పెళ్లైన మహిళ జీవితాన్ని నాశనం చేసే విషయాలు ఇవే..!

Publish Date:May 8, 2025

Advertisement

 

 


పెళ్లి ప్రతి మహిళ జీవితంలో చాలా ముఖ్యమైన దశ.  కేవలం మహిళలకే కాదు.. మగవారికి కూడా ఇది ముఖ్యమైన దశే. కానీ పెళ్లి కారణంగా జరిగే అన్యాయం,  నష్టం మగవారితో పోలిస్తే ఆడవారికే ఎక్కువగా ఉంటోంది.  మగవారి కంటే ఆడవారే పెళ్లి తర్వాత జీవితాన్ని నష్టపోతున్న వారు అధికంగా ఉంటున్నారు.  పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరూ సర్దుకుపోమ్మా..అని అమ్మాయిలకే చెబుతూ ఉంటారు. అలాగే.. వివాహ బంధం విఫలమైతే కాపురం నిలబెట్టుకోలేక పోయింది అనే మాట కూడా  అంటారు.  అయితే అసలు వైఫల్యం వరకు ఎందుకు వెళుతుంది.  పెళ్లి తర్వాత మహిళల జీవితాన్ని దెబ్బతీసే అంశాలు ఏంటి? తెలుసుకంటే..

పెళ్లి..

పెళ్లి అనేది ఆడ, మగ ఇద్దరికీ సంబంధించిన విషయం. ఇద్దరు వ్యక్తులు ఒక జంటగా మారిన తరువాత,  భార్యాభర్తలు అయిన తరువాత వారి మద్య ప్రేమ మాత్రమే కాకుండా చాలా విషయాలు ఉంటాయి. భార్యాభర్తల వరకు వస్తే.. వారి బంధం బాగానే ఉంటుంది. పెళ్ళి చేసుకుని కుటుంబాన్ని వదిలి,  భర్త తో అత్తింటికి చేరిన అమ్మాయితో అత్తింటి కుటుంబ సభ్యులు ఆరోగ్యకరమైన రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేస్తే అంతా బాగానే ఉంటుంది. కానీ చాలామంది అమ్మాయిల జీవితాల్లో ప్రేమ, గౌరవం రెండూ లోపిస్తాయి.  

ప్రేమ, గౌరవం లోపిస్తే..

ప్రతి వ్యక్తికి ప్రేమ, గౌరవం ఉన్నప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు. కానీ  అత్తారింట్లో ఒక అమ్మాయికి ప్రేమ, గౌరవం లోపిస్తే ఆ అమ్మాయి సంతోషంగా ఉండలేదు. దీనికి కారణం అత్తామామలు.  ఆ ఇంటి కుటుంబ సభ్యులు. చాలా వరకు అత్తారింట్లో ఆడపిల్లలను వారి అత్తామామలు మొదట్లో బానే మాట్లాడినా ఆ తరువాత కించపరిచి మాట్లాడుతుంటారు. ఇక అమ్మాయిలలో ఏదైనా లోపం ఉంటే మాత్రం  అదే విషయాన్ని ప్రతిసారి ప్రస్తావించి  ఆమెను మానసిక క్షోభకు గురిచేస్తూ ఉంటారు.

తోడి కోడళ్లు..

చాలా ఇళ్లలో తోడి కోడళ్ల వల్ల ఖచ్చితంగా ఒక  కోడలు బాధితురాలిగా మారుతుంది.  అత్తగారు, మామగారు, కుటుంబ సభ్యులు కోడళ్ల మధ్య జరిగే చాలా విషయాలను పట్టించుకోరు. జిత్తులమారి స్వభావం ఉన్న కోడళ్లు మంచితనంతో ఉన్నవారిని వేధిస్తూనే ఉంటారు. ఇంటి పని దగ్గర నుండి  చాలా విషయాలలో బాధపెడుతుంటారు.  

అత్తగారు..


అత్తగారు ఎప్పటికీ తల్లిలా ఉండదని,  తల్లిలా చూడలేదని చాలామంది అంటూ ఉంటారు. నిజానికి అత్తగారి విషయంలో అమ్మాయిలకు మనసులో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడటానికి కారణం కూడా అత్తగారి ప్రవర్తనే.  అత్తగారు ఎప్పుడూ కోడలికి వ్యతిరేకంగానే ఉంటారు.  కోడలు మంచిగా మాట్లాడినా సరే గిట్టని అత్తగారు ఉన్నారు.  కోడలు అత్తగారిని మెప్పించాలని,  అత్తగారికి నచ్చే పనులు చేసినా సరే.. కోడలిని విమర్మించేవారు ఎక్కువ. కోడలు ఏం చేసినా ఆమెను సూటిపోటి మాటలతో హింసించే వారు ఎక్కువగా ఉంటున్నారు. అత్తగారి ప్రవర్తన విషయంలో కోడలు తన భర్తతో ఏదైనా చెప్పినా భర్త నుండి ఆమెకు ఎలాంటి  సహకారం, ఓదార్పు ఉండవు. ఇలా ఉన్నప్పుడు కోడలు మానసికంగా దెబ్బతింటుంది.  మనసులోనే ఆమె చాలా బాధలోకి వెళుతుంది.

భర్త..

చాలామంది అమ్మాయిలు పెళ్లి తర్వాత భర్త చేసే ద్రోహానికి బలి అవుతూ ఉంటారు. చాలా మంది మగవాళ్లు పెళ్లి అనేది ఇష్టం లేకుండానే అవసరం కోసం చేసుకుంటారు.  ఇంటి పని చేయడానికి ఒక అమ్మాయి అవసరం అయిందనో.. డబ్బులు సంపాదించడానికి సంపాదించే అమ్మాయి అవసరం అయ్యిందనో.. తల్లిదండ్రుల బలవంతం మీదనో.. తల్లిదండ్రుల సంతోషం కోసమో.. ఇలా చాలా కారణాల వల్ల అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. కొందరైతే ఒకరితో ప్రేమ వ్యవహారం,  వివాహేతర సంబంధం పెట్టుకుని మరొక అమ్మాయిని పెద్దల నిర్ణయంతో పెళ్లి చేసుకుంటారు.  ఇలాంటి మగాళ్ల వల్ల అమ్మాయిలకు జీవితంలో సంతోషం అనేది ఉండదు.  జీవితాంతం వారు అత్తమామల సూటిపోటి మాటలు, భర్త నిర్లక్ష్యం మద్య సంతోషం అనేది లేకుండా బ్రతికేస్తారు.  ఇన్ని కారణాల వల్ల అమ్మాయిల జీవితాలు గందరగోళంలో పడి నాశనమవుతున్నాయి.


                                     *రూపశ్రీ.

By
en-us Political News

  
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.