నార్సింగి సీఐపై సైబరాబాద్ కమిషనరేట్‌లో మహిళ ఫిర్యాదు
Publish Date:Apr 26, 2026
Advertisement
సైబరాబాద్ కమిషనరేట్‌లో నార్సింగి సీఐ హరికృష్ణ రెడ్డి పై స్వాతి అనే యువతి ఫిర్యాదు చేసింది. విజయనగరం జిల్లాకు చెందిన సాయికిరణ్ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి కొంతకాలం సహజీవనం చేపి మోసం చేశాడనీ, దీంతో తాను గత ఏడాది అక్టోబర్‌లో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో సాయి కిరణ్‌పై ఫిర్యాదు చేసినట్లు స్వాతి పేర్కొంది. అయితే నార్సింగ్ సీఐ హరికృష్ణ రెడ్డి ఇన్ని నెలలు గడిచినా కూడా సాయి కిరణ్ పై సరైన విచారణ జరగలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తాను సాయి కిరణ్ వాళ్ల ఊరు విజయనగరం కు వెళితే... అక్కడ అతని తండ్రి రాజకీయ కార్యకర్త కావడంతో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు తనపై దాడి చేశారని స్వాతి ఆరోపించారు. ఇక్కడ ఉన్నది మా ప్రభుత్వం.. కేసు పెట్టినా ఏం జరగదు.. చంపేస్తామంటూ బెదరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను అక్కడ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయబోతే.. వారు హైదరాబాద్ లోనే ఫిర్యాదు చేయమన్నారని పేర్కొన్న స్వాతి.. గత ఆరు నెలలుగా తాను నార్సింగి పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని పేర్కొంది. నాన్‌బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకుండా సీఐ వెసులుబాటు కల్పిస్తున్నా రని ఆరోపించింది. కేసును రీ-ఇన్వెస్టిగేషన్ చేసి నిష్పాక్షికంగా విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.
http://www.teluguone.com/news/content/woman-files-complaint-against-narsingi-ci-at-cyberabad-commissionerate-36-218311.html





