మహిళల టి20 వరల్డ్ కప్.. పాకిస్థాన్ ను చిత్తు చేసిన బంగ్లాదేశ్

Publish Date:Jun 20, 2026

Advertisement

మహిళల టీ20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదైంది. బంగ్లాదేశ్ మహిళల జట్టు పాకిస్థాన్ విమెన్స్ టీమ్ న చిత్తు చేసింది.  . గ్రూప్-1లో భాగంగా శనివారం (జూన్ 20) జరిగిన కీలక పోరులో పాకిస్థాన్ జట్టుపై బంగ్లాదేశ్ మహిళల జట్టు 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. పటిష్ఠమైన బౌలింగ్ ప్రదర్శనతో పాక్ బ్యాటింగ్ విభాగాన్ని కట్టడి చేసిన బంగ్లాదేశ్.. ఈ విజయంతో    తమ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

సౌతాంప్టన్‌లోని  రోజ్ బౌల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత  బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.   కెప్టెన్ నిగర్ సుల్తానా 36 పరుగులు, శోభన మోస్తరీ22 పరుగులతో రాణించారు. ఇక చివరి  ఓవర్లలో షోర్నా అక్తర్   కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో అజేయంగా 39 పరుగులు సాధించడంతో బంగ్లా జట్టు ఆ మాత్రం స్కోరైనా చేరగలిగింది.  పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా రెండు వికెట్లు పడగొట్టింది.

అనంతరం 124 పరుగుల  లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టుకు మంచి ఆరంభమే లభించింది. మునీబా అలీ పాతిక పరుగులు, గుల్ ఫిరోజా 23 సరుగులు చేశారు. దీంతో ఒక దశలో పాకిస్థాన్  రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే ఆ తర్వాత బంగ్లాదేశ్ స్పిన్ బౌలర్లు మ్యాచ్‌ను తిప్పేశారు.  బంగ్లాదేశ్ స్పిన్ ద్వయం నహిదా అక్తర్, సంజిదా అక్తర్ మేఘల   పాకిస్థాన్ మిడిలార్డర్‌ను కుప్పకూల్చారు. వీరిద్దరూ చెరో మూడు వికెట్లు పడగొట్టి పాక్ ను కోలుకోలేని దెబ్బ తిశారు.   దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ జట్టు 8 వికెట్ల నష్టానికి కేవలం 100 పరుగులు మాత్రమే చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది. 

ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన పాక్ జట్టు పాయింట్ల పట్టికలో  దిగువ స్థానానికి పడిపోయింది. ఈ వరుస పరాజయాలతో ఆ జట్టు సెమీఫైనల్ చేరే అవకాశాలు దాదాపుగా మృగ్యమయ్యాయి.  మరోవైపు ఈ  విజయంతో బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి.  

By
en-us Political News

  
ఆసియా-పసిఫిక్ రీజియన్‌లోనే తొలిసారిగా హాంకాంగ్ వేదికగా 2027 పూమా హైరాక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ (PUMA HYROX World Championships) జరగనున్నాయి. దీనికి సంబంధించిన తేదీలు, వేదిక మరియు అద్భుతమైన రికార్డుల వివరాలు మీకోసం.
ప్రముఖ మార్కెట్ నిపుణులు ఆశిష్ చతుర్మోహతా విశ్లేషణ ప్రకారం స్టాక్ మార్కెట్ తదుపరి ర్యాలీని నడిపించే బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, మరియు మిడ్‌క్యాప్ సెక్టార్ల పూర్తి వివరాలు మీకోసం
WHOOP ఫిట్‌నెస్ ట్రాకర్ ఎలా పనిచేస్తుంది? స్ట్రెయిన్, రికవరీ మరియు స్లీప్ ట్రాకింగ్ ఫీచర్లతో మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
22 ఏళ్ల వయసులోనే ₹15,000 కోట్ల డిఫెన్స్ టెక్నాలజీ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈథన్ థోర్న్టన్ (Ethan Thornton) స్ఫూర్తిదాయక విజయం, మాక్ ఇండస్ట్రీస్ సంచలన రికార్డుల గురించిన పూర్తి వివరాలు మీకోసం.
భారత స్టాక్ మార్కెట్ లో నేడు పండగ వాతావరణం నెలకొంది. సెన్సెక్స్ 400 పాయింట్లు జంప్ చేయగా, నిఫ్టీ 24,100 మార్కును దాటి దూసుకుపోయింది. రిలయన్స్, ఐటీ షేర్ల ర్యాలీ వివరాలు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మరియు ఐపీఓ అప్‌డేట్స్ ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
గ్లోబల్ ఐటీ దిగ్గజం అక్సెంచర్ ఇచ్చిన షాక్‌తో భారతీయ ఐటీ రంగంలో 1.35 లక్షల కోట్ల రూపాయల సంపద హరించుకుపోయింది. 52 వారాల కనిష్టానికి పడిపోయిన ఇన్ఫోసిస్, టీసీఎస్, కోఫోర్జ్ షేర్లు మళ్లీ కోలుకుంటున్న తరుణంలో మార్కెట్ నిపుణులు ఇన్వెస్టర్లకు ఇస్తున్న కీలక సూచనలు మరియు టార్గెట్ లెవెల్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
ఖతార్‌లోని ప్రముఖ రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలోని బర్జన్ గ్యాస్ ప్లాంట్‌లో ఘోర పేలుడు సంభవించింది. 54 మంది గాయపడగా, 18 మంది గల్లంతయ్యారు. ప్రపంచ ఇంధన మార్కెట్‌పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
న్యూజిలాండ్‌తో జరిగిన ఓవల్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ 12 డబ్ల్యూటీసీ పాయింట్ల కోత విధించింది. అలాగే ఆటగాళ్లకు 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026లో కేవలం 10 రోజుల్లోనే 8 ఓన్ గోల్స్ నమోదయ్యాయి. 2018 రష్యా రికార్డును బద్దలు కొట్టే దిశగా సాగుతున్న ఈ విచిత్రమైన ఫుట్‌బాల్ రికార్డుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రకాల, భూపాలపల్లి ప్రధాన రహదారిపై సరిగ్గా జిల్లా రవాణా అధికారి కార్యాలయం ముందే ఈ ప్రమాదం జరిగింది. రవాణా శాఖకు చెందిన సిబ్బందితో కలిసి డీటీఓ వెంకన్న కార్యాలయం ముందు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు.
పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఒక భారీ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ సర్వీసు బస్సు పుల్లంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.
విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్.. కీచకుడిగా మారి.. ఏఐ టూల్స్ సహాయంతో తన వద్దే చదువుకునే ఒక మైనర్ విద్యార్థినిపై మానసిక దాడికి తెగబడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన సదరు ఉపాధ్యాయుడిని విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ట్రంప్ చేసిన ఈ అవమానకరమైన, బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసి చర్చలను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వాకౌట్ చేశారు. దీంతో చర్చలు విఫలమై కథ మళ్లీ మొదటికొచ్చిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.