విజయ ‘చంద్ర’ హాసమే!

Publish Date:Jul 30, 2022

Advertisement

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిలో జోష్ చూస్తుంటే..  వచ్చే ఎన్నికల్లో ఏపీలో  టీడీపీ విజయకేతనం ఎగరేయడం ఖాయం అనే అభిప్రాయం జనంలో వ్యక్తం అవుతోంది. వైసీపీ సర్కార్ లోపాలను, అవినీతి, అక్రమాలపై అటు తన ట్విట్టర్ వేదికగా తూర్పారపట్టడంతో పాటుగా పన్నులు, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు, చెత్త మీద పన్ను లాంటి జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ’బాదుడే బాదుడు’ కార్యక్రమంతో టీడీపీ శ్రేణులు, నేతలను జనం మధ్యకు పంపారు చంద్రబాబు. దాంతో పాటుగా తాను స్యయంగా జిల్లాలను చుట్టి వస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను పాదయాత్రకు రంగం సిద్ధం చేస్తున్నారు.

మరో పక్కన ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు, పెద్ద ఎత్తున సంభవించిన వరదలతో అల్లాడిపోయిన కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ కంటే ముందే.. ప్రమాదాలకు ఎదురెళ్లి మరీ సందర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు చొరవను చూసిన గోదావరి వరద ముంపు ప్రాంతాల ప్రజలు తమ బాధల్ని మర్చిపోయి సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం.

ఇక పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను సందర్శన సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుందని చెప్పక తప్పదు. ముంపు గ్రామాలన్నింటినీ కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పడంతో ఇకపై ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లయింది. టీడీపీ అధికారంలోకి రాగానే చింటూరు ఐటీడీఏ, ఎటపాక డివిజన్ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లించలేక వైసీపీ సర్కార్ చేతులెత్తేయడంపై చంద్రబాబు నిప్పుల చెరిగారు. కేంద్రం ఇస్తేనే గానీ పరిహారం ఇవ్వడం చేతగాని దద్దమ్మ సీఎం అంటూ ఆయన తూర్పార పట్టారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కేంద్రం నుంచి ఎందుకు రావో తేలుస్తానంటూ హెచ్చరించడం విశేషం. ఒక వ్యూహం, ప్రణాళిక లేకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ తీరు వల్లే నిధులు కేటాయించలేకపోతున్నట్లు కేంద్ర మంత్రులు చెప్పడాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ఉటంకించారు.

ఏపీలో అభివృద్ధి పనులేవీ నిర్వహించకుండా.. అప్పుల ఊబిలో ప్రజల్ని దింపేసిన జగన్ సర్కార్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తున్న క్రమంలో చంద్రబాబు పరిపాలన, ఆయన అనుభవాలే ఏపీకి దిక్కు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చినట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఏపీలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా తాను స్వయంగా జనంలోకి చొచ్చుకుపోవడమే కాకుండా.. టీడీపీ నేతలు, శ్రేణులను బాధితులకు అండగా నిలపడంలో చంద్రబాబు ముందే ఉంటున్నారు. ఒక పక్కన వరద బాధిత ప్రాంతాల్లో జగన్ గాల్లోనే  తిరుగుతుంటే.. చంద్రబాబు మాత్రం వరద, బురదతో నిండిపోయి, బాధలు అనుభవిస్తున్న జనం మధ్యలోనే ఉంటున్న తీరును ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. గతంలో హుద్ హుద్ తుపాను సమయంలో, తిత్లీ తుపాను వచ్చినప్పుడు చంద్రబాబు స్వయంగా బాధిత ప్రాంతాల్లోనే మకాం వేసి మరీ సహాయక, పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించిన వైనాన్ని జనం ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.

సీఎం జగనే స్వయంగా చేయించుకున్న సర్వేలు కూడా వైసీపీ సర్కార్ కు, జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వ్యక్తం అవుతున్న తీవ్ర వ్యతిరేకత గురించే ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఇంకో పక్కన టీడీపీ, చంద్రబాబు నాయుడి గ్రాఫ్ పెరుగుతుండడం గమనార్హం. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ విజయం ఖాయమని,  సీఎంగానే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతా  అచి చంద్రబాబు చేసిన ప్రతిజ్ఞ నెరవేరే సమయం త్వరలోనే రానుందని అంటున్నారు. ఒక పక్కక పరిపాలన చేతకాక జగన్ చేతులెత్తేయడాన్ని, మరో పక్కన చైతన్యంతో చంద్రబాబు తిరుగుతున్న తీరు, ఆయనలో కనిపిస్తున్న గెలుపు ధీమాను చూస్తున్న జనం, రాజకీయ పండితులు కూడా వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని చెప్పుకుంటున్నారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.