పొదిలిలో జగన్ కు నిరసనల సెగ!

Publish Date:Jun 11, 2025

Advertisement

జగన్ పొదిలి పర్యటన రసాబాసగా మారింది. పోగాకు వేలం కేంద్రం సందర్శన అంటూ పొదిలిలో పర్యటించిన జగన్ కు నిరసనల సెగ గట్టిగా తగిలింది. జగన్ సొంత మీడియా చానెల్ లో అమరావతిపైనా, అమరావతి మహిళలపైనా జర్నలిస్టు కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు, వాటికి సాక్షి ఉద్యోగి, మరో సీనియర్ జర్నలిస్టు అయిన కొమ్మినేని శ్రీనివాసరావు వంత పాడినట్లుగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. మరో జర్నలిస్టు కృష్ణంరాజు పరారీలో ఉన్నారు.  హైకోర్టులు ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు.

ఈ తరుణంలో జగన్ పొదిలి పర్యటనకు బయలుదేరారు. దీంతో ఆయన పర్యటన పొడవునా నిరసనలు వెల్లువెత్తాయి. పెద్ద సంఖ్యలో జనం ముఖ్యంగా మహిళలు రోడ్లపైకి వచ్చి జగన్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. షేమ్ షేమ్ జగన్  అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు చేశారు. నల్లబెలూన్లు ప్రదర్శించారు. జగన్ సొంత మీడియా చానల్ లో ప్రసారమైన అసభ్య వ్యాఖ్యలను ఖండించకపోవడమే కాకుండా, ఆ వ్యాఖ్యలు చేసిన వారిని సమర్ధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ మౌనం వీడాలి, జగన్ రాష్ట్రం వీడాలి అంటూ నినాదాలు చేశారు. అలాగే భారతీరెడ్డి మౌనం వీడాలి అంటూ మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అలా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై వైసీపీ మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. వైసీపీ మూకల దాడిలో కొందరు మహిళలు గాయపడ్డారు. అలాగే రాళ్లదాడిలో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు.

సరే ఎలాగో పొగాకు వెలం కేంద్రానికి జగన్ వెళ్లారు. అక్కడ ఆవుకథలాంటి ప్రసంగం చేశారు. అయితే వైసీపీ మూకల హంగామా పొగాకు రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. వైసీపీ శ్రేణులు పోగాకుబేళ్లను తొక్కుతూ నానా హంగామా చేసి రైతులకు నష్టం కలిగేలా ప్రవర్తించారు. ఇక పొగాకు రైతులను ఉద్దేశించి జగన్ తనదైన మార్క్ ప్రసంగం చేశారు. పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  పొగాకు రైతులకు అండగా ఉంటానన్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.