పొలం కంచెగా బతుకమ్మ చీరలు! కేటీఆర్ ఇలాఖాలోనే! నాసిరకమే కారణమా?

Publish Date:Oct 13, 2020

Advertisement

దసరా పండుగకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందిస్తోంది. నాలుగేండ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం.. ఈసారి కూడా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణి జరుగుతోంది. బతుకమ్మ చీరలను ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్..  దసరాకు ఇచ్చే కానుకగా టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటారు. బతుకమ్మ చీరల పంపిణి సీఎం కేసీఆర్ కు కూడా చాలా ఇష్టమైన పథకమని చెబుతారు. అందుకే కేటీఆర్ కూడా చీరల తయారీని స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ప్రతి ఏటా బతుకమ్మ చీరల డిజైన్లను పెంచుతున్నారు. ఈసారి నాలుగు వందలకు పైగా వివిధ డిజైన్లలో బతుకమ్మ చీరలను సిద్ధం చేసినట్లు చేనేత శాఖ అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది కోటి చీరలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఆయా జిల్లాలకు 98.5 లక్షల చీరలను చేరవేశామని చెప్పారు.  

అయితే కేసీఆర్ సర్కార్, కారు పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న బతుకమ్మ చీరలే  వారికి అప్రతిష్టను తీసుకొస్తున్నాయనే చర్చ జరుగుతోంది. బతుకమ్మ చీరలు ఓ గ్రామంలో తోటకు కంచెగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని గండిలచ్చపేట గ్రామంలో ఓ వ్యక్తి తమ ఇంటి వద్ద తోటను పశువులు పాడుచేయకుండా ఉండడానికి బతుకమ్మ చీరలను కంచెగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించగా  గత ఏడాది వచ్చిన బతుకమ్మ చీరలు కట్టుకోకుండా అలాగే ఉంచి ఇలా ఉపయోగించినట్లు తెలిపాడు. బతుకమ్మ చీరలన్ని సిరిసిల్ల జిల్లాలోనే తయారవుతున్నాయి. మంత్రి కేటీఆర్ స్పెషల్ ఫోకస్ చేసే బతుకమ్మ చీరలు.. ఆయన సొంత జిల్లా, నియోజకవర్గంలోనే పొలానికి కంచెగా మారడం టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందిగా మారింది. 

మొదటి సంవత్సరం బతుకమ్మ చీరల పంపిణి సందర్భంగా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపించాయి. ప్రభుత్వం భారీగా ప్రకటనలు ఇవ్వడంతో తీసుకోవడానికి మహిళలు ఇష్టపడ్డారు. 
బతుకమ్మ చీరల కోసం మహిళలు ఎగబడ్డారు. మహిళలను అదుపు చేసేందుకు అధికారులు కొన్ని ప్రాంతాల్లో పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఊహించినట్లుగా చీరలు లేకపోవడం, నాసిరకంగా ఉండటంతో బతుకమ్మ చీరలపై మహిళల ఆసక్తి పోయినట్లు చెబుతున్నారు. అందుకే రెండో సంవత్సరం నుంచి బతుకమ్మ చీరల క్రేజీ తగ్గిపోయిందని తెలుస్తోంది. గత సంవత్సరం చాాలా బతుకమ్మ చీరలు పంచకుండా మిగిలిపోయాయని అధికారుల లెక్కల్లో తెలుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మిగిలిపోయిన చీరలు కట్టలుగా ఉన్నట్లు చెబుతున్నారు. 

ఈసారి అయితే పరిస్థితి మరి దారుణంగా తయారైందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బతుకమ్మ చీరలు తీసుకునేందుకు మహిళలు ముందుకు రాకపోవడంతో  పంపిణి కేంద్రాలు వెలవెలబోయాయి. కొన్ని ప్రాంతాల్లో చీరలు తీసుకునేందుకు రావాలంటూ గల్లిగల్లీ తిరిగి అధికారులు చాటింపు వేయించారని చెబుతున్నారు.  కొన్ని ప్రాంతాల్లో రండమ్మ రండి అని సిబ్బంది అరిచినా .. చీరల పంపిణి కేంద్రాల వైపు ఎవరూ రాలేదని చెబుతున్నారు. మహిళలు రాకపోవడంతో చేసేది లేక కొన్ని గ్రామాల్లో అధికారులే ఇంటింటికి వెళ్లి బతుకమ్మ చీరలను పంపిణి చేస్తున్నారని తెలుస్తోంది.
బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉండటమే మహిళల నిరాసక్తతకు కారణమంటున్నారు.


బతుకమ్మ చీరల నాాణ్యతపై మహిళలు బహిరంగగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. చీరలు పంచేందుకు వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీ. ఎమ్మెల్యేలతో కొన్ని ప్రాంతాల్లో మహిళలు వాగ్వాదానికి దిగుతున్నారు. నాసిరకం చీరలు మాకు అవసరం లేదంటూ వెళ్లిపోతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని తెలుస్తారు. మహిళల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో అధికార పార్టీ నేతలు చీరల పంపిణికి వెళ్లడం లేదని సమాచారం. దీంతో గతంలో  గ్రామాల్లో సందడిగా సాగిన బతుకమ్మ చీరల పంపిణి.. ప్రజాప్రతినిధులు రాకపోవడంతో ఈసారి అధికారులు, స్థానిక నేతలే సాదాసీదాగా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం, మహిళలకు పండుగ కానుక అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణి చేస్తుందని, నాసిరకంగా ఉన్నయంటూ చీరలపై రాద్ధాంతం చేయడం సరికాదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉండటంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కొందరు గులాబీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా చెప్పుకునే, కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించే బతుకమ్మ చీరలపై ప్రజల్లో వ్యతిరేకత రావడం అధికార పార్టీకి  నష్టం కలిగించేదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.