డ్రోన్ల నిఘాతో మహిళల రక్షణ.. తమిళనాడు సీఎం విజయ్,

Publish Date:Jun 10, 2026

Advertisement

తమిళనాడులో మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయనో  కీలక నిర్ణయం తీసుకున్నారు.   ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులు, అత్యాచారాలు,  సామాజిక వేధింపుల ఘటనల నేపథ్యంలో  మహిళా రక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టానీ, ఇందుకోసం  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని సీఎం విజయ్ నిర్ణయించారు. 

రాష్ట్రంలో మహిళల భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు తమిళనాడు వ్యాప్తంగా హైటెక్ డ్రోన్ నిఘా వ్యవస్థను  ఏర్పాటు చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు.  తమిళనాడు చరిత్రలోనే ఇటువంటి ఒక అధునాతన సాంకేతిక నిఘా వ్యవస్థను మహిళా రక్షణ కోసం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.  ఈ సరికొత్త ప్రాజెక్ట్ కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీగా పేరుగాంచిన సింగపూర్ డ్రోన్ సాంకేతికతను (రాష్ట్ర ప్రభుత్వం వినియోగించబోతోంది. దీని ద్వారా రాత్రి పగలు తేడా లేకుండా మహిళల కదలికలపై నిఘా ఉంచి, ప్రమాదకర ప్రాంతాలలో వారికి తగిన రక్షణ కల్పించనున్నారు.

ఈ ప్రతిష్టాత్మకమైన డ్రోన్ నిఘా ప్రాజెక్ట్ కోసం సీఎం విజయ్  354 కోట్ల రూపాయల  బడ్జెట్‌ను కేటాయించారు. ఈ నిధులతో  అత్యాధునిక డ్రోన్లను కొనుగోలు చేయడంతో పాటు, పర్యవేక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా తమిళనాడు పోలీస్ శాఖకు ప్రత్యేక యాప్‌లను అందించనున్నారు.  డ్రోన్ల ద్వారా లభించే సమాచారాన్ని విశ్లేషించడం, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించడం వంటి అంశాలపై పోలీసు సిబ్బందికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ  ఇవ్వడంతో పాటు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు సీఎం విజయ్ చెప్పారు. మహిళలకు ఎక్కడైనా ముప్పు పొంచి ఉందని తెలిస్తే, ఈ డ్రోన్ల ద్వారా వెంటనే గుర్తించి పోలీసులు రంగంలోకి దిగేలా ఈ యాప్ ఆధారిత వ్యవస్థ పనిచేస్తుందన్నారు. 

 ఆంధ్రప్రదేశ్‌లో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి, గంజాయి సాగుపై నిఘా పెట్టడానికి డ్రోన్ వ్యవస్థను వాడుతుండగా, తమిళనాడులో సీఎం విజయ్   మహిళల భద్రత కోసం ఈ టెక్నాలజీని   రంగంలోకి దించుతున్నారు.  సీఎం విజయ్ తీసుకున్న ఈ   నిర్ణయం పట్ల సర్వతరా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

By
en-us Political News

  
దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాదని నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మల్కాజ్‌గిరిలో సంచలనం సృష్టించిన నిషారాణి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదం పెను సంచలనంగా మారింది.
మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాల యానికి తరలించారు. లిక్కర్ రవాణా వ్యవహారా ల్లో ఆయన పాత్రపై అధి కారులు విచారణ చేపట్టారు.
కోడి కూర చేయడానికి ఓపిక లేదనీ, రేపు వండుతానని చెప్పింది. అయితే తప్పతాగి ఉన్న రమేశ్ కోడి కూర ఇప్పుడే వండాలంటూ భార్యపై చేయి చేసుకున్నాడు.
పలావు ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్ 24 మంది భారతీయ సిబ్బందితో గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా వెళుతోంది. ఇరాన్ చమురు రవాణాపై అమెరికా విధించిన ఆంక్షలను ఈ నౌక ఉల్లంఘించిందనే నెపంతో, యూఎస్ సెంట్రల్ కమాండ్ కు చెందిన యుద్ధ విమానాలు ఈ నౌకపై దాడి జరిపాయి.
ఖమ్మంలో కీచకుడి దాడిలో గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.
పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ (TMC) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది.
గతంలో సిట్ కేవలం సాధారణ అవినీతి నిరోధక చట్టాల కింద విచారణ జరపగా, ఈడీ ఎంట్రీ తో కథ కొత్త మలుపు తిరిగింది. మద్యం సిండికేట్లు, వివిధ షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి? హవాలా మార్గాల ద్వారా విదేశీ ఖాతాల్లోకి ఎలా తరలిపోయాయి? అనే మనీ ట్రయిల్ గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు ఈడీ సిద్ధమైంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సాధారణంగా తనదైన దూకుడు రాజకీయ శైలితో, వాడీవేడి వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ షాక్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రూట్ ఎందుకు ఆలస్యం కానుంది? రియల్ ఎస్టేట్‌పై చూపే ప్రభావం, రాజకీయ దుమారం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తనిఖీల్లో అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందిస్తున్నట్లు, సరైన అనుమతులు లేకుండానే చికిత్సలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల్లో అధికారులు పలు క్లినిల్ లను పరిశీలించి, రికార్డులు, వైద్య సిబ్బంది అర్హతలు, చికిత్సల విధానాలపై సుదీర్ఘంగా విచారణ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.