టెక్నాలజీ పెరగడం వల్ల యువత టెక్నికల్ గా ఎంత అప్ డేట్ అవుతున్నారో తెలీదు కానీ.. క్రిమినల్ ఐడియాస్ లో మాత్రం బాగా డెవలప్ అవుతున్నారు. ఆమధ్య యూట్యూబ్ లో చూసి యువకులు బాంబు తయారు చేయడం నేర్చుకున్నారని తెలిసి షాక్ అయ్యాం. మరి ఇప్పుడు అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారుగా.. అందుకే ఆ యువకులకంటే నేనేం తక్కువ అంటూ ఓ యువతి ముందుకొచ్చింది. అయితే ఆమె బాంబు తయారుచేయలేదు. యూట్యూబ్ లో చూసి దొంగ నోట్లు ప్రింట్ చేయడం నేర్చుకుంది.
చెన్నై నగరంలోని మారియప్ప నగర్‌కు చెందిన భరణి కుమారి ఎంబీఏ పూర్తి చేసి ఇంటి వద్దనే ఖాళీగా ఉంటుంది. అయితే కుంటుంబ ఇబ్బందుల కారణంగా ఇరుగు పొరుగు వారి వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేసింది. కానీ వాటిని తీర్చలేకపోయింది. దీంతో అప్పులు ఇచ్చిన వారు.. భరణి కుమారిని అప్పు ఎప్పుడు తీరుస్తావు? ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో ఏం చేయాలో తెలియక.. భరణి కుమారి యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్లు ప్రింట్ చేయడం నేర్చుకుంది. ఆ తరువాత ఇంట్లోనే దాదాపు రూ. లక్ష విలువ చేసే దొంగ నోట్లను ప్రింట్ చేసింది. అంతేకాదు వాటిని సమీపంలోని కడలూరులో అక్కడక్కడ మారుస్తూ వచ్చింది. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంది. ఎప్పటిలాగానే దొంగ నోటు పట్టుకొని షాపింగ్ కి వెళ్ళింది. కడలూరులోని ఓ దుకాణానికి వెళ్లి సామాన్లు కొన్న భరణి నకిలీ రెండు వేల రూపాయల నోటును దుకాణ యజమానికి ఇచ్చింది. ఆయన అందరిలాగా నోటుని పైపైన చూసి గల్లా పెట్టెలో వేసుకోలేదు. బాగా గమనించి చూసాడు. నోటు క్వాలీటిలో, అమ్మాయి చూపులో ఏదో తేడా కొడుతుందే అని అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల రాకతో బిత్తర పోయిన భరణి.. దగ్గరలోని బస్టాండ్‌కు వెళ్లి చిదంబరం వెళ్లే బస్సు ఎక్కి కూర్చుంది. పోలీసులు బస్టాండ్ అంతా వెతికి బస్సులో ఉన్న భరణిని అరెస్ట్ చేసి విచారణ చేయగా.. అప్పుల భారం నుంచి తప్పించుకోవడానికే ఇలా దొంగ నోట్ల ముద్రణ ప్రారంభించినట్లు వెల్లడించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు భరణి ఇంటి నుండి.. నకిలీ రెండు వేల రూపాయల నోట్లను దాంతో పాటు ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/woman-arrested-for-printing-fake-notes-by-watching-youtube-videos-39-86139.html
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.