సెల్ టవర్ ఎక్కిన మహిళ.. ఎందుకంటే?
Publish Date:May 29, 2025
Advertisement
తెలుగుదేశంపార్టీ మహిళ నాయకురాలు చిప్పగిరి మీనాక్షి ఆత్మహత్య చేసుకుంటానంటూ కడప ఎన్టీఆర్ సర్కిల్ లోని సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. ఒక పక్క రాష్ర్ట స్థాయి మహానాడులో ముఖ్యమంత్రి పాల్గొంటుండడం, మరో పక్క మీనాక్షి సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేయడంతో తెలుగుదేశంపార్టీ నాయకులు ఆందోళనకు గురయ్యారు. వన్ టౌన్ పోలీసులు, ఫైర్, రెవిన్యూ సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొని టవర్ క్రింద దిగాలని కోరారు. పోలీసు అధికారుల మైకు ద్వారా మాట్లాడుతూ సెల్ టవర్ పై నుండి కింద కు దిగాలని, మీ డిమాండ్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. మిమ్మలను మహానాడు వద్దకు తీసుకు రావాలని లోకేష్ కోరారని ,వెంటనే క్రిందకు దిగితే మిమ్మలను లోకేష్ వద్దకు తీసుకు వెడతామంటూ పోలీసులు మీనాక్షికి మైకు ద్వారా కోరారు. దీంతో ఆమె కిందకి దిగి వచ్చారు. వెంటనే ఆమెనను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ మీనాక్షి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేయడానికి కారణం.. రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్నా గుర్తింపు లేదన్న ఆవేదనే. ఇదే విషయం ఆమె మీడియాకు చెప్పారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా లేఖ రాశారు. ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి దళితురాలినైన తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అన్నిటికీ మించి మహానాడుకు తన లాంటి వారికి ఆహ్వానం లేక పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/women-claimbs-cell-tower-25-198896.html





