లో ఇదే స్టేడియంలో తొలి టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత తమ టైటిల్‌ను నిలబెట్టుకున్న మూడో జట్టుగా నిలిచింది. అంతేకాకుండా, మహిళల ప్రీమియర్ లీగ్ , ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిళ్లను ఒకేసారి కలిగి ఉన్న ఏకైక ఫ్రాంచైజీగా అరుదైన ఘనత సాధించింది.  

By
en-us Political News

  
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.